
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
వ్యాస మధురాలు
నిర్వహణ: దీప్తి పెండ్యాల | శ్రీనివాస్ పెండ్యాల
అప్పిచ్చి’వాడు -వైద్యుడు [సైకియాట్రీలో వింత కథలు-6]
గిరిజా శంకర్ చింతపల్లి
ఇది మాయా సంసారం తమ్ముడూ!
ఒక జైలు భోగికి ఉత్తరం వచ్చింది. వాడు ఆ వుత్తరాన్ని చదివి అందరికీ దిగ్భ్రమ కలిగేలాగా వికటంగా నవ్వి అట్టహాసం చేశాడు. అందరూ వింతగా చూశారు. అప్పుడు వాడు చెప్పినదిది. "నాకొక కవల తమ్ముడున్నాడు. చిన్నప్పట్నుంచీ అందరూ వాణ్ణే మెచ్చుకునేవారు. వాణ్ణి, నన్నూ కనుక్కోలేకపోయేవారు. వాడు తప్పుచేస్తే, నన్ను కొట్టేవాళ్ళు. వాడు ఎవరితోనో దెబ్బలాడితే, నన్ను కొట్టేవాళ్ళు. నేను ప్రేమించినమ్మాయిని వాడు పెళ్ళి చేసుకున్నాడు. వాడు మర్డర్ చేస్తే నన్ను జైల్లో పెట్టారు. ఇప్పుడు భగవంతుడు న్యాయం చేశాడు. నేను చచ్చిపోతే వాణ్ణి పాతిపెట్టారు"
సాహిత్యం - కొన్ని ఆలోచనలు
మంచి సాహిత్యం అంటే?
మధు చిత్తర్వు
సాహిత్యం అంటే నవల కథా కవిత్వం ఎక్కువగా చర్చిస్తాం. ఇంకా విమర్శనా వ్యాసాలు, సాహిత్య చర్చా వ్యాసాలూ , కావ్యాలూ, నాటకాలూ, ఇతిహాసాలూ కూడా సాహిత్యం పరిధిలోకి వస్తాయి.
"సాహిత్యం సమాజానికి దర్పణం" అని చిన్నప్పటి నుంచి వినేవాడిని. సాహిత్యంలో సమాజం ఉండాలి. సామాజిక స్పృహ ఉండాలి అని ఎప్పుడూ సాహితీ విమర్శకులు విశ్లేషకుల వద్ద వినేవాళ్ళం. మంచి సాహిత్యం అంటే సమాజాన్ని చిత్రించేదీ,సామాజిక స్పృహ ఉండేదీ, విలువలని చెప్పేదీ అని ఇదే కొలబద్ద, లేక ప్రామాణికత అప్పటికీ ఇప్పటికీ.
మన తెలుగు కథ కూడా సమయమనే మార్గంలో అలాంటి పయనమే చేస్తోందని నా భావన.
తెలుగు -కన్నడాలలో మహిళా కవిత్వం -ఒక చూపు
రాజేశ్వరీ దివాకర్ల
విస్తృతమైనసాహిత్య పరిణామ చరిత్రలో ఆరంభ కాలం నుండి మహిళలు తమ ప్రాముఖ్యాన్ని స్థిరీకరించుకున్నారు.
సామాజిక స్థితిగతులను అనుసరించి స్వయం ప్రతిభను సానుకూలం కావించుకున్నారు. కాలాను గుణమైన స్వతంత్ర ప్రతిపత్తిని అనుసరించి వివిధ ప్రక్రియలలో వైవిధ్యాన్ని కలిగిస్తున్నారు. నేటి సాహిత్యం స్థితిగతులను చర్చించేందుకు నేపథ్యంగా తెలుగు కన్నడాలలో గల మహిళా రచయిత్రుల కవిత్వ రచనా ప్రతిభను నాటి నుండి నేటి వరకు పరిశీలించడం ఈ వ్యాస రచనా ఉద్దేశం.
నన్నయగారి కంటె 50 సంవత్సరాలకు పూర్వమే విరియాల కామసాని వేయించిన గూడూరు శాసనం లో మూడు చంపకమాలలు, రెండు ఉత్పలమాలలు ఉన్నాయి.
మన కథా స్రవంతి
పాణిని జన్నాభట్ల
ఎక్కడో పర్వతాల్లో ఉద్భవించి, కొండల నుంచి కిందకురికి, అడ్డుగోడలనెదిరించి, ఉధృతంగా ప్రవహిస్తూ అనాదిగా తనకంటూ ఒక అస్తిత్వాన్ని
నిలబెట్టుకుంటూ వస్తున్న జీవనది, పయనంలో కొంత దూరం వచ్చాక తన పౌరుషాన్ని మమకారంగా మార్చుకుంటుంది. తనకోసం తహతహాలాడే జనాల, జీవాల కోసం తనను తాను మలచుకొని వాగులుగా, వంకలుగా మారి వాళ్ళకి దగ్గరవుతుంది. పిల్ల కాలువై అది కొందరి కడుపు నింపితే, జలపాతమై మరికొందరి మనసు నింపుతుంది. అయినా అది సంతృప్తి చెందదు. మనకి ఇంకా దగ్గరవ్వాలనే ప్రయత్నంలో తనను తాను కొంచెం కొంచెంగా కోల్పోయి ఒక్కోసారి ‘ప్యాకేజ్డ్ వాటర్’ గా మారుతుంది, రంగు పులుముకుని ఇంకో సారి ‘కోక్ టిన్’ ల లోకి చేరుతుంది. ఎలా మారినా, ఎవరు మార్చినా చివరికి అది మనల్ని చెరుతుంది, మనలో నిండుతుంది, తన ఆత్మలో మనల్ని నింపుకుంటుంది. మన గొంతు తడపడమే తన ఆనందమని చాటిచెబుతుంది.
మన తెలుగు కథ కూడా సమయమనే మార్గంలో అలాంటి పయనమే చేస్తోందని నా భావన.