top of page

క్రింది పేజీలు

ప్రస్తుత తాజా సంచికలో

లభ్యమవుతాయి

సంక్రాంతి సంచిక 2016​

వ్యాస​ మధురాలు

నిర్వహణ: సుధేష్ పిల్లుట్ల | చిలుకూరి సత్యదేవ్

vyasam@madhuravani.com 

తెలుగులో వెలువడిన జన్యుశాస్త్ర మరియు వైద్యశాస్త్ర కాల్పనిక కథా సాహిత్యం​

డాక్టర్ తన్నీరు కళ్యాణ్ కుమార్

తెలుగు సాహిత్యంలో ఆంగ్ల సాహిత్య ప్రభావంతో ఆవిష్కరించిబడిన నూతన ప్రక్రియ విజ్ఞానశాస్త్ర కాల్పనిక కథా సాహిత్యం. ఈ ప్రక్రియ మన సాహిత్యంలో కొన్ని దశాబ్దాలముందే ఉదయించినా, తన పరిధిని విస్తృతం చేసుకోవడంలో సఫలీకృతం కాలేకపోయింది. విజ్ఞానరంగంలో వచ్చిన మార్పులు సాహిత్యం మీద చూపిన ప్రభావమే వైజ్ఞానిక కాల్పనిక సాహిత్య ఆవిర్భావానికి కారణం. విజ్ఞానశాస్త్ర కాల్పనిక సాహిత్యంలో సైన్సుకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో అంతకంటే ఎక్కువ ప్రాధాన్యం ఊహలకు ఉంటుంది. ఈ సాహిత్యంలో రచయితచే చేయబడిన ఊహలు భవిష్యత్తులో నిజరూపం దాల్చడానికి అవకాశం ఉందేమో అనే భావనను పాఠకులకు కలిగిస్తుంది. భవిష్యత్తులో మానవుడు కనుగొనడానికి అవకాశం గల నూతన ప్రయోగాలను, నూతన పరిశోధనలను విజ్ఞానశాస్త్ర కాల్పనిక సాహిత్యం ముందుగానే ఊహిస్తుంది. 

సీ.పీ. బ్రౌన్, తెలుగు తల్లి ఫ్రౌన్, నిజం డౌన్ (మొదటి భాగం)

నెల్లుట్ల నవీన్ చంద్ర

డాక్టర్ నెల్లుట్ల నవీన చంద్ర

సి.పి. బ్రౌన్ను గూర్చి చాలా అతిశయోక్తులు  వాడుకలో వున్నాయి. తమను తాము గొప్ప సాహిత్యకారులుగా, చరిత్రకారులుగా వర్ణించుకునేవాళ్ళూ, మిత్రులచేత చెప్పించుకునేవాళ్ళూ, ఆ మిత్రులను తాము పొగిడేవాళ్ళూ, ఇతర పదాలలో, పరస్పర ప్రస్తుతిలో పట్టా పొందినవాళ్ళూ, పరస్పర పారితోషిక సంఘంలో గొప్ప పదవులు స్వీకరించినవాళ్ళూ తెలుగు సాహిత్యానికీ, దాని చరిత్రకూ, తెలుగు వాళ్ళకూ చెప్పనలవి కాని అన్యాయం చేసారు. చచ్చిపోయిన తెలుగును తాను ఒంటరిగా 1825-1855 కాలం లో ప్రాణం పోసి నిలబెట్టానని బ్రౌను చెప్పుకున్నాడు. దీనిని నమ్మిన చాలా మంది కవులు, రచయితలూ, చరిత్రకారులూ ఈయనను  ఆకాశానికి ఎత్తేశారు. మహాజ్వాలలా ప్రజ్వలించిన తెలుగు సాహిత్యాన్ని (ఉదాహరణకు కర్ణాటక  సంగీత త్రిమూర్తులలొ ఇద్దరైన శ్యామశాస్త్రి, త్యాగరాజు, మహా పండితుడైన ఛిన్నయ సూరి  తమ అత్యద్భుతమైన సాహిత్యాన్ని 1762-1861 మధ్య కాలంలో ప్రజలకు అందించి, దక్షిణ భారతమంతా  ప్రఖ్యాతి చెందినారు) ఒక  మిణుకు, మిణుకు మంటున్న దివ్వెగా వర్ణించిన మహానుభావులూ వున్నారు. బ్రౌను చేసిన సేవలో ఇతరులు ఆవగింజంతైనా చేయలేదని బాకాలు  పట్టిన మహానుభావులూ వున్నారు. 

bottom of page