
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
జనవరి-మార్చి 2023 సంచిక
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
మా వాణి ...
మా నిర్వాహక బృందంలో సభ్యులైన చిలుకూరి సత్యదేవ కవీంద్రులు రచించిన ఈ క్రింది పద్యంతో “మధురవాణి” పాఠకులకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ “దుర్ముఖి’ నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాం.
సీ. తమముఁ బోగొట్టి సత్త్వమ్ముఁ బెంపొందింప
నుదయాద్రినుదయించె నదితిసుతుడు
మాఘఫాల్గుణముల మందనీహారంపు
శిశిరశీతలమింక సెలవు కోరె
క్రొత్త చివురులతో కొమ్మలు నింపు వ
సంత శోభలతోడ చైత్రమరిగె
లయము జేసియు మరల భవమొనర్చెడి
కమలాక్షుఁ లీలయౌ కాలచక్ర
గీ. మందు మన్మథము మిగిల్చెననుభవములు,
స్మృతులు; నంతలో దుర్ముఖి చేరవచ్చె
నాయురారోగ్యముల్, మువురమ్మల కరు
ణా కటాక్ష వీక్షణములున్ మాకుఁ దెచ్చె!
గత జనవరిలో సంక్రాంతి - 2016 పండుగలో ప్రారంభించబడిన ‘మధురవాణి’ అంతర్జాల సాహిత్య పత్రిక తొలి సంచికని ప్రపంచవ్యాప్తంగా మేము ఊహించిన దానికన్నా, ఆశించిన దానికన్నా ఎక్కువగా ఆదరించిన పాఠక మహాశయులకు మా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా ,,,,,

మధురవాణి నిర్వాహక బృందం
MADHURAVANI TELUGU MAGAZINE మధురవాణి
2016వ సంవత్సరం ఉత్తర అమెరికాలో తెలుగు కథ ఆవిర్భావం, తద్వారా తెలుగు సాహిత్య శుభారంభానికి 52వ వార్షికోత్సవం. ఈ సందర్భంగా మధురవాణి పాఠకులకు ప్రత్యేక మధురాలు!
తెలుగు సాహిత్యం తొలి దశకం ~వంగూరి చిట్టెన్ రాజు
అమెరికా తెలుగు కథకు 52 ఏళ్ళు ~డా. తన్నీరు కళ్యాణ్ కుమార్
గొల్లపూడి మారుతీ రావు
1971 జనవరి 10: ఎన్. టీ. ఆర్ పుండరీకాక్షయ్యగారితో అన్నారట: మారుతీరావుగారు ఏక్షన్ సబ్జెక్ట్ అంతబాగా చెప్తారనుకోలేదు-అని. "మధ్యాహ్నం అవుట్ డోర్ షూటింగ్ దగ్గరికి రాకూడదా? తీరికగా మాట్లాడుకుందాం" -అన్నారు ఎన్.టీ.ఆర్.
అక్కినేనికీ, ఎన్.టీ. ఆర్ కీ మధ్య ప్రచ్చన్న యుద్ధం జరుగుతున్న రోజులు. కారణాలు అనవసరం. ఇద్దరూ రెండు మేరుశృంగాలు. క్రమశిక్షణకీ, అకుంఠితమైన కార్యదక్షతకీ పెట్టింది పేరు.
రాయపేటలో పాత ఉడ్ లాండ్స్ హోటల్లో కూర్చుని పూర్ణచంద్రరావుగారికి అక్కినేనితో...
నా డైరీల్లో కొన్ని పేజీలు...
కొత్త కోణం
పొత్తూరి విజయ లక్ష్మి
ఈ మధ్య ఓ అసిస్టెంటు పెట్టుకున్నా. స్పాండిలైటిస్ కొత్తగా వచ్చింది. అది వరకులాగా చేత్తో కధలూ కాకరకాయలూ కవితలూ గట్రా రాయటం శ్రమ అయిపోతోంది . నడుము నెప్పి వుండనే వుంది. పోనీ చచ్చీ చెడీ రాసినా అవి ఎవరూ అంగీకరించటం లేదు. అందరూ ఫలానా ఫాంట్ లో టైపు చేసి సాఫ్ట్ కాపీ పంపించండి అంటున్నారు . నేను టైపు చేస్తే అప్పంభోట్ల పందిరిలాగా అన్నీ తప్పులే. ఇలా లాభం లేదని ఓ పిల్లని పెట్టుకున్నా. ప్రతిరోజూ సాయంత్రం వచ్చి నేను చెప్తుంటే టైపు చేసి పెడుతుంది. ఆ అమ్మాయి పేరు సుధ.
దండేషు మాతా!
డా. మంథా భానుమతి
“సంధ్యా… సంధ్యా! ఇంకా అవలేదా…” గట్టిగా పిలుస్తూ, జేబులో దువ్వెనతో తల దువ్వుకుంటూ ఇంట్లోకి వచ్చాడు వివేక్. వాష్ బేసిన్ దగ్గరకి వెళ్లి అద్దంలో మొహం చూసుకుని, చొక్కా కాలర్ సవరించుకున్నాడు.
“వస్తున్నా… ఒక్క నిముషం.” లోపల్నుంచి సమాధానమిచ్చింది సంధ్య.
“త్వరగా సంధ్యా! అందరూ వచ్చేశార్ట. ఇప్పటికే పది ఫోన్లొచ్చాయి.
“వచ్చేశా...” విరబోసుకున్న జుట్టు వెనక్కి విదిలిస్తూ వచ్చింది సంధ్య. అలా జుట్టు వెనక్కి విదిల్చినప్పుడు,
ఎన్నికల పిచ్చా? – ఏ పాటీ ?
నూరేళ్ల సాధారణ సాపేక్షతా సిద్ధాంతం
అనిల్ ఎస్. రాయల్
అనాదిగా మానవుడు లోకాన్ని అర్ధం చేసుకోటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. మొదట్లో దానికి సరైన దారేదో తెలీక తికమకపడ్డాడు. కళ్లకి కనబడేదే నిజమనుకున్నాడు. కనబడని శక్తుల్ని మహిమలుగా పొరబడ్డాడు, దేవుళ్లని సృష్టించాడు. అప్పట్లో అతని ప్రపంచం చిన్నది. కాలగమనంలో అతను ఎదిగాడు. లోకాన్ని లోతుగా చూడటానికో అద్భుత ప్రక్రియ కనుగొన్నాడు. అదే సైన్స్. దాని ఊతంతో అతని విశ్వం విస్తరించింది. మహిమల వెనకున్న మర్మం బోధపడింది...