
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
ఆహ్వానిత మధురాలు
నిర్వహణ: వంగూరి చిట్టెన్ రాజు | దీప్తి పెండ్యాల
వీరాభిమాని
భువనచంద్ర
విజయవాడ రైల్వే స్టేషన్ హడావిడిగా వుంది. పదో నంబరుప్లాట్ ఫాం మరీ హడావిడిగా వుంది. స్తంభాల చుట్టూ నిర్మించిన అరుగులాంటి దిమ్మ మీద కూర్చుని చుట్టూ చూశాను. ఒకాయన ఓ పేపరు అందరికీ కనిపించేలా మడిచి పట్టుకు తిరుగుతున్నాడు. ఆ పేపర్లో ఓ ఫొటో కనిపిస్తోంది. జాగ్రత్తగా చూస్తే ఆ ఫొటో అతనిదే. నా పక్కన ఓ మధ్య వయస్కురాలుంది. ఆవిడ పక్కన ఓ బామ్మగారూ, హుషారైన మనవరాలూ, అవతలి పక్కన ఓ రిటైర్డ్ తహసీల్దారు. ఆయన ఇందాకే పరిచయమయ్యాడు. ఓ నడివయస్సామె కూడా పరిచయమైంది. ఆవిడ కూతురు వాటర్ బాటిల్ కోసం వెళ్ళింది. ఆవిడా చెన్నై వస్తోందిట. ఓ కుర్రాడు షోల్డర్ బాగుతో వచ్చి నా ముందు నిలబడ్డాడు... ఉస్సు.. ఉస్సంటూ.
సత్యం మందపాటి
శివాని!
డెలివరీ గదిలోకి వెడుతున్నప్పుడు, భర్త చేయి పట్టుకుని “అంతా సవ్యంగానే అవుతుందంటారా?” అని అడిగింది కొంచెం గాబరాగా భవాని.
అదే ఇద్దరికీ మొదటి సంతానమేమో శివకి కూడా మనసు మనసులో లేదు.
అయినా ధైర్యంగా అన్నాడు, “మనకి మొదటి సంతానమేగానీ, ఈ హాస్పిటల్లో ప్రతిరోజూ ఎంతోమంది పిల్లల్ని కంటున్నారు. ఈ డాక్టర్లకి అది రోజూ చేసేదే. భయపడాల్సినదేమీ లేదు” అని.
భర్తవేపు గోముగా చూసింది భవాని, నర్సు ప్రసూతి గది తలుపు వేస్తుండగా.





