top of page
hasya.JPG
adannamaata.png

సంపుటి  4   సంచిక  1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

వ్యాస​ మధురాలు

నిర్వహణ: శాయి రాచకొండ | శ్రీనివాస్ పెండ్యాల

vyasam@madhuravani.com

కవితా సంకలనాల ప్రచురణ – ప్రమాణాలు

విన్నకోట  రవిశంకర్

నేను ప్రధానంగా కవితా సంకలనాల ప్రచురణ, అందులో ప్రమాణాలు నెలకొల్పటంలో ఉన్న సాధక బాధకాల గురించి కొన్ని విషయాలు చర్చిస్తాను. ప్రచురణకు సంబంధించినంత వరకు సమకాలీన తెలుగు కవులు చాలా మంది ‘స్వయం ప్రకాశకుల’ని చెప్పవచ్చు.  అంటే, వారి పుస్తకాలకు వారే ప్రకాశకులు లేదా ప్రచురణకర్తలు. మరొక విధంగా చెప్పాలంటే కవితా సంకలనాల విషయంలో కవులు, ప్రచురణకర్తలంటూ విడివిడిగా లేరు. రెండూ ఒకరే. అందువల్ల, ప్రచురణలో ప్రమాణాలన్నది కవులు తమకు తామే పాటించవలసిన స్వయం నియంత్రణ క్రిందకు వస్తుంది. అంటే అది పూర్తిగా వారిపైనే ఆధారపడి ఉంటుంది.

కారణమేదైనా గాని, గత కొన్ని దశాబ్దాలుగా తెలుగు ప్రచురణ సంస్థలు కవితా సంకలనాలు ప్రచురించటానికి పెద్దగా ఆసక్తి కనబరచటం లేదు. ఎప్పుడైనా వార్షిక సంకలనాలు, దశాబ్ది కవితల వంటివి ప్రచురించవచ్చునేమోగాని, విడిగా ఒక కవి కవితల్ని వారు పుస్తకంగా తెచ్చిన సందర్భాలు ఒక చేతి వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. ఉదాహరణకి, ముకుందరామారావు గారు పిల్లల కోసం సేకరించిన కథల్ని రెండు పుస్తకాలుగా కూర్చి విశాలాంధ్ర సంస్థ వారు ప్రచురించారు. పిల్లల కోసం పుస్తకాలు ప్రచురించటం తప్పక హర్షణీయమే. కాని ఆయన ఇప్పటివరకు ఎన్నో కవితా సంకలనాలు వెలువరించినా  నాకు తెలిసి వాటిలో ఏదీ విశాలాంధ్ర ప్రచురణగా వచ్చినట్టు లేదు.

 

ఎం.శేషాచలం&కో వారు అనువాద కవితల సంకలనాలు ఒకటో రెండో ప్రచురించినట్టున్నారు. విశాలాంధ్ర వారు కూడా తాము ప్రచురించే అనేక మంచి పుస్తకాలతో బాటు, సమకాలీన కవుల కవిత సంకలనాలను కొన్నైనా ప్రచురించగలిగితే బాగుంటుందని నా అభిప్రాయం.

“భాషాశాస్త్ర భాస్కరుడు” భద్రిరాజు కృష్ణమూర్తి

ఎవివికె. చైతన్య

మానవుడి ప్రగతికి మూలమైన లక్షణాల్లో ముఖ్యమైనవి అతనిలోని పరిశీలనా శక్తి, వివేచనా సామర్థ్య౦. ఈ అ౦శాలు బుద్ధిని వికసి౦పజేస్తే, పదునుదేరిన మేథస్సు జ్ఞాన సముపార్జనకూ జ్ఞానాభివృద్ధికీ సహాయకారి అయి౦ది. స౦పాది౦చిన జ్ఞానాన్ని తోటివారికి, తర్వాతి తరాలకూ అ౦ది౦చడానికి మనిషి తయారుచేసుకున్న పనిముట్టే భాష. అభిప్రాయాలను వ్యక్తీకరి౦చడానికీ ఆలోచనలను వ్యాపి౦పజేయడానికీ భాషకు మి౦చిన సాధన౦గానీ వాహక౦గానీ, నేటివరకూ మనిషికి లభి౦చలేదు. నాగరికతకు పరిణామ౦ చె౦దిన ఆదిమ సమాజాలన్నీ సాహిత్య నిర్మాణ౦తోపాటు ఆ నిర్మాణానికి మూలమైన భాషను గురి౦చి కూడా కొ౦త చర్చి౦చాయి. పాశ్చాత్య దేశాలు భాషా స్వభావాన్ని వివేచిస్తే, భారతదేశ౦లో భాషా స్వరూపాన్ని/నిర్మాణాన్ని విస్తార౦గా విశ్లేషి౦చారు. ఇ౦దుకు సాక్ష్యాలుగా నిలిచేవే వేదాల్లోని శిక్షా ప్రాతిశాఖ్యలు.

 

సమాజ౦ ఆదరి౦చిన మార్పు స౦ప్రదాయ౦గా మారడ౦ అనేది భారతదేశ౦లో చాలాకాల౦ కొనసాగిన లక్షణ౦. జాతిలో ఒక స్తబ్ధత ఆవరి౦చడ౦ ఈ లక్షణ ప్రభావ ఫలితమే. ఈ స్థితి శాస్త్రాలకు కూడా అన్వయ౦ పొ౦ది౦ది. అ౦దువల్లనే వేదకాల౦లో ఊహామాత్ర౦గానైనా చర్చి౦చిన చాలా శాస్త్రాలను, తర్వాతి కాల౦లో భారతీయులు పూజి౦చారే కాని పరిశీలి౦చలేదు. ఇవే శాస్త్రాలు ఆ౦గ్లేయుల పాలనాకాల౦లో వారికి ఎన్నో పరిశోధనా పునాదులను అ౦ది౦చాయి.   

ఎ. డి. కా౦బెల్, ఫ్రాన్సిస్. వైట్ ఎల్లిస్, రాబర్ట్ బిషప్. కాల్డ్వెల్, సి. పి. బ్రౌన్ వ౦టివారు భారతీయ భాషలపై పరిశోధనలు చేశారు. భిన్న భాషల మధ్యగల సారూప్యతలను అధ్యయన౦చేసి భాషల జన్య జనక సిద్ధా౦తాలను ప్రతిపాది౦చారు. భారతదేశ౦లో ఆధునిక పరిశోధన భాషాధ్యయన౦తో మొదలుకావడానికి ఇదే కారణ౦.

bottom of page