Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా మధురాలు

నిర్వహణ: దీప్తి పెండ్యాల | మధు పెమ్మరాజు

katha@madhuravani.com 

భిక్ష

ఆర్. శర్మ దంతుర్తి

మధ్యాహ్నం భిక్షకి బయల్దేరాడు భగవానుడు తనకూడా కొంతమంది భిక్షువులూ, ఆనందుడూ అనుసరిస్తూండగా. క్రితం రోజు వెళ్ళిన దారిలోనే బుద్ధుడు బయల్దేరుతూంటే ఆనందుడు ఏదో అనబోయేడు కానీ, ‘ఆయనకి తెలియదా’ అనే ఆలోచన రావడంతో మరి మాట్లాడలేదు. ఓ వీధిలో ఇంటి దగ్గిర ఏదో కలకలం. ఇంటి యజమాని కోపంగా ఎవరిమీదో అరుస్తున్నట్టున్నాడు. ఆ ఇంటికెదురుగా తమకి పరిచయం ఉన్న మరో ఇంటికి బుద్దుడు దారితీయబోతూంటే మొదటి ఇంట్లోంచి పెద్దగా వినిపించాయి మరో సారి కేకలు; తర్వాత ధడేల్ మంటూ తలుపు మూసుకున్న చప్పుడు. కూడా ఉన్న శిష్యులని భిక్షకి వేరే చోటకి వెళ్ళమని చెప్పి భగవానుడు ఆ కేకలు వినిపించిన మొదటి ఇంటికే బయల్దేరేడు. సంఘంలో జేరాక ఏనాడూ బుద్ధుణ్ణి విడిచి ఉండని ఆనందుడు వెనకనే అనుసరించాడు...

భలే మలుపు!

రాజేష్ యాళ్ళ

madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన కథలపోటీ లో ప్రశంసా  బహుమతి సాధించిన కథ.

"రాసింది చాలు కానీ కొంచెం ఇలా వచ్చి ఉల్లిపాయలు కోసిపెట్టండి!" వంటగదిలోనుంచి వినపడిన భార్య అలివేలు మాటకు తెగ కోపం వచ్చేసింది గోవిందానికి!

"ఉల్లిపాయలు కోయడం నాకేమీ కొత్త కాదు కదా! ఇక్కడ రాసుకుంటున్నానని తెలిసి కూడా ఆ పని చెప్పడం ఎందుకు? పైగా 'రాస్తున్నది చాలు కానీ' అంటూ ఆ ఎద్దేవా మాటలెందుకు?" ఉక్రోషంగా అడిగాడు గోవిందం లోపలికి వెళ్ళి.

"ఉల్లిపాయలు కోస్తే కూరైనా అవుతుంది. కానీ మీరు కథను రాస్తే అది ప్రచురణ మారం అవదు కదా?!" లాజికల్‌గా అడిగింది అలివేలు...

స్పర్శ

 ప్రజ్ఞ  వడ్లమాని

సస్య ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ఎక్కేందుకు సిద్ధంగా ఉంది. ఇంకొక గంట సమయం ఉంది.  వారం రోజుల ఇండియా ట్రిప్ ఇట్టే గడిచిపాయింది. చాలా సంతోషంగా, తేలిక మనసు తో ఉంది.  కానీ ఎందుకో వెళ్లాలని లేదు. అమెరికా లో ఉండే చాలా మందికి కలిగే భావమే ఇది-  తమ సొంత వాళ్ళని, ఊరిని చూసి మళ్లీ తిరిగి పరుగుల ప్రపంచంలోకి  వెనక్కి వెళ్లలేకపోవడం. ఇలా మదిలో ఎన్నో ఆలోచనలు మెదులుతూ ఉండగా, ఎదురుగా ఒక అతను కనిపించాడు. అతని వొళ్ళో ఒక చంటి పిల్ల. అతను ఆ చంటి పిల్ల పాదాలని తన బుగ్గ కి తాకించాడు. ఆ దృశ్యం ఎంతో చూడముచ్చటగా ఉంది. ఆలా చూస్తుండగా సస్య ఆలోచనలు నెమ్మదిగా తన చిన్నతనంలోకి జారుకున్నాయి...

లెక్క సరిపోయింది

గోవింద చింతాడ

madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన కథలపోటీ లో ప్రశంసా  బహుమతి సాధించిన కథ.

“ఎంత అవుతుంది బాబు” మళ్ళీ ఇంకొక సారి ఆడిగాడు సూరీడు తను విన్నది నిజమేనా అన్నట్లు.

“లక్ష” ఒక్క ముక్కలో చెప్పాడు ఆసుపత్రి బిల్ కౌంటర్ లో కూర్చొని వున్న వ్యక్తి కనీసం తల కూడా ఎత్తకుండా.

 “ఆరోగ్యశ్రీ పధకం లో ఏమైనా కొంత తగ్గుతుందా బాబు” ఆశగా అడిగాడు సూరీడు.

“ఆరోగ్యశ్రీ పధకం ఉంది కనుకనే నువ్వు కట్టవలసిన ఆపరేషన్, గది అద్దె, మందులు అన్నీ కలిపి మొత్తం ఒక లక్ష. మిగిలినవి ప్రభుత్వ పధకాల ద్వారా సర్దు బాటు అవుతుంది. మూడు రోజులలో ఆపరేషన్ చెయ్యాలి.” అన్నాడు కౌంటర్ లోని వ్యక్తి.

“లక్ష” అన్న మాట తప్ప మిగిలినవి ఏవీ వినిపించలేదు. అవును, మనకు ఏది అవసరమో అది వినిపిస్తే చాలు. ఆసుపత్రి నుంచి భారంగా బయటకు నడిచాడు.

అమ్మ తప్పిపోయింది

జానకి  శాస్త్రి

యింకా తెలతెలవారుతుండగానే పడవలాంటి కారు ఆ వీధిలోకి వచ్చింది.

యింటి ముందు ముగ్గులుపెడుతున్న ఆమ్మాయిలు, ముగ్గుబుట్టలు అక్కడే పడేసి యింటిలోకిపోయి తలుపులు ఓరగా వేసేసీ, తలుపుల మధ్య నుంచీ తొంగితొంగీ వీధిలోకి చూస్తున్నారు.

పొలాలకి బయలుదేరిన రైతులు అక్కడే నడి వీధిమద్యనే ఆగిపోయీ, కొందరు వింతగా మరి కొందరు భయం, భయంగా ఆ కారువేపు చూస్తూ కొయ్యగట్టి నిలబడిపోయారు. అపుడు తెల్ల యూనిఫారం వేసుకొన్నఒకతను తలుపు తెరిచీ పట్టుకొంటే ఎంతో ఠీవిగా కారులోంచి దిగాడు ఆయన...