bhuvanollasam.PNG
srinivyasavani.PNG

సంపుటి  6   సంచిక  1

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

కథా మధురాలు

నిర్వహణ:     దీప్తి పెండ్యాల | మధు పెమ్మరాజు

katha@madhuravani.com 

ఏ కులమూ నీదంటే గోకులమూ నవ్వింది

శశికళ ఓలేటి

" ఎవడ్రా నువ్వు? జాంచెట్టు దిగు ముందు! ఎవడు రానిచ్చాడు నిన్ను! దొంగెదవా! ఏయ్యో! ఇలా రా! ఈడిని పట్టుకో, !"కొంపలు మునిగిపోతున్నట్టు కేకలు పెడుతున్న రాఘవమ్మ మాటలకు గాబరాపడుతూ దుడ్డుకర్ర పట్టుకుని బయటకొచ్చాడు రామయ్యగారు.

అడవిలా పెరిగిపోయిన ఆ చెట్ల మధ్యనుంచి,ఎండుటాకులూ, పుల్లలూ కాళ్ళ కింద టపటటపలాడుతుంటే  ఎట్టకేలకు పెరట్లో ఆగ్నేయ మూలన ఉన్న జామిచెట్టు దగ్గరకు అతికష్టం మీద వచ్చాడాయన! ఎదురు ఎండకు చెయ్యడ్డంపెట్టుకుని కళ్ళు చిట్లించుకు చూస్తే కనపడ్డాడు కొమ్మల మధ్యలో ఓ బక్కపల్చని కుర్రాడు. జామకాయ నోటిలో కుక్కేసుకుంటూ!

రాఘవమ్మ విసురుతున్న రాళ్ళ దెబ్బలకు వెరవకుండా ఆ కొమ్మనుండి మరో కొమ్మకు పాకేసి, 

శబ్ధచిత్రం

మణి వడ్లమాని

“అవును కదా ”

“నిజమే అసలు నమ్మలేకపోయాను”

“ఊహించలేదు.నేనయితే షాక్ అనుకో ”

                  **

  “చిన్నతనంలో తండ్రి, పెళ్లి అయ్యాక భర్త, ఇహ చివరి దశలో కొడుకు. బ్లా..బ్లా బ్లా. .. ఈ మాటల కి  చిరాకు, కోపం కూడా వస్తున్నాయే!”  ఆవేశ పడసాగింది స్వప్న. 

“ఏయ్  ముందు జాగ్రత్తగా డ్రైవ్ చెయ్యి,తరువాత చిరాకు పడు !” పక్కన కూర్చున్న స్నేహితురాలు అంది.

సిమ్ సిటీ

మధు చిత్తర్వు

నగరానికి దూరంగా నలభై  కిలోమీటర్ల దూరంలో ఉంది  సిమ్ సిటీ.

 

భాగ్యనగరానికి వ్యాపారం మీద కానీ, పర్యటన కోసమో కానీ వచ్చే వారందరి కోసం, వారి ఆనందం కోసం దూరంగా కొండలమధ్య  చెట్ల మధ్య నిర్మించిన రిసార్ట్. రోడ్డు మార్గంలో పోవచ్చు. మెట్రో రైలు ఎక్స్టెన్షన్ మార్గంలో సిమ్ సిటీ స్టేషన్ దాకా కూడా పోవచ్చు. గంట ప్రయాణం. ఒక రోజు గడిపి మళ్ళీ రెండో రోజు కు రావచ్చు లేదా అక్కడే ఒక వారం ఉండొచ్చు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఒక వారం ఉండగలరు. ఎందుకంటే అక్కడ ఒక్క రోజు ప్యాకేజీనే రెండు లక్షల ఏభైవేల రూపాయలు! 

 

కానీ అక్కడ వచ్చే థ్రిల్, ఆనందం మరెక్కడా రావు. అసలు రెండు రోజుల ప్యాకేజీ లో జరిగే వింతలు, విలాసాలు చాలు జీవిత కాలం గుర్తు ఉంచుకోవటానికి. 

టీకా తాత్పర్యం

జయంతి ప్రకాశ శర్మ

నరసయ్యగార్నుంచి ఫోన్.. నాలుగు రింగులు అయిన తర్వాత, వెళ్ళి వీధి తలుపు తీసాను.

 

ఈ మధ్యకాలంలో డోర్ బెల్లు పని చేయకపోవడంతో, నరసయ్యగారు గుమ్మం ముందు నిలబడి ఫోన్ రింగు చేస్తున్నారు. మా ఇద్దరికి ఓ ఒడంబడిక అది.

"అదేమిటి.. మీ ఫోన్లో కరోనా కథ రాలేదు?" అంటూ లోపల కొచ్చి ఆశ్చర్యం నటిస్తూ అన్నారు.

"అదేమో.. నాకేం తెలుసు? కరోనా తగ్గిందిగా, బహుశ ఆ సుత్తిముక్తావళిని తీసేసుంటారు!" నవ్వుతూ అన్నాను.

"అదా సంగతి!! తడుముకోకుండా చెప్పేస్తారు! అవునుగాని .. మీరేమిటి  అలా సర్వస్వతంత్రంగా తిరుగుతున్నారు?" అంటూ వంటింట్లోకి ఓ చూపు విసిరారు. 

శక్తి 

 నవులూరి వెంకటేశ్వర  రావు

బాల్యం నుంచే, ఉన్న వయసుకన్నాఐదేళ్లు పెద్దగా కనిపిస్తూ వస్తున్నఅప్పన్న నేటి అసలు వయసు నలభై.

 

నూకాలుది వయసెరుగని దృఢమైన శరీరం.  అందం కూడా ఆమె సొత్తు. ఆటుపోట్లకు తట్టుకోగల తత్వం ఆమెది.  ఈసురోమని ఉండే గుణం ఆమె భర్తది.

 

ఆమె అతని జీవం, చైతన్యం, వెన్నుముక. అసలే అంతంత మాత్రంగా సాగుతున్న జరుగుబాటు క్షీణించింది. అప్పన్న మరీ నీరసపడిపోగా, జీవితమంటే ఇలాగకాక  మరోలా ఉండదన్న అభిప్రాయానికి ఏనాడో వచ్చేసిందామె.  అందుచేత దాని గురించి మాట్లాడటం, అసలు ఆలోచించడమే మానేసింది. 


అది అతిచిన్న గ్రామం కనుక చేయడానికి కూలిపనులు తక్కువ. దొరికిన ప్రతి పనిని కౌగిలించుకో వలసిన అవకాశంగా ఆమె భావించగా,

దెయ్యం వేదం వల్లించనీ ( తమిళ మూలం: జయకాంతన్ )

అనువాదం: రంగన్ సుందరేశన్

మధ్యాహ్నం మూడుగంటలు తరువాత, రెండుగంటలు నిద్రపోయి, స్నానం చేసి, కొత్తబట్టలు తొడుక్కొని, దువ్వుకున్న జుత్తులోని తడి ఆరడానికిముందే ‘అది' ఆయనకి కావాలి! ఒక పరిచారకుడుగా అతన్ని పోషించే నౌకరు అప్పుకుట్టన్ కి అది సారాయిమాత్రం కాదు అని తెలుసు. ఐతే, తక్కినవాళ్ళకి తెలిసినదంతా మధుసూదనరావు ఒక తాగుబోతు అనే!

అతని బంగళా మేడమీద మండువాలో గుండ్రపు మేజాచుట్టూ మూడు కుర్చీలు కనబడతాయి. ఐతే రావుగారు కూర్చున్నది తప్పిస్తే తక్కిన రెండూ ఎప్పుడూ ఖాళీగానే కనబడతాయి. కాని ఆ కుర్చీలు అక్కడ కావాలి అని అప్పుకుట్టన్ కి తెలుసు.

పప్పు సత్యం   (ఓ చిట్టి కథ)

కాళీపట్నం సీతా వసంత లక్ష్మి

పెళ్లి హాల్  అంతటా సందడిగా ఉంది.  పలకరింపులు, చిరునవ్వులు, పట్టుచీరల కరకరలు, బంగారం, డైమండ్ నగల తళతళలు,  కొత్త గాజుల గలగలలు, మగవారి ప్యాంటు షర్టుల కసకసలు,  పెళ్ళికొడుకు ముచ్చట్లు, పెళ్లికూతురు మురిపాలు,  కొత్త కోడళ్ల మీద వేళాకోళాలు, కడుపుతో ఉన్న అమ్మాయిల ఆపసోపాలు, మొత్తం మీద కళకళలాడిపోతోంది. 

 

పెళ్లి హాల్లో ఎంత హడావుడి ఉందో  అంతకు మించి వంట హాల్లో ఉంది ఖంగారు, హడావుడి.  ఆ ఊరిలో  ఏ పెళ్లి అయినా కాస్త ఆర్భాటంగా జరగాలంటే, లక్ష్మి కల్యాణ మండపం, బాంక్వెట్ హాల్, తోడుగా సత్యం కేటరింగ్  ఉండి  తీరాల్సిందే. 

ఆ గ్రూపులో పెద్ద సత్యంగారు, చిన్న సత్యం, చిట్టి సత్యం ఉండాల్సిందే.  అవటానికి కేవలం పెద్ద సత్యం మాత్రమే అసలైన సత్యం పేరు గలవాడైనా,

టైం ఫర్ సెలెబ్రేషన్స్

మైలవరపు ప్రసాద్

తన ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉంది సుగుణ. అప్పుడే సాయంకాలం 4.30 అయ్యింది. ఇంకో గంటో, గంటన్నరో కష్ట పడితే,  ఈ రోజుకి పని అంతా అయిపోయినట్టే. రేపూ, ఎల్లుండీ సెలవు కదా? బోలెడంత రెస్ట్ తీసుకోవచ్చు అనుకుంది సుగుణ.

ఇంతలోనే “మేనేజర్ గారు పిలుస్తున్నారు” అంటూ హెడ్ ప్యూన్ చెప్పడంతోనే, కంప్యూటర్ లో టైప్ చేస్తున్న రిపోర్ట్ ని  అలాగే వదిలేసి బాంకు మేనేజర్ గారి గది లోకి వెళ్ళింది.

అక్కడ మేనేజర్ ఎదురుగా తన కొడుకు అగస్త్య కూర్చుని ఉండడం చూసి ఆశ్చర్య పోయింది.

“ మరేం ఫర్వాలేదు. నేను ఆయన్ని రేపు చూస్తానుగా!” అంటున్నాడు మేనేజర్.

Website Designed

 &  Maintained

by

 Srinivas Pendyala 

Feedback

sahityam@madhuravani.com

 

©  2021 madhuravani.com

మధురవాణి కొత్త సంచిక విడుదల వివరాలు ఉచితంగా సకాలంలో అందుకోవాలంటే మీ పేరు, ఇ-మెయిల్ చిరునామా sahityam@madhuravani.com  కి పంపించండి.

మీ వివరాలు ఎవరితోనూ పంచుకొనబడవు.​

Website Designed

 &  Maintained

 by

Srinivas Pendyala