
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
కవితా వాణి
సాంబమూర్తి చెల్లూరు
చెల్లూరు సాంబమూర్తి గారు వైజాగ్ స్టీల్ లో సీనియర్ ఫోర్ మాన్ గా చేస్తున్నారు. ఉక్కు సాహితీ సమాఖ్య
నిర్వాహకులుగా పలు సాహితీ కార్యక్రమాలు చేపడుతున్నారు. లబ్ధప్రతిష్ఠులను ఎందరినో రప్పించి గౌర
విస్తున్నారు. మాతృశ్రీ కళానికేతన్ కు అధ్యక్షులు గా పలు నాటికలను వివిధ పరిషత్ లలో ప్రదర్శించి
బహుమతులు గెలిచారు.

ముద్దు వెంకట లక్ష్మి
ముద్దు వెంకట లక్ష్మి గారు ఆంధ్ర, ఆంగ్ల భాషలలో ఎం ఏ పట్టభద్రురాలు. న్యూ ఢిల్లీ లోని ఆంధ్రా ఎడ్యుకేషన్
సొసైటీ, ప్రసాద్ నగర్ పాఠ శాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. సాహిత్య, నాటక రంగాలలో అభిరుచి,
ప్రవేశం ఉన్నాయి.

సంక్రాంతి సంచిక 2016
క్రింది పేజీలు
ప్రస్తుత తాజా సంచికలో
లభ్యమవుతాయి
శ్రీమతి డేగల అనితాసూరి
సచివాలయంలో ఒక విభాగానికి అధికారిణి, 'ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, కౌముది, మయూరి,
ఆంధ్రప్రభ, సాహితికిరణం, నేటినిజం ....మున్నగు పత్రికలలో వీరి రచనలు వెలువడ్డాయి. వీరి కవితా సంపుటి
'సర్వధారి ' 'చేతన ' సచివాలయ సారస్వత వేదిక' లో 2014 ఆగస్ట్ లో ఆవిష్కరించబడింది. డా.
సి.నారాయణ రెడ్డి గారు, ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు, పరుచూరి గోపాలకృష్ణ, గౌ. నారా
చంద్రబాబునాయుడు గారు, తనికెళ్ళ భరణి, రంగనాధ్ వంటి నటులు ...వంటి ఎందరో ప్రముఖుల నుంచి
పురస్కారాలు అందుకోవడం మరపురాని అనుభూతులు.

డా.యస్వీ.రాఘవేంద్రరావు
"డాక్టర్ సంగాడి వీరరాఘవేంద్రరావు గారు రాజమండ్రి లో శ్రీకందుకూరి వీరేశలింగం ఆస్తిక కళాశాల
అధ్యాపకునిగా, పద్యకవిగా, రచయితగా, ఆంధ్ర పద్య కవితాసదస్సు తూ. గో. జిల్లాశాఖ పూర్వ ప్రధాన
కార్యదర్శిగా, పూర్వాధ్యక్షునిగా, శ్రీవిశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం గ్రంథమండలి ఉపాధ్యక్షునిగా,
నన్నయసారస్వత పీఠం పూర్వ ఉపాధ్యక్షునిగా, త్రివేణీ సమ్మేళనం పూర్వకార్యదర్శిగా సాహిత్య వ్యవసాయం
చేసిన, చేస్తున్న కవి కృషీవలురు." "పద్యకవితిలక", "సరసకవి", "ఆంధ్రశ్రీ" మొదలైన బిరుదులు
పొందారు.


వారాల ఆనంద్
వారాల ఆనంద్ గారు కవి, సినీ విమర్శకులు, డాక్యుమెంటరీ చిత్రాల దర్శకులు.
సినిమా: నవ్యచిత్ర వైతాళికులు, సినీసుమాలు, బాలల చిత్రాలు, 24 ఫ్రేమ్స్, బంగారు తెలంగాణా లో
చలన చిత్రం ; children's cinema
కవిత్వం: లయ, మానేరు తీరం, మనిషి లోపల
డాక్టర్ మాడుగుల భాస్కర శర్మ

డా. మాడుగుల భాస్కర శర్మ గారు ప్రముఖ కవి, జాతీయ ఉత్తమ అధ్యాపక పురస్కార గ్రహీత. వీరు శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర శతకం, కిరణశ్రీ, డా.సి.నా.రె కే కథా కావ్య్, మొదలైన విశిష్ట రచనలు ప్రచురించారు. ఈనాడు, స్వాతి, అమెరికాలో తెలుగు జ్యోతి, ఆస్ట్రేలియా లో తెలుగు పలుకు మొదలైన పత్రికలలో కథలూ, ఆధ్యాత్మిక వ్యాసాలూ ప్రచురితమవుతూంటాయి. యస్.వి.బి.సి. చానల్ లో ప్రసారమవుతున్న పురాణగాథలు కార్యక్రమంలో వీరు రాసిన గీతాలు ఆదరించబడ్డాయి. సప్తగిరి చానల్ వారి పలు బ్రహ్మోత్సవకార్యక్రమాల్లో వీరి వ్యాఖ్యానాలు ప్రసారమవుతూంటాయి. సిరిపూర్ కాగజ్ నగర్ తెలుగు సాహితీ సమితి అధ్యక్షులు.
శ్రీనివాస భరద్వాజ కిశోర్ (కిభశ్రీ)

శ్రీనివాస భరద్వాజ కిశోర్ గారికి డా. సి. నారాయణ రెడ్డి గారు అభిమానంగా పెట్టిన కలం పేరు కిభశ్రీ. 17 సం।।లు భారత దేశంలో వైజ్ఞానికునిగానూ, గత 19 సం।।లుగా అమెరికాలో ఐటీ మానేజ్మెంట్ లోనూ పని చేసి కళారంగంలో కృషి ద్విగుణీకృతం చేసేందుకు పదవీవిరమణ చేయాలని ఉవ్విళ్ళూరుతున్నారు. దాదాపు 600 గేయాలకు బాణీలు కట్టారు, 16 సంగీత రూపకాలకు సంగీతం సమకూర్చారు. తెలుగు, హిందీ ఆంగ్ల భాషలలో పద్యాలు, కవితలు, గజళ్ళు, నాటికలు, సంగీత రూపకాలు వ్రాసారు. గత సంవత్సరం "కదంబం" పద్య గేయ సంపుటి డా।।సినారె గారి చేతులమీద విడుదల అయింది. 250 మంది అమెరికన్ సభ్యులు గల టాలహాసీ కమ్యూనిటీ కోరస్, స్వరవాహిని బృందాలు ఈయన వ్రాసి స్వరబద్ధం చేసిన గేయాలను చాలా వేదికలమీద పాడారు. ఈయన వ్రాసి స్వరబద్ధం చేసిన చాలా గేయాలను, నాటకాలను బృందాలు దర్శించాయి. ఫ్లారిడా లోని టాలహాసీ నగర నివాసి.
డా. జొన్నలగెడ్డ మూర్తి

డా. జొన్నలగెడ్డ మూర్తి గారు ఇ౦గ్లా౦డు లో సౌత్ పోర్టు పట్టణ౦లో సమ్మోహన శాస్త్ర వైద్యునిగా వృత్తి (ఎనెస్థిటిస్టు) రచనా వ్యాసా౦గ౦, నాటక ర౦గ విన్యాసాలు ( రచన, దర్శకత్వ౦, నటన ) అంటే చాలా ఇష్టం.
ఛాయా చిత్ర గ్రాహకుడిగా చిరు వృత్తి (సెమీ ప్రొఫెషనల్ ఫొటో గ్రాఫర్). భాష, సాహిత్యాల పరిరక్షణ వైపుగా అడుగులు వేస్తున్నారు. ప్రకృతి ఆరాధన, విశ్వ శా౦తికై కలలు కనడ౦ ఇతర వ్యాపకాలు.