top of page

కథా ​ మధురాలు

నిర్వహణ: మధు పెమ్మరాజు | దీప్తి పెండ్యాల

katha@madhuravani.com 

అంతా కృష్ణమయం!!

శ్రీహరి అక్కిరాజు

భువనచంద్ర, Buvanachandra

బృందావనం మళ్లీ కళకళలాడింది. చెట్లు  విరపూసాయి,  వీధులు  కొత్త రంగులు అద్దుకున్నాయి.  గోపబాలకుల్లో   ఉత్సాహం పరవళ్ళు తొక్కింది .  గోవులు, దూడలు గోధూళి వేళకి ముందే ఇళ్ళకు పరిగెత్తుతున్నాయి. గోపికల మాట ఇంక అడగాలా? పనిమానేసి సింగారించుకొంటున్నారు.  ఇక యశోదమ్మ సంగతి వేరే చెప్పాలా ? ఆమె ఏంచేస్తున్నదీ ధ్యాస ఉంటేగా? పెరుగు కాగపెడుతున్నది,  పాలు చిలుకుతున్నది, వెన్న రాలేదని వాపోతున్నది.

ఆబోతుగారి పన్నువిరిగిన కథ

డా. మూలా రవి కుమార్​

భువనచంద్ర, Buvanachandra

రైలుదిగి స్టేషన్కి వచ్చిన తమ్ముడి బండిమీద కూర్చొని వస్తూఉంటే రోడ్డుపక్కన ఆంబోతు కనిపించింది. ఫక్కున నవ్వేను.
“ఏమైంది?” తమ్ముడడిగేడు.
“ఇంటికెళ్ళేకా చెబుతా” మరింత నవ్వుతూ అన్నాను.
“అంతలా ఊగిపోతూ నవ్వితే బండి బేలన్సు తప్పుతుంది” మా వాడి హెచ్చరికతో కష్టపడీ నవ్వాపుకొని,

‘టీ’ కప్పులో ఎన్నికలు

హితేష్ కొల్లిపర

hitesh kollipera

ఉదయం ఎనిమిది గంటల యాబై నిమిషాలు, కళ్ళు తెరవగానే ఎదురుగా గోడకు వేలాడుతున్న వాల్ క్లాక్ చూపిస్తున్న సమయం. బద్దకంగా అవలించాను. ఆదివారం కావడంతో ఆఫీసుకు వెళ్ళే పని లేకపోవడం చేత పెందలాడే లేవలేదు. పైగా నా ప్రియాతిప్రియమైన భార్యామణి, ‘భాగ్యశ్రీ’ కూడా లేదు. నిన్ననే నా మీద అలిగి నాలుగిళ్ళు అవతల ఉన్న తన పుట్టింటికి వెళ్ళిపోయింది. అయినా అలగడం అనేది ఒక సాకు మాత్రమే. ప్రతి శనివారం ఆమె ఇలా పుట్టింటికి వెళ్తుంది. కాకపోతే ఎప్పుడూ శనివారం రాత్రి వెళ్ళి, మళ్ళీ ఆదివారం ఉదయం తనే

నాతిచరామి

దినవహి సత్యవతి

భువనచంద్ర, Buvanachandra

శంకరయ్య, జగదాంబ దంపతులకు లేక లేక కలిగిన ఏకైక పుత్ర సంతానం విష్ణు.  వృత్తి రీత్యా డాక్టరు. ఎన్నో పెద్ద ఆస్పత్రులనించి అన్ని సౌకర్యాలతో పాటు  మంచి జీతం కూడా  ఇస్తామంటూ  ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పటికీ,   సొంతప్రాక్టీసు పెట్టుకుంటే  వృద్ధులైన  తన తల్లిదండ్రులకి కూడా  తగినంత సమయం  కేటాయించవచ్చుననే  ఆలోచనతో ఇంటిదగ్గరే  క్లినిక్ ప్రారంభించాడు.  తన దగ్గరికి వైద్యం కోసం వచ్చినవారికి మెరుగైన చికిత్స అందించడమే  లక్ష్యంగా నామమాత్రపు ఫీజు తీసుకుంటూ  దయాగుణం కలిగిన డాక్టరు, మృదుస్వభావి… అని మంచి పేరు...

నిజం

రాధిక నోరి

భువనచంద్ర, Buvanachandra

కెరటాలు హోరుమని శబ్దం చేస్తూ ఎత్తుగా లేస్తున్నాయి. ఆభాస్ బాల్ తో బీచ్ లో ఆడుతున్నాడు. ఉదయం వేళల్లో కెరటాల హోరు తప్ప వేరే ఇంకేదీ వినిపించని ఆ నిశ్శబ్దంలో బీచ్ లో ఆడుకోవటం ఆభాస్ కి చాలా ఇష్టం. ఇలా బీచ్ కి దగ్గరగా ఇల్లు వుండటం ఎంత బాగుందో అనుకున్నాడు. వావ్! ఎంత పెద్ద కెరటాలో అనుకున్నాడు సముద్రం వైపు చూస్తూ. ఇంతలో అతనికి ఏదో వింతైన శబ్దం వినిపించింది. ఆభాస్ ఉలిక్కిపడి చుట్టూ చూసాడు. ఏమీ కనిపించలేదు. పొరపాటు పడ్డానేమో అనుకున్నాడు. కొన్ని క్షణాలైన తర్వాత మళ్ళీ

పేరుకి తగ్గట్టుగానే ఈ శీర్షికలో కథ బావుండి, చదివించే గుణం ఉన్న కథలు తగిన సంఖ్యలో ప్రచురిస్తాం. మంచి సృజనాత్మకతని ప్రతిబింబించే “అముద్రిత” స్వీయ రచనలని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కథా వస్తువు ఏదైనా కావచ్చును. కేవలం యూనికోడ్ (గూగుల్, లేఖిని మొదలైన వెబ్ సైట్ లలో, గౌతమి మొదలైన ఫాంట్స్) లో ఉన్న రచనలు మాత్రమే పరిశీలించబడతాయి. PDF, స్కాన్ చేసిన వ్రాత ప్రతులు, తదితర పద్ధతులలో వచ్చిన రచనలు పరిశీలించబడవు. మీ రచన మీద సర్వహక్కులూ మీవే. కానీ దయ ఉంచి ఇంకెక్కడైనా పరిశీలనలో ఉన్న కథలు ఇది వరలో ప్రచురించబడిన రచనలు మరో రూపంలోనూ పంపించకండి. మీ రచన అందిన సుమారు నెల రోజులలో ఎంపిక వివరాలు తెలియపరుస్తాం.

 

ఈ శీర్షికలో పరిశీలనకి కథలు పంపించ వలసిన ఇమెయిల్ katha@madhuravani.com


Feedback
editor@madhuravani.com
 
©  2022 madhuravani.com

మధురవాణి కొత్త సంచిక విడుదల వివరాలు ఉచితంగా సకాలంలో అందుకోవాలంటే మీ పేరు, ఇ-మెయిల్ చిరునామా editor@madhuravani.com  కి పంపించండి.

మీ వివరాలు ఎవరితోనూ పంచుకొనబడవు.​

Website Designed
 &  Maintained
 by
Srinivas Pendyala

bottom of page