
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
మా వాణి ...
అక్కడ తెలుగునాట ఘంటసాల యుగం ముగిసి బాలూ యుగం మొదలవుతున్న రోజులు. ముత్యాల ముగ్గు సినిమా శతదినోత్సవాలు జరుపుకుంటున్న రోజులు. ప్రిన్స్ మహేష్ బాబు బుడి బుడి నడకలు వేస్తూ మమ్మీ, డాడీ అంటున్న రోజులు. అన్ని పాఠశాలలలోనూ ఇంకా మాతృభాష నేర్పిస్తున్న మంచి రోజులు. దేవులపల్లి వారికి ఇంకా కేంద్ర సాహిత్య ఎకాడెమీ బహుమతి రాని రోజులు. ఆంద్రజ్యోతిలో అమరావతి కథలు సంచలనం సృష్టిస్తున్న రోజులు. చేరా గారి “తెలుగు వాక్యం” మన భాష ఔన్నత్యం మీద అవగాహన పెంచిన రోజులు. భారత దేశంలో ఎమర్జెన్సీ అమలులో ఉన్న రోజులు...ఇంకా ఎన్నెన్నో...
ఇక్కడ అమెరికాలో వియత్నాం యుద్దం తరువాత సద్దుమణగని అస్తవ్యస్త ఆర్ధిక పరిస్థితులు. గ్రీన్ కార్డ్ కి అప్లై చెయ్యాలంటే కొంచెం భయపడే రోజులు. తొలి తరం తెలుగు వారు తమ ఆస్థిత్వాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో సాంస్కృతిక సంఘాలు సంస్థాపించుకుంటున్న రోజులు. మన వాళ్ళతో మూడు నిముషాలు మాట్లాడి మహానందపడడానికి అమెరికన్ ఆపరేటర్ ద్వారా కాల్ బుక్ చేసుకుని గంటల తరబడి ఫోన్ కనెక్షన్ కోసం ఆత్రుతగా ఎదురుచూసే రోజులు. బాగా ధనవంతులు తప్ప ..
.

మధురవాణి నిర్వాహక బృందం
వీరాభిమాని
భువనచంద్ర
విజయవాడ రైల్వే స్టేషన్ హడావిడిగా వుంది. పదో నంబరుప్లాట్ ఫాం మరీ హడావిడిగా వుంది. స్తంభాల చుట్టూ నిర్మించిన అరుగులాంటి దిమ్మ మీద కూర్చుని చుట్టూ చూశాను. ఒకాయన ఓ పేపరు అందరికీ కనిపించేలా మడిచి పట్టుకు తిరుగుతున్నాడు. ఆ పేపర్లో ఓ ఫొటో కనిపిస్తోంది. జాగ్రత్తగా చూస్తే ఆ ఫొటో అతనిదే. నా పక్కన ఓ మధ్య వయస్కురాలుంది.
వంగూరి చిట్టెన్ రాజు
కొట్టుడు యంత్రమూ – కష్టనిష్టూరాలూ కథ
మా చిన్నప్పుడు మా ఇంట్లో నేను ఎప్పుడు ఏం మాట్లాడినా “నీకేమన్నా పిచ్చా, వెర్రా” అనే వారు మా చెల్లెళ్ళలో ఎవరో ఒకరు. ఉదాహరణకి నేను ఎన్టీ వాడి సినిమాకి వెళ్దాం అన్నాను అనుకోండి. “పక్క హాల్లో నాగేశ్వర రావు సినిమా ఉండగా ఆ బొండాం గాడి సినిమాకి వెళ్ళడం ఏమిటీ, అదీ సాంఘికం సినిమాయా?