top of page
hasya.JPG
adannamaata.png

సంపుటి  4   సంచిక  1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా మధురాలు

నిర్వహణ: దీప్తి పెండ్యాల | మధు పెమ్మరాజు

katha@madhuravani.com 

బోస్టన్ టీ  పార్టీ

- డా.కే.వి.రమణ రావు

‘వాళ్ళ పెళ్ళికి ఇండియా వెళ్లొచ్చిన వాళ్ళందరిది ఒకటే మాట. అర్పితా మల్లెతీగల, నవీన్ కొండగుడి ఇద్దరూ ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అన్నారు. రూపంలోనే కాదు, అభిరుచుల్లో కూడా అంతగా కలసిపోయారన్నది ‘బే ఏరియా’లో వ్యాపించిన వార్త.  ఆమె బోస్టన్లో ఎమ్మెస్ చేసి ఆ మధ్య అక్కడే ఉద్యోగంలో చేరింది. అతను గ్రాడ్యుయేషన్ నుంచి ‘బే ఏరియా’లోనే చదివి ఇక్కడే నాలుగేళ్లు ఉద్యోగం చేసి ఈమధ్యనే బోస్టన్ వెళ్లిపోయాడు. అర్పిత  పాటలు పాడుతుంది, కవిత్వం రాస్తుంది. నవీన్ కీబోర్డు వాయిస్తాడు, ట్యూన్స్ కడతాడు. ఇద్దరూ ఈ దేశంలో జరిగిన పాటల కార్యక్రమాల్లో విజయవంతంగా పాల్గొని మంచిపేరు తెచ్చుకున్నవాళ్ళే. వాళ్లు ఒకరకంగా యువ ఎన్నారైలలో సెలెబ్రిటీలు. ముఖ్యంగా అర్పితది అబ్బురపరిచే అందం.’

      ఇదీ వినయ్ వాడరేవుల నాకు చెప్పిన సమాచారం. పెళ్ళిలో తను వాళ్లిద్దర్నీ చూశానని, వాళ్లతో స్టేజిమీద చాలాసేపు మాట్లాడానని చెప్పాడు.

చచ్చింది గొర్రె

డా. మూలా రవి కుమార్

“గవర్నమెంటు కంపెనీలంటే ప్రజా ప్రతినిధులకు ఎంత అలుసో!? వాళ్ళమాటలు వింటుంటే ఉజ్జోగం మీదే విరక్తి వస్తోంది సార్.” మేనేజరు గారి చాంబర్లోకి అడుగుపెడుతూ అన్నాడు కిరణ్.

“డవలెప్మెంటు ఆఫీసరుగా జాయినైన ఏడాదిలోపలే ఇంత వైరాగ్యమా!? అదీ కాక మరో మూణ్ణెల్లలో బ్రహ్మచర్యం వదులుకుంటున్నవాడివి కూడా. ఇంతకీ ఈ వైరాగ్యానికి కారణం ఏమిటి?” మేనేజరు నవ్వుతూ అడిగారు.

“ఈ జిల్లాలో గొర్రెల ఇన్సూరెన్సుని తాత్కాలికంగా ఆపేం కదా? ఈరోజు ఎమ్మెల్యే గారి కుడిభుజం నాకు ఫోను చేసి మళ్ళీ ప్రారంభించమని హుకుం. అది నా చేతులలో లేదు అని చెబితే, ఎవరి చేతులలో ఉందో వాళ్ళని ఎమ్మెల్యేగారికి ఫోను చెయ్యమని మరో ఆదేశం.”

మాష్టారి విజయం!

జయంతి ప్రకాశ శర్మ

"నమస్కారం మాష్టారు. బాగున్నారా?" మాష్టారింట్లోకి అడుగు పెడుతూ రెండు చేతులు జోడించాను.


"రా నాయనా... రా!  అలా కూర్చో!" మాష్టారు సాదరంగా ఆహ్వానించి లోపలకి తీసుకెళ్ళారు.


తెల్లటి గ్లాస్కో పంచె , తెల్లటి సైన్ గుడ్డతో కుట్టిన జుబ్బా వేసుకుని, నిండుగా ఆరడుగుల మాష్టారి గొంతుకలో ఎక్కడా మార్పులేదు.  ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం స్కూల్లో పాఠాలు చెప్పుతున్నట్టే ఉంది.

పాత కాలం ఇల్లు. చతురస్రంగా నాలుగు వాసలిల్లు. ఆ నాలుగు వరండాల మధ్యలో పెద్ద వాకిలి. వరండాల చూరుల్లోంచి సన్నని తీగలతో అల్లిన పందిరి. ఆ వాకిలి మధ్యలో తులసికోట. నాలుగు వరండాలనుకుని నాలుగు గదులు. ఓ గది... చావిడి లోంచి వీధిలోకి దారి, దాని ఎదురుగా వసారాలో ఉండే గదిలోంచి వెళ్తే, ఇంటి వెనుక పెరడు వస్తాయి. కుడివైపు వరండాలో పెద్ద పీట ఉయ్యాల. 

వింత న్యాయం

ఆదూరి హైమావతి

        వాతావరణం చాలా బాగుంది. పార్కులో  కూర్చుని చుట్టూ ఉన్న పచ్చని చెట్లను చూస్తూ ఆనందిస్తున్నాను. హాయిగా పూల మీది నుంచీ వచ్చే సువాసన  పీల్చు కుంటూ, గాలికి అలవోకగా తలలూపే పూలగుత్తులను చూస్తూ, ప్రకృతిమాత అందచందాలకు పరవసించి, మైమరచి పోయాను.

 

ఆకులన్నీ ఒకే రంగులో పచ్చగా ఉన్నా పూలు మాత్రం వివిధ రంగుల్లో పూస్తుండటం ఎంత చిత్రం, అలాగే  మనుషులంతా  ఆకారంలో పైకి రెండు కాళ్ళూ, చేతులు మిగతా అవయవాలతో  ఒకేలా ఉన్నా మనస్తత్వాలు మాత్రం వేరు వేరు.' అనుకుంటూ కూర్చున్నాను.  

 నా భుజమ్మీద చేయిపడటంతో నా ధ్యానలోకం నుంచీ  ఉలిక్కిపడి తిరిగి చూశాను.

ఆణిముత్యాలు

వేదుల చిన్న వేంకట చయనులు

‘ఇదుగో వచ్చా, జావ అయిపోవచ్చింది’ అని వర్ధనమ్మ గట్టిగా కేక వేసింది. వంటింటి పక్కనే మంచం మీద మూల్గుతూ, భర్త రంగయ్య అప్పటికే నాలుగు శాపనార్థాలు పెట్టడమయింది. జావ కలుపుతూ వర్ధనమ్మ యథాప్రకారంగా స్మృతిపథం లోకి మరలింది.

ఆ మిద్దె ఇంట్లో కాలుపెట్టి అరవై యేళ్ళవ వస్తోంది. ఎంత వైభవంగా ఉండిందో ఆ ఇల్లు, ఆ వీథి, ఆ పల్లె!

 

బండి శ్రీరాంపురం పొలిమేరలు చేరగానే, పచ్చని పైరులు, చల్లని వాతావరణమూ చూసి అచ్ఛంగా శ్రీరాములు వారే దానిని పోషిస్తున్నారా అని అనిపించింది, నూతన వధువైన వర్ధనమ్మకు. కాలచక్రంలో ఎంత మార్పు వచ్చింది!

bottom of page