top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

వ్యాస​ మధురాలు

నిర్వహణ: శాయి రాచకొండ | శ్రీనివాస్ పెండ్యాల

vyasam@madhuravani.com

ఆధునిక కవిత్వంలో ‘మా ఊరు’ భావన

డా. జడ సుబ్బారావు

madhuravani.com అంతర్జాల పత్రిక  నిర్వహించిన వ్యాస పోటీ లో ఉత్తమ బహుమతి సాధించిన వ్యాసం

పల్లెటూళ్ళు భారతదేశానికి గుండెకాయ. పల్లెటూళ్ళలోనే అచ్చమైన భారతీయ సమాజం ప్రతి బింబింస్తుంది. మనిషి ఎంత అభివృద్ధిని సాధించినా బాల్యంలోని గతజీవిత గుర్తులన్నీ అతని మనసులో పదిలంగా ఉంటాయి. అందుకే కేరింతలతో భూమిమీద పడినప్పుడే పుట్టిపెరిగిన ఊరితో అతనికి సంబంధం ఏర్పడుతుంది.  కొనవూపిరి పోయేవరకు ఊరితో ఆ అనుబంధం కొనసాగుతూనే వుంటుంది. అమ్మఒడి, చదువుకున్న బడి, ఊరిలోని గుడి అన్నీ అతని జీవితంలో కలకాలం మంచి మధుర స్మృతులుగా మిగిలిపోతాయి. అవకాశాలు లేక అవసరాల కోసం మనిషి ఎంత దూరం వెళ్ళినా మన సెప్పుడూ అమ్మవైపు, ఊరివైపు లాగుతూనే ఉంటుంది. స్వచ్ఛమైన ఊరిగాలి పీల్చాలని, కమ్మనైన అమ్మ ప్రేమ పొందాలనీ,...

జీవమున్న నవల ‘ఒక్క వాన చాలు’

ఆచార్య రాజేశ్వరి శివుని

madhuravani.com అంతర్జాల పత్రిక  నిర్వహించిన వ్యాస పోటీ లో ఉత్తమ బహుమతి సాధించిన వ్యాసం

ఒక్క వాన చాలు’ రాయలసీమ రైతు జీవితాన్ని వర్ణించిన నవల రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి. ఈ నవల రాయడంలో రచయితకు రెండు ఉద్దేశ్యాలున్నాయి. రాయలసీమ రైతు బతుకు ‘వలస కూలీ బతుకు’ అయ్యింది. అయినా రాయలసీమ రైతులో ఆత్మవిశ్వాసం చావలేదు. ‘ఒక్క వాన చాలు బండ రాతి మీదైనా పిడికెడు అన్నం పుట్టించేందుకు పోరాడుతాడు’. అని చెప్పడమే రచయిత ఉద్దేశం.​​

ఈ ఉద్దేశ్యాన్ని ఈ నవల పాఠకులకు నేరుగా చేరవేసింది. ఒక్క వాన రైతును కూలీగా ఒకరి కింద పని చేసే నిస్సహాయ స్థితి నుంచి ఆత్మ విశ్వాసం ఉన్న రైతుగా మారుస్తుంది. ఆ వాన కోసం ఎదురు చూడడమే నవల ప్రారంభం నుంచి చివరి దాకా...

నవరసమేళనం - భక్తిరసోన్మీలనం - ప్రహ్లాదోపాఖ్యానం

తంత్రవహి శ్రీరామమూర్తి

madhuravani.com అంతర్జాల పత్రిక  నిర్వహించిన వ్యాస పోటీ లో ఉత్తమ బహుమతి సాధించిన వ్యాసం

 '' రాసినది శ్రీరామకోటి, ఆతడు ఆడినది శ్రీకృష్ణుతోటి

తెలుగులకు పుణ్యాలపేటి, హరినామ మందార మకరంద తేటి

సహజ పండితుడన్న పేరున్న మేటి, పోతన్న కెవరయ్య ఇలలోన సాటి ''

అని నుతించబడుతున్న యశశ్శరీరుడు బమ్మెరపోతన. పోతన చేతులలో భక్తి బంగారమై శోభించింది. భాగవత పురాణం కావ్యమై పుష్పించింది. ఇహ పరార్థ ఫలాలను అందించింది. రసజ్ఞులకు ఎంత ఆస్వాదించినా తనివి తీరనిది పోతన భాగవతం. ద్వాదశ స్కంధములుగా విలసిల్లిన భాగవతంలో మహాభారతం వలె ప్రతిపర్వము రసోదయమే. అయితే ప్రత్యేకించి సప్తమ స్కంధంలోని ప్రహ్లాదోపాఖ్యానం

విమర్శ- తెలుగు సాహిత్యంలో దాని పాత్ర-ఒక పరిశీలన

బి.వి. శివ ప్రసాద్

విమర్శ అంటే లోపాలు ఎత్తి చూపడం లేదా తప్పులను ఎన్నటం అనే అర్ధం వాడుకలో ఉంది. సాహిత్య విమర్శ అంటే కధ(ల)నో, కవిత(ల)నో,  నాటకాన్నో, మరేదైనా సాహిత్య రూపాన్నో వ్రాతపూర్వకంగా విశ్లేషించి మూల్యంకనం చెయ్యడం అని అర్ధం చెప్పుకోవచ్చు. ఒక సాహిత్య రూపం యొక్క మంచి, చెడ్డల్ని వివేచన చెయ్యడం కూడా విమర్శలో భాగమే అవుతుంది. విమర్శలో ప్రధానంగా నాలుగు భేదాలున్నాయి. అవి 1.వివరణాత్మక విమర్శ 2.అభినందాత్మక విమర్శ 3.తులనాత్మక విమర్శ 4.నిర్ణయాత్మక విమర్శ

విమర్శ - పుట్టు పూర్వోత్తరాలు

       ఒక అంచనా ప్రకారం తెలుగు సాహిత్యం వ్రాత రూపంలో తొమ్మిది శతాబ్దాల క్రితం పురుడు పోసుకుంది. తెలుగు సాహిత్య విమర్శ గత శతాబ్దిలోని చివరి భాగంలో వెలుగులోకొచ్చింది. తొలినాళ్ళ తెలుగు సాహిత్యం శాస్త్రీయతతో నిండి సంస్కృతాన్ని ఆధారం చేసుకుని సృజియింపబడింది.

bottom of page