top of page

కవితా వాణి

ఆశ్చర్యం...​

~భారతీకృష్ణ

పచ్చని పసుపుకొమ్ము లాంటి అమ్మ తనువు పూర్ణ కుంభంలా...
నిండుగా...తృప్తిగా కళకళ్లాడుతోంది…
ఆమె కన్నుల్లో కోటి ఆశలు
కొత్తగా తొంగి చూస్తున్నాయి…

నిర్వహణ: చిలుకూరి సత్యదేవ్ | మధు పెమ్మరాజు

kavita@madhuravani.com 

రైల్లో ప్రయాణం

​        ~అక్కిరాజు సుందర రామకృష్ణ

భారతంబునందు పరమాత్ము పదసాక్షి

'రైలు’లో ప్రయాణమాలకింప
కరము చెడ్డ రోత కలిగించుచుండెను
అతిశయంబు గాదు, "అమ్మ తోడు"!

జీవన సంధ్యాసమయం

~ఆచార్య కడారు వీరారెడ్డి

వయసు.. పారుతున్న నదీ ప్రవాహం
సముద్రంలో లీనమయ్యే దిశలో ప్రయాణం!
పండుతున్న దేహంలో..
మనసు పండించుకోవాల్సిన సంధ్యాసమయం!

 

చెన్నై ప్రళయం

​        ~కిభశ్రీ

కం. :   బిగువు జటలు గట్టిన నీ
           సిగ పట్టును యేల సడలజేసితివయ్యా
           యుగములు ఇరుకుననుండిన                      
           పగతో భువినంత ముంచె భాగీరథిదే

కూనలమ్మ పదాలు

~ఎస్ కె వి రమేష్

1. మీన మేషపు లెక్క 
    పక్క నెట్టోయ్ చక్క 
    పనుల కొచ్చును రెక్క 
    ఓ జాబిలమ్మ

నడత

​        ~డాక్టర్ బెజ్జంకి జగన్నాథాచార్యులు

ప్రపంచీకరణం పెనుముప్పై పోతోందివిషసంస్కృతి వాడ వాడలా వ్యాపిస్తోందినిద్రాహారాలు లేకుండా దూరదర్శనులు దుర్బోధ చేస్తున్నాయి…

అంతర్జాలం అంగాంగ ప్రదర్శన చేస్తున్నది…చేతిలో చరవాణి

 

నీవులేని జగము…

~దొరవేటి చెన్నయ్య

సీll       సంయమీంద్రులలోన చక్కగా గలవన్న,

వారణాసి శపింప వ్యాసుదలచె;

చక్రవర్తులలోన చాలగా గలవన్న,

ఖండించెను ఋషిని కార్తవీర్యు;
 

ఉగాది

​        ~పత్తికొ౦డ సురే౦ద్ర రావు

అనాదిగా యుగాది భూరి పాడి ప౦టలి౦ట

భేరి మోదియై వినోది యై ప్రమోదితా మహోన్నతై

ప్రవీణ మాధురీణియై కళా౦జలై, ఫలా౦జలై

విరి౦చి విశ్వ సు౦దరై, ఫలి౦చు స్వప్న మ౦జరై

ఈ శీర్షికలో ఆసక్తికరమైన కవితలు తగిన సంఖ్యలో ప్రచురిస్తాం. ఈ శీర్షికలో ప్రచురణార్థం ఆధునిక వచన కవిత, ఛందోబద్దమైన పద్య కవితలు, ఇతర కవితా ప్రక్రియలలో “అముద్రిత” స్వీయ రచనలని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కేవలం యూనికోడ్ (గూగుల్, లేఖిని మొదలైన వెబ్ సైట్ లలో, గౌతమి మొదలైన ఫాంట్స్) లో ఉన్న రచనలు మాత్రమే పరిశీలించబడతాయి. PDF, స్కాన్ చేసిన వ్రాత ప్రతులు, తదితర పద్ధతులలో వచ్చిన రచనలు పరిశీలించబడవు. మీ రచన మీద సర్వహక్కులూ మీవే. కానీ దయ ఉంచి ఇంకెక్కడైనా పరిశీలనలో ఉన్న కవితలు, ఇది వరలో ప్రచురించబడిన రచనలు మరో రూపంలోనూ పంపించకండి. మీ రచన అందిన సుమారు నెల రోజులలో ఎంపిక వివరాలు తెలియపరుస్తాం.

 

ఈ శీర్షికలో పరిశీలనకి కవితలుపంపించ వలసిన ఇమెయిల్ kavita@madhuravani.com

bottom of page