top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

సంపుటి  4   సంచిక  4

adannamaata.png

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

'అలనాటి' మధురాలు

సేకరణ: వంగూరి చిట్టెన్ రాజు |  శ్రీనివాస్ పెండ్యాల

sahityam@madhuravani.com 

శ్రీకాంత శర్మ గారి

ఒక చిన్న కవిత, మరో పాట.

రచయిత: ఇంద్రగంటి శ్రీకాంతశర్మ

కవిత

వేకువ లాంటిది జ్ఞాపకం 

తొలి సూర్య కిరణం విసిరి 

మేలుకొలుపు పాడుతుంది  -

 

శ్రావణ మేఘం లాంటిది జ్ఞాపకం 

ఒక్క మెరుపుదెబ్బ కొట్టి 

ఇంత  కన్నీరు కుండపోత పెట్టి 

వాసనలు మాత్రం మిగిల్చి చక్కాపోతుంది - 

 

తొడిమలాంటిది జ్ఞాపకం 

ఎప్పుడో రాలిన పువ్వుకి సంకేతం.. 

అగరువత్తికొస ఎరుపులాంటిది జ్ఞాపకం 

చురుక్కున తగిలి పరిమళిస్తుంది .. 

 

మనస్సు తోటలో హరిచందనం జ్ఞాపకం 

మహదాశీర్వచనం జ్ఞాపకం -

పాట

ఇంత  వింత వెలుగంతా 

సుంత నాకు మిగిలేనా

నీలి నిదుర రెక్కలపై 

నింగికి నే నెగిరేనా  !

 

ఇదిగో ఈ కుటీ రాన 

ఇరులు మూగకున్న చాలు 

గూటిలోని గువ్వలాగా 

కొత్త దివ్వె కాంతి చాలు 

 

పెంచుకున్న కలల తోట 

పిడుగున పడకున్న చాలు 

చేదు తలుపులన్నీ - చిట 

చిటల చెదిరి పడిన చాలు 

 

అంతరంగ మందున - కా 

సంతా శాంతి ఉన్న చాలు 

నాకమ్మేమైనా - నా 

లోకం నాకున్న చాలు

వెన్నెలలోని వికాసమే

వంగూరి - ఆంధ్రప్రభ పోటీ విజేత

రచయిత: కె.బి.లక్ష్మి

alanati-oct19_pg1.png
alanati-oct19_pg2.png
alanati-oct19_pg3.png
alanati-oct19_pg4.png
bottom of page