top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

సంపుటి  4   సంచిక  4

adannamaata.png

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కవితా  మధురాలు

girlwrite.JPG

కలేకూరి ప్రసాద్

సంపాదకుల ప్రత్యేక ఎంపిక

అంటరాని ప్రేమ

గాయాలు సలుపుతున్నా

గుండెల మీద నీ పాద ముద్రల్నే కదా మోశాను.

చావు ముసురుకొస్తున్నా

నీతో బతుకునే కదా కోరుకున్నాను

ప్రేమ కోసమే బతక లేక పోయినా

కనీసం ప్రేమ కోసమే చద్దామనుకున్నాను

 

ప్రియా !

పొద్దుటన్నంలో పెరుగేసి

నువు  పెట్టిన సందేళబువ్వ  సాక్షిగా

నా చావుకి కారణమేం టో నిజం చెప్పవా

 

ప్రియా !

బతికినంత కాలం నిన్నిట్టాగే పిలవాలని

నా గుండే , నెత్తురూ,  భాషా

ఎంత తన్నుకులాడాయో  తెలుసా

చీకటి మాటున మన శరీరాలు

పెనవేసుకుపోయేప్పుడైనా

నిన్ను అమ్మ గోరూ  అని పిలవటం తప్ప

బతికినంత కాలం కోరిక తీరనే లేదు

 

మీ వాళ్లంతా నన్ను రచ్చబండకీడ్చి

పందిరి గుంజకు కట్టేసి

నన్ను గొడ్డును బాదినట్టు బాదుతుంటే

నేను నవ్వుకున్నాను

దీనంగా తలలు వంచుకుని నిలబడ్డ

నా జాతి జనాన్ని చూసి ఎంత జాలి పడ్డాను!?

సంగతే దిరా అని మీ వాళ్ళవరన్నా అడిగితే

నిన్ను ప్రేమించానని అరచి చెబుదామనుకున్నాను

కానీ నేను దొంగనని రచ్చబండ ఆరోపణ

సాక్షివి  నువ్వే కదా

 

చచ్చిన శవాలను తగలబెట్టడం తెలుసు నాకు

కానీ బతికుండగానే మీ వాళ్లు నాకు నిప్పు పెట్టారు

'తండ్రీ వీరేమి చేయుచున్నారో

వీరెరుగరు కనుక వీరిని క్షమించుము'

ఫాదరి  గారు చెప్పిన మాటలు

గుర్తొస్తూనే వున్నాయి

 

మనం గడిపిన నిద్రలేని రాత్రుల సాక్షిగా

నీ కంట్లో ఒక్క కన్నీటి చుక్క మెరిసినా

నిన్నూ  నీ వాళ్ళనూ  క్షమించేసేవాణ్ణి

 

గుండెల్లో నువు  రగిలించిన నిప్పుల కుంపటి

వంటి మీద మీవాళ్లంటించిన కిరసనాయిలు మంటలు

ఏ బాధ  ఎక్కువని అడిగితే

ఇప్పుడు చెప్పలేను

 

ప్రియా!

ఈ మంటలు నన్ను అలుముకొంటుంటే

నువ్వు నన్ను వాటేసుకున్నట్టే  వుం ది

 

("అంటరాని ప్రేమ" కవితా సంపుటి నుండి )

నిర్వహణ 

విన్నకోట రవి శంకర్ | మధు పెమ్మరాజు

kavita@madhuravani.com 

Luptatma.JPG

లుప్తాత్ముని అచింతిత చింతన

ఉండుగదా మనస్సునన్నీ

 

చూడాలంటే ఆ స్వర్గాన్నీ
…వీడాలంటే ఈ నరకాన్నీ
ఇడగడగడం వినై సరసమనీ
...పొడగించినా విదిలించు అహాన్నీ
గుండెతల్లడము చెసేవన్నీ
…ఉండెగదా మనస్సునన్నీ
 
బ్రాడ్ వేలో జరిగిన ఓపరా బాతాఖానీ
…బ్యాండ్ స్టాండ్ లో నమిలిన పచ్చిబటానీ
పడిచచ్చే నలగని సూటు అర్మానీ
…ఒడికప్పే చిరుగుల పాత షేర్వానీ
వడివడిగా పిలవకవచ్చే కష్టాన్నీ
… దిగఁబడి తరిమినా పోని ఇష్టాన్నీ
అడిగంటుల విస్తృత నిష్టూరాన్నీ
…అడగకచేయు ఆశ్రిత ఉపద్రష్టాన్నీ
కూడిమిగా చూడగలిగితే ఇవన్నీ
…అడుగిడదా ఉన్మన్యవస్థ మనాన్నీ
 
చూడాలంటే ఆ స్వర్గాన్నీ
…వీడాలంటే ఈ నరకాన్నీ
ఇడగడగడం వినై సరసమనీ
…పొడగించినా విదిలించు అహాన్నీ
గుండెతల్లడము చెసేవన్నీ
…ఉండెగదా మనస్సునన్నీ
వికటించు సుడిగాడ్పులని కమ్మని తెమ్మెరగా
సైకతశ్రోణి ఓణీని సచ్చరితమాత ఆచ్చాదనగా
వికటిత మరీచికను ముకుళిత వకుళముగా
అక్కళించు ఆకలి బెక్కుమెక్క భుక్తాయాసముగా
అకులము సకులము సకలము వికలముగా
అకారణము కారణ కారణం అను కారణికుఁడుగా
 
పోకార్చగ ఆ ద్వైతాన్ని అవతరింతువోయ్ ఏకాంగిగా
ఈడేర్చగ అద్వైతాన్ని అనుభవింతువోయ్ సర్వాంగిగా
 
చూడాలంటే ఆ స్వర్గాన్నీ
…వీడాలంటే ఈ నరకాన్నీ
ఇడగడగడం వినై సరసమనీ
…పొడగించినా విదిలించు అహాన్నీ
గుండెతల్లడము చెసేవన్నీ
…ఉండెగదా మనస్సునన్నీ
 
తడకలుకట్టి తృణీకరించకు ఉన్మత్తతనీ
…ఈడేరని లుప్తాత్ముని అచింతిత చింతననీ
ఉండెగదా మనస్సునన్నీ
…ఉండుగదా మనస్సునన్నీ!!!

.

bhamidipati nagaraja rao.JPG

భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు

దీపపు దివ్యవ్యక్తిత్వం

 

కొడిగడుతోంది దీపం

శూన్యపుఒడి చేరుతోంది,పాపం.

వేకువతో సమానంగా వెలుగులనుపంచాలనే

ప్రయత్నంలోనే ప్రతిక్షణం జీవించి,

చీకటితెరలను తన శాయశక్తులా తెంచివేయాలనే

తాపత్రయాన్ని శ్వాసించిన ఈదీపం,

పాపం,తన చివరిక్షణాలను ఎదుర్కొంటోంది.

చీకటితెరలు తనని కప్పేస్తున్నా,

వెలుగురేఖలు తనని వీడి వెళిపోతున్నా,

ధైన్యం లేకుండానే వెలుగుతోంది,

నిర్వికారంగానే మలుగుతోంది.

తన ఆఖరిశ్వాసను కూడా వెలుగును పంచుతూనే వదులుతోంది.

తనను వెలిగించిన వారికి కృతజ్ఞతను అలా తెలుపుకుంటోంది.

తను పోతేనేం? మరోదీపం వెలిగించబడుతుందనితెలుసు,

తను లేకపోతేనేం?మరోదీపం వెలుగును పంచుతుందని తెలుసు.

కర్తవ్యాన్ని నెరవేర్చగలిగానన్నఆనందమే

ఆదీపపు మోములో వ్యక్తమౌతోంది.

కోడిగడుతున్నానన్న ఆవేదన కన్నా

కర్తవ్యనిర్వహణలో మలుగుతున్నాననే ఆనందంతో

దీపపుమనసు సంతృప్తమౌతోంది.

ముకుంద రామారావు

mukunda ramarao.JPG

నువ్వు లేక ..

నువ్వు లేని ఇంటిలోకి

అనేక జ్ఞాపకాలతో ప్రవేశిస్తున్నపుడు

ఆ ఇంటిముందరి చెట్టు

ఎన్నెన్ని జ్ఞాపకాల  ఆకుల్ని విదిల్చిందో

 

చిందరవందరగా పడున్న వాటిలో

ఎగరుకుంటూ వచ్చిన

పట్టించుకోని పక్షి ఈకల్లా

నేనూ మీ ఇంటిలోకి చేరాను

 

ఏమిచేయాలో తెలియక

మళ్లీ గాలిలోకి ఎగురుకుంటూ పోయిన

అక్కడి ఈకల్లానే

కాసేపట్లో నేనూ బయట పడ్డాను

యలమర్తి అనూరాధ

yalamarti anuradha.JPG

విన్నపం

 

నిశ్శబ్ద ప్రార్ధన చేస్తున్నట్లు

చెట్లన్నీ మౌనాన్ని పాటిస్తూ

ఘోరాలని  గమనిస్తూనే

జీవిని నిలబెట్టే తమనే నశింపచేస్తూ

ఎవరి మాటలు వినే పరిస్థితిలో లేని మనిషిని

విరక్తిగా  చూస్తూనే

రోలు వెళ్ళి మద్దెలతో మొరపెట్టుకున్నట్టు

సెల్లు  కన్నీరు కారుస్తూ చెంత చేరి

విశ్రాంతి కరువైందని ఏకరువు

నొక్కి నొక్కి ఒళ్లంతా తూట్లు పొడుస్తున్నారని

ప్రాణం పోతున్నా నన్ను మాత్రం వదలరని 

నిట్టూర్పు  వేడి సెగలతో వెక్కిళ్లు పెడుతూ

కళ్ళు నా బాధ నేను ఎవరికి చెప్పుచెప్పుకోనంటూ 

మాట కలిపి మది కబుర్లు ఒలకబోస్తూ

ఒకరి కోసం ఒకరనే  మాటే మరిచిపోయారని

 ప్రతి నిమిషం యంత్రాలతోనే సహవాసం

తప్పని తెలిసినా అదే ఒప్పని

ముందుకురికే  మిత్రులారా

ఈ అలవాట్లకు కాస్త దూరంగా జరగండి

dasaraju ramarao.JPG

దాసరాజు రామారావు

పెంజీకటి కవ్వల...

1. చెట్లమీది పిట్ట గూళ్ళల్ల సంరంభ కలలేవీ పొదిగే ప్రారంభ వేళావిశేషా లెన్నో గతించినయో. వెన్నంటిన భయాలతో, వెంట నడువని తొవ్వలతో, మైలురాళ్ళ పొట్రాయిలు

తలిగి, చిందిన నెత్తుటి కేక వినిపించినా, ఆకాశం అరచేతి నందించదు. కొన్ని మధురాంబువులు,

కొన్ని మధురాతి మధుర భాషణలు, కొన్ని మృదు మాధుర్యాల ఊహలు లేకుండానే , నావి కాకుండానే వేన వేల నాగరికాల కాలాల దాష్టీకాల తొట్రువడితిని, కుట్రవడితిని. అనేకానేక పుటల నిక్షిప్తపు హృదయవిదారకాల అస్పృశ్య,అనూహ్య దృశ్యాల ముందేసుకుని,

కెరటాల పోరాటంతో మొదలై ,నది మీద నడిచి , సుడిగుండాల స్రుక్కిడి, వ్రయ్యలు వ్రయ్యలై,హరిస్తున్న ఆయుష్షుతో సుదూర తీరాన మిణుగురై మెరుస్తున్న రేపటి కొత్త ఆశ నెట్లా మోసుకు రాగలను?

2 . మగాడెవరో ,మొనగాడెవరో ,మృగాడెవరో తెలియని అమూల్య బాల్యపు పెదాల మీద విష ముద్దుల కసిగాట్ల పరంపర లట్లానే.

రాజ్యాల వటవృక్షపు నీడల ఆరుగాలాల చెమట తడి బరువు లెక్కింపబడక పోయినా,పరువు

గుర్తింపబడక పోయినా ఈ నేల గొప్పదౌ గాక గొప్పదౌ. కాటికాపరి లేడు, చంద్రమతు లెందరో. హరిశ్చన్ద్రుడు రాలేడు, విజయ్ మాల్యాల హవా లో. గురుతర గురుత్వాకర్షణ శక్తి లేని సెనెక్స్ కిదేమీ హుక్ అవదు.గంపలలో నింపుకొని,వేప పండ్లను అమ్మడానికి కలిసొచ్చే కాలం కాదిది.

3 . గరగరల్ పచరించిన ఘంటా నాదాల జేవురించిన అరుణ వర్ణం-

మనుజేశ్వరాధమ్ముల రాత పూతల కీడ్చిన ధిక్కార స్వరం-

ప్రపంచ పద్మవ్యూహపు రహస్యాల చేధించిన హరోం హర శబ్దబేధి-

అక్షరాల తోవలున్నయి,మార్గదర్శ గమనాలున్నయి. లోయ అయినా శిఖర మయినా పల్లవందుకొని సాగే పాట నిన్ను వెతుకుతున్నది.

4 .  ఇచ్చోటనే నేనిక గగనాంతరంగుడనై, ధరిత్రీ ముఖుండనై, ప్రాకృతిక సంపత్భూషణుండనై ,లక్ష్య దీక్షా దక్షు ౦డనై-

అనంతమైన, ప్రియమైన

గెలుపు నయి...

వెలుగు నయి...

bottom of page