adannamaata.png

సంపుటి  5   సంచిక  3

Website Published &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

వ్యాస​ మధురాలు

నిర్వహణ: శాయి రాచకొండ | శ్రీనివాస్ పెండ్యాల

vyasam@madhuravani.com

నిశ్శబ్దంలో నీ నవ్వుల్లో నేను ఏరిన పువ్వులు

పాలపర్తి ఇంద్రాణి

పొట్ల పువ్వుల జిగిబిగిలా కొంత అందమూ కొంత అర్ధంకానితనమూ కలగలిసి చిత్రమైన అనుభూతినిచ్చేదే మంచి కవిత్వం.
ఆ కోవలో ప్రధమ స్థానంలో నిలబడే అతికొద్దిమంది విలక్షణ కవుల్లో తమ్మినేని యదుకుల భూషణ్ గారు ఒకరు.  
  కొంత సుతిమెత్తనితనము,కొంత పెళుసుదనము అందులో అందని రహస్యమూ  కలిపి జడలల్లిన చిత్రకాంతుల కవిత్వం వీరిది.
 

వీరూ నేను చదివిన ఇంజినీరింగ్ కాలేజ్ లోనే చదువుకోవడం కాకతాళీయమే అయినా నాకు చాలా సంతోషం కలిగించే విషయం.
    

చెట్టు కవి ఇస్మాయిల్ గారు వీరి మొదటి పుస్తకం "నిశ్శబ్దంలో నీ నవ్వులు" కు ముందుమాట రాస్తూ-

భూషణ్‌పద్యాలు బక్కగా,బలంగా ఉంటాయి.ఎక్కడా పిసరంత కొవ్వు కనిపించదు. తెలుగు కవిత్వానికి లయ హృదయస్పందన వంటిదనీ,అక్షరమైత్రి ఊపిరి వంటిదనీ ఇతనికి తెలుసు.ఇతని పద్యాలు కొన్ని సీతాకోక చిలకల్లా అన్ని వేపులకీ ఒకేమారు ఎగరాలనే ప్రయత్నంలో గాలిలో రెక్కలల్లార్చుతున్నట్టు కనిపించినా,భూషణ్‌ సామాన్యుడు కాడు. కవిత్వ హృదయాన్ని గ్రహించినవాడు.ముందు ముందు ఇంకా మంచికవిత్వం రాయగల ప్రతిభ ఇతనికుంది.ఇతని పురోగమనాన్ని ఆసక్తితో గమనించదలచుకొన్నాను.- అంటారు

ఇంత పంతమేలనే రచన, స్వరరచన

శ్రీనివాస భరద్వాజ కిశోర్ ( కిభశ్రీ )

కొంటె కృష్ణుడు తమ ఇళ్లలో వెన్న దొంగిలించాడని, పాలు పెరుగులు బతకనీయడనీ, తుంటరివాళ్ళను వెంట వేసుకుని అల్లరి చేస్తున్నాడనీ, తమ బుగ్గ కొరికాడనీ మరింకా ఎన్నో రకాలుగా తమను బాధిస్తున్నాడని యశోదకు ఫిర్యాదు  చేస్తారు వ్రజవనితలు.  ఈ వృత్తాంతం మీద ఎందరో కవులు, ఎన్నో రకాల రచనలు చేసారు.  ఈ ఉదంతాన్ని, చాడీల నెపంతో కృష్ణుడిని చూసేందుకే వారు వస్తున్నారన్న భావన కూడా కొందరు కవులు, రచయతలు వ్యక్త పరచారు.  ఇది మరొక ఖొత్త దృష్టికోణం ఊహాకల్పన

 

తన బిడ్డపై గోపవనితలు చెప్పిన చాడీలకు రోషం వచ్చి, వాళ్ళకు గుణపాఠం నేర్పాలని యశోద కృష్ణుడిని గృహ నిర్బంధంలో ఉంచుతుంది.  రెండు రోజులలోనే కన్నయ్య కనబడక రేపల్లె మొత్తం తపించిపోతుంది.   ఇత తాళలేక గోపస్త్రీలంతా, యశోద దగ్గరికి వెళ్ళి కృష్ణుడిని చూపించమని మొరపెట్టుకుంటారు.  కానీ, కోపం తగ్గని యశోద ససేమిరా అంటుంది.  చివరకు .....    చదవండి.   ఈ సన్నివేశం ఊహాస్వాతంత్ర్యం వాడి వ్రాసినవే కానీ ప్రామాణికం కావు. 

మారుతున్న సమాజంలో సాహితీ విలువలు

శ్రీ వేదాంతం సుబ్రహ్మణ్యం

ఈ వ్యాసాన్ని శ్రీ వావిలాల కృష్ణ గారు మధురవాణికి అందించారు.  సుమారుగా 1977 ప్రాంతంలో వ్రాయబడినదీ వ్యాసం. రచయిత కాలం చేసి కొన్ని సంవత్సరాలైంది. సుబ్రహ్మణ్యం  గారికి తెలుగు సాహిత్యంపై ఉన్న మక్కువ ఈ వ్యాసం తెలియజేస్తుంది.  ఆ కాలంలో సమాజంలో వచ్చిన/వస్తూన్న మార్పులు, భాష, సాహిత్యం ఏవైపు మొగ్గాలీ అనే చర్చ ఈ వ్యాసానికి మూల వస్తువులు.

***

కవి వెలిబుచ్చే సత్య ప్రతిపాదనము భావ గాంభీర్యముతో కూడుకొని, చిత్త దీప్తి పరిమితము కాక, గుండెను కరిగించునదిగా ఉండి తీరాలి.   కేవల తత్త్వము కన్న, విజ్ణానమును ప్రసాదించు కళగా రూపొందాలి.  కామ క్రోధ మోహాది దుష్ట ప్రవృత్తులకు పరిహారము చూపెట్టేదిగా రూపొందాలి. 

నండూరి రామమోహనరావు...   ఒక పరిశీలన

గిరిజా శంకర్ చింతపల్లి

1952-53 సంవత్సరాలు. నేను 3ర్డ్ ఫాం చదివే రోజులు. అప్పుడు ఆంధ్రపత్రిక, వారపత్రిక మా యింటికి రెగులర్ గా వస్తుండేది. అంతగా హోం వర్క్   లేని రోజులవి.  అందుకని అమ్మతో పోటీగా ఆ పత్రిక చదువుతుండేవాణ్ణి. కాంచనద్వీపం అనే సీరియల్ అప్పుడు నాకు చాలా యిష్టం. అది అనువాదం  చేసినాయన ఇప్పుడు మనం స్మరించే కథానాయకుడు. నండూరి రామమోహనరావు. ఆయన అనువాదం చేసిన మార్క్ ట్వైన్ నవలలు,  రాజూ   పేద,  హకల్బెరి ఫిన్, టాం  సాయర్.. . ఇలా వరసగా సీరియల్స్ వస్తుండేవి. ఆ కథలు చాలామందికి లాగానే నాకూ పుస్తకపఠనం మీద ఆసక్తి  ఎక్కువ చేసింది. 

 

అయన అనువాద రచనలు నిజంగా అనువాదాలు కావు. అనుసృజనాలు , కవిత్రయం భారతంలా. వాటిని గురించి చెబుతూ బాపూరమణలు, "ఆ కథల్ని అతను అనువదించలేదు. తెలుగులో రామమనోహరంగా రాశాడు" అన్నారు. ఆయనకి "అనువాద హనుమంతుడ"నే బిరుదు గూడా ఇచ్చారు.