MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
వ్యాస మధురాలు
నిర్వహణ: శాయి రాచకొండ | శ్రీనివాస్ పెండ్యాల
అది కథకి నా డ్యూటీ
మెడికో శ్యాం
నేనెరిగిన మునిపల్లె రాజు గారు.
నేను ఆయన గురించి ఎరిగింది స్వల్పం. అత్యంత స్వల్పం అన్నా అనవచ్చు. టిప్పాఫ్ ది ఐస్ బెర్గ్ అంటారే. అలాంటి టిప్ మాత్రమే నా జ్ఞానం. క్రిందనున్న ఆయన మంచుకొండ నాకు తెలీదు. అంత గోరంత పరిచయంలో కొండంత అవకాశం కలిగింది. దానికి కారణం ఆయన వున్నత వ్యక్తిత్వం.
చాలామంది నన్ను తరచుగా అడిగే ( అడిగిన) ఒక ప్రశ్న : నా పుస్తకానికి ఆయన ముందు మాట ఎలా రాసేరు? అని. నా స్వభావానికి ప్రత్యేకించి తాపత్రయ పడి రాయించుకోవడం కుదరని నాకు... అంచేత నన్నెరిగిన ఏ సమకాలీ(వయస్)కుడి చేతో రెండుముక్కలు రాయించి పనికానిచ్చేద్దామనుకున్నాను....
భార్య...భర్త... ఓ గ్లోబల్ ఖడ్గం
డా. కరణం శ్రీనివాసులు రెడ్డి
కుటుంబం మానవ నిర్మితమైన వ్యవస్థల్లో అత్యంత ప్రాచీనమైనది. ప్రాథమికమైనది. అంతేకాదు సార్వత్రికమైనది కూడా. కుటుంబమనేది ఒక మనిషి జైవిక, మానసిక, సామాజిక, సాంస్కృతిక, ఆర్ధిక మరియు ఆధ్యాత్మిక జీవితానికి మొదటి పాటశాల. ఒక వ్యక్తి వైయక్తికత నుండి సామాజికత వైపుకు సరైన రీతిలో పరిణామం చెందే ప్రక్రియ కుటుంబం నుండే మొదలౌతుంది. మానవుడి భావి జీవితం కుటుంబం నుండే మొదటి అడుగు పడుతుంది.
ప్రపంచంలో పటిష్టమైన కుటుంబ వ్యవస్థ కలిగిన దేశాలలో భారతదేశం ప్రముఖమైనది. వేల సంవత్సరాలుగా భారతదేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వర్ధిల్లింది. అదే వ్యక్తి వికాసానికి, సామాజిక సంబంధాలకు బలమైన పునాది వేసింది. భారతీయ కుటుంబ వ్యవస్థ లోపాలకు అతీతం కాకపోయినా,...
ఆధునికాంధ్ర సాహిత్యం - గమనం – గమ్యం