MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
వ్యాస మధురాలు
నిర్వహణ: శాయి రాచకొండ | శ్రీనివాస్ పెండ్యాల
కవిత్వంలో ఆశావాదం , నిరాశావాదం
విన్నకోట రవిశంకర్
చాలాకాలం తరువాత కలిసిన ఒక బాల్య మిత్రునికి ఆమధ్య నా కవితలు కొన్ని చూపించాను. అతనికి కవిత్వం చదివే అలవాటు పెద్దగా లేదు. నా కవితలు చదివాక అతను "నీ కవితలు చదువుతోంటే నువ్వేదో నిరాశలో ఉన్నట్టుగా అనిపిస్తోంది." అన్నాడు. ఆతను చెప్పిన మాట నాకు ఆశ్చర్యం కలిగించింది. సాధారణంగా నిరాశ కలిగించే సామాజిక, రాజకీయ అంశాలకి దూరంగా, సామాన్యమైన జీవితానుభవాలకి మాత్రమే పరిమితమై రాసే నా కవిత్వమే అతనికి నిరాశగా ధ్వనిస్తే, అటువంటి అంశాలే తమ కవిత్వానికి పునాదిగా రాసే అనేకమంది ఇతర కవుల కవిత్వం చదివితే ఏమంటాడో అనుకున్నాను.
ఇంతకంటే చిత్రమైన మరొక సంఘటన. మహీధర మురళీమోహన్ గారి పేరు తెలుగు పాఠకులకి సుపరిచితమైనదే. ఆయన ఒక వ్యాసంలో ఈ సంఘటన గురించి వివరించారు. ఇదెప్పుడో డెబ్భైలనాటి మాట. అప్పట్లో ఆయన ఏదో ప్రాజెక్టు పనిలో భాగంగా కొన్నాళ్ళు స్వీడన్ లో ఉండేవారు. ఆ రోజుల్లో...
శ్రీకాంత్ నవలల్లో స్త్రీ పాత్రలు - ఒక వీక్షణ
అత్తలూరి విజయలక్ష్మి
ప్రపంచ సాహితీ చరిత్రలో శరత్ చంద్ర చటోపాధ్యాయ అంటే తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో!
“ శరత్ “ ఈ మూడక్షరాలు శిలాక్షరాలు అవడానికి ప్రధాన కారణం దేవదాసు నవల. అనేక భాషల్లో సినిమాగా రూపొంది చరిత్ర సృష్టించిన సంగతి మనకు తెలుసు. బెంగాలీ, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, అస్సామీ, భాషల్లో గొప్ప నటీ నటులు, గొప్ప దర్శకుల చేతిలో రూపుదిద్దుకున్న ఈ ప్రేమ కావ్యం తెలుగులో అత్యంత విజయం సాధించి ఇలాంటి దృశ్య కావ్యం మళ్ళీ రాదు అనిపించేలా న భూతో న భవిష్యతి అనిపించుకుంది . తెలుగులో ఈ సినిమా సాధించిన విజయం అనూహ్యం. దేవదాసు, పార్వతి, చంద్రముఖి పాత్రలు తెలుగువారి బంధువులు అయారు. ఎంత మంది ఎన్నిసార్లు తీసినా వేదాంతం రాఘవయ్య గారి దర్శకత్వంలో, అక్కినేని, సావిత్రి ప్రదర్శించిన నటనకి సాటి రాలేదు .. శరత్ ఊహాలకి ప్రాణం పోసి ఆ పాత్రను సజీవం చేశారు.
అలాంటి శరత్ వేళ్ళ కొసలనుంచి జాలువారిన ఆణిముత్యాలు ఎన్నో.. వాటిలో బడదీది, నిష్కృతి, సవితా, దత్త, చరిత్రహీనులు, శేషప్రశ్న, ఇలా ఎన్నో అద్భుతమైన రచనలు చేసి సాహితీ లోకంలో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్న గొప్ప రచయిత. దేవదాసే కాక బాటసారి పేరుతో బడదీదీ , తోడికోడళ్ళు పేరుతో నిష్కృతి మొదలైన రచనలు కూడా తెలుగులో చిత్రాలుగా వచ్చి ఘనవిజయం సాధించాయి. అలాంటి మహత్తర నవలల్లో శరత్ రాసిన శ్రీకాంత్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము.
సంక్రాంతి వైభోగమే…
శ్రీసత్య గౌతమి,
సంక్రాంతి!
హిందూ పండుగలన్నింటిలో ఇదొక్కటే ఖగోళ సంబంధిత పండుగ. అంతరిక్షంలో సౌరమండలంలో జరిగే మార్పులను సూక్మం గా ఆధ్యాత్మిక పరిభాషలో తెలియజెప్పే బృహత్తర సారాంశమీ పండుగ.
అంతే కాదు మనిషి మనుగడ కు అవసరమైన ప్రకృతిని ఎలా ప్రేమించి, గౌరవించాలో కూడా ఈ పండుగ తెలియ జేస్తుంది. సౌరమండలంలో వచ్చే మార్పులకు అనుగుణంగా సాంప్రదాయ రీతులను కూర్చి ధనుస్సంక్రాంతి నుండీ,
మకర సంక్రాంతి వరకు ఆధ్యాత్మిక సాధనల ద్వారా ప్రతి యేడూ పౌరాణిక కధలను జ్ఞప్తికి తెస్తారు. కుటుంబాలతో, స్నేహితులతో కలిసి సంబరాలు చేసుకొని ఐక్యతను కలిగి వుంటారు. చేతికొచ్చిన క్రొత్త పంటను తామే కాకుండా తమ క్రింద కష్ఠపడిన వాళ్ళకు కూడా పంచి, ఆ పంచుకోవడంలో వుండే ‘తమ వాళ్ళు’ అనే మానవతా భావాన్ని చాటుతారు.
ప్రకృతికీ, మానవ స్వభావానికి ఒక పండుగ విశిష్టతని ఆపాదించి చేసుకొనే ఏకైక సాంప్రదాయం ఈ సంక్రాంతి! ప్రకృతిలో మధురక్రాంతి సంభవించే వెలుగుల విక్రాంతి!
ప్రియమైన మహానటికి...
సేకరణ: మెడికో శ్యాం
Society for Social Change, Kavali వారు వెలువరించిన సామల సదాశివ గారి స్మృతి సంచిక ‘పరిశోధన’ లోని వ్యాస సంపుటిలో ఒకటి మహానటి సావిత్రి పై సూసన్ హేవర్డ్ రాసిన ఒక ఆంగ్ల వ్యాసానికి తెలుగీకరణ. ఆమె ఎప్పుడు రాశారో తెలియదు. అయితే 1962లో ఆమె అనుకోకుండా ఇండియా వచ్చినప్పుడు సుచిత్రా సేన్ సావిత్రి గారిని మంచి నటిగా చేసిన పరిచయం, అప్పటినుంచి విడవకుండా అమెరికా వచ్చిన తరువాత కూడా సావిత్రి నటించిన సినిమాలు చూడడం, సావిత్రిని కలియకుండానే సావిత్రి నటనపై, సూసన్ పెంచుకున్న ఆరాధన, అభిమానం, గౌరవం, ఇవీ ఈ ఉత్తరంలోని ముఖ్యాంశాలు.
నాకు తెలుసు హాలీవుడ్ నుంచి ఎవరై ఉంటారని ఆలోచిస్తూ ఉంటారు మీరు. నేను సూసన్ హేవర్డ్.. హాలీవుడ్ యాక్ట్రెస్ సూసన్ హేవర్డ్‌ని. నేను మీ అభిమానిని. నేను మీ అభిమానిని ఎప్పుడయ్యానని ఆలోచిస్తున్నారా? అసలు మీ గురించి నాకెలా తెలిసిందా అని ఆశ్చర్యపడుతున్నారా? వినండి చెప్తాను. కాదు కాదు చదవండి. 1962 లో ఒకసారి ఇండియా వచ్చాను. నేనే కాదు నాతో పాటు మా డైరెక్టర్, ప్రొడ్యూసర్‌తో సహ ఎంటైర్ యూనిట్ ఉంది. షూటింగ్ నిమిత్తం బ్యాంకాక్ వెళ్లవలసి ఉంది. కాని మా ఫ్లైట్ వాతావరణం బాగోలేక కలకత్తాలోనే దిగింది. మేము దిగింది కలకత్తా. ఇండియా అనగానే మాకు గుర్తు వచ్చింది సత్యజిత్ రే. వెంటనే ఆ ఓరియంటల్ జీనియస్‌ని చూడాలనుకున్నాము...
.