
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
కథా మధురాలు
నిర్వహణ: దీప్తి పెండ్యాల | మధు పెమ్మరాజు
అమ్మ దొంగా!
ఓలేటి శశికళ
madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన కథలపోటీ లో ఉత్తమ బహుమతి సాధించిన కథ
" కిర్ " కిర్" ... కిర్ కిర్......"
దాదాపు ఇరవై నిమిషాలనుండి చెవిలో జోరీగలా దూరి పిచ్చెక్కించేస్తోంది శబ్ధం.
హరిహర బ్రహ్మాదులొచ్చి నా మధ్యాహ్నం నిద్ర పాడుచేస్తే ఊరుకోను నేను. అలాంటిది, వారం నుండీ చంపుకు తినేస్తున్నారు. ఈరోజు ఒదిలే ప్రసక్తి లేదు. పని పట్టాల్సిందే! కోపంగా లేచి గది బయటకొచ్చాను.
ఏసీ నుండి బయటకు రాగానే వేడిగా మొహానికి కొట్టింది గాడుపు! అయినా ఇంత ఎండలో బుద్ధి లేకుండా...
వీధి తలుపు తీసి వరండాలో కెళ్లానో లేదో,
టంగ్... టంగ్... టంగ్...
హితేష్ కొల్లిపర
madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన కథలపోటీ లో ఉత్తమ బహుమతి సాధించిన కథ
దూరం నుంచి వస్తున్న చప్పుడు చూసి లేచి గేట్ తెరిచాడు పవిత్ర థియేటర్ గేట్ మన్. కృష్ణ తన బండిని తోసుకుంటూ తెచ్చి థియేటర్ సెకండ్ గేట్ ముందు టికెట్ కౌంటర్ పక్కన నిలిపాడు. సమయం, సరిగ్గా పది యాభైఐదు. పదకొండు గంటలకి మార్నింగ్ షో. అట్లకాడతో బాణీ మీద మోదుతూ పల్లీలు వేయిస్తున్నాడు.
కృష్ణ టైమ్ సెన్స్ ని మెచ్చుకోవాల్సిందే. రోజూ సరిగ్గా ఆ సమయానికి, అక్కడ ఉంటాడు. కౌంటర్ లో నిలబడ్డ ‘కళాపోషకుల’ చేత కనీసం పది ‘పల్లీ కోన్స్’ అయినా కొనిపించకపోతే తన ‘పల్లీల’ బ్రాండ్ కే అవమానం అని అతడి ఫీలింగ్. అప్పటికీ ఏరోజైనా తన ‘పది’ టార్గెట్ రీచ్ కాదనిపిస్తే తనే రంగంలోకి దిగుతాడు.
నిర్ణేత
కన్నెగంటి అనసూయ
madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన కథలపోటీ లో ప్రశంసా బహుమతి పొందిన కథ
“నాన్నా...”
“ ఆ… చెప్పమ్మా, నాకు అర్ధమైంది...” అన్నాడు ఆలపాటి చదువుతున్న పేపర్ మడచి పక్కన పెట్టి సింగిల్ సోఫాలో కూర్చున్న కూతురి వైపు చూస్తూ. అదతనింటి పేరు. అతనలాగే ఫేమస్. ఏం మాట్లాడాలో తెలియలేదు వెన్నెలకి కాసేపు. ఇబ్బందిగా కదిలింది.
“అమ్మని... పిలూ...” అన్నాడతను కూతురి ఇబ్బందిని గమనించి.
“అమ్మా... నాన్న రమ్మంటున్నా” రంటూ వంటింట్లోకి వెళ్ళి అప్పటికే రేవతి వస్తూండటం చూసి ఆమెని ముందుకెళ్లనిచ్చి వెనగ్గా రాసాగింది వెన్నెల.
“ట్రేసవుట్ చెయ్యగలిగావా? “ సూటిగా విషయానికి వచ్చేసాడు ఆలపాటి.
కనకాలు
హైమావతి ఆదూరి
madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన కథలపోటీ లో ప్రశంసా బహుమతి పొందిన కథ
"ఏమయ్యా వెంకట్రావ్? ఉదయం పదింటికే ఆఫీసుకొచ్చి వాల్తావ్ కదా, కనీసం చాయ్ త్రాగటానికి క్యాంటీన్ వరకైనా వస్తావా? లేక బల్లిలా సీటుకే అంటుకు పోతావా?" అంటూ పలకరించాడు ప్రక్కసీటు గురునాధం.
అప్పటికి సమయం సాయంత్రం నాలుగవుతోంది. వెంకట్రావ్ రోజూ ఠంఛన్ గా ఐదింటికే అలారం పనిచేయకపోయినా అదేమీ పట్టించుకోకుండా నిద్రలేచి వండివార్చి ధర్మపత్ని చేతికిచ్చిన క్యారేజీ బ్యాగుతో ఏడున్నరకే ఇంట్లోంచి బయటపడి రెండు బస్సులు, ఒక షేరింగ్ ఆటో మారి పదింటికల్లా ఆఫీసులోని తన సీట్లోకొచ్చి పడ్తాడు...
'బోధ'వృక్షం
ఎమ్వీ రామిరెడ్డి
madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన కథలపోటీ లో ప్రశంసా బహుమతి పొందిన కథ
అరగంట గడిచినా ఆ ఇంటి వాతావరణంలో మార్పు కనిపించలేదు శ్రీరామచంద్రమూర్తికి.
రాత్రంతా ప్రయాణించి, పొద్దున్నే ఏడు గంటలకు ఇంట్లో అడుగు పెట్టిన తండ్రిని కూతురు కుశలమైనా అడగలేదు. సోఫాకు అతుక్కుపోయి కూచున్నాడు అల్లుడు. ఇద్దరి మొహాల్లోనూ గడ్డకట్టిన విచారం.
''అనిరుధ్ ఎక్కడ?'' అల్లుణ్ని అడిగారు మూర్తి.
బెడ్‌రూము వైపు వేలు చూపించాడే తప్ప, నోరు మెదపలేదు.
తనను ఉన్న ఫళాన బయల్దేరి రమ్మని ఫోన్‌చేస్తే, ఎక్కడో ఏదో తేడా వచ్చిందనుకున్నాడే తప్ప ఆ పరిణామం ఇంత