
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
దసరా దీపావళి ఉత్తమ
రచనల పోటీ!
madhuravani.com ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దసరా, దీపావళి తొలి ఉత్తమ రచనల పోటీలో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రచయితలందరికీ సాదర ఆహ్వానం!
దసరా దీపావళి ఉత్తమ రచనల పోటీ!
MADHURAVANI TELUGU MAGAZINE మధురవాణి
మా వాణి ...
ఒక మంచి పుస్తకం గొప్పదనం అందులో ఉండే విషయం మీద ఆధారపడి ఉండదు... అది మనకు అందించే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది" అన్నారు గాంధీజీ. Madhuravani.com పత్రిక పలు రకాల అంశాలతో ఓ మంచి పంచరంగుల పుస్తకంగా ఆ ఆలోచన కలిగిస్తుంది అని మాకు వస్తున్న ఉత్తరాల పరంపర ద్వారా తెలిసి కించిత్ గర్వంగానే ఉంది.

మధురవాణి నిర్వాహక బృందం
నా డైరీల్లో కొన్ని పేజీలు... ఓడలు బళ్ళు అయిన వేళ
గొల్లపూడి మారుతీ రావు
1970 జనవరి 16: 'చెల్లెలి కాపురం' ఆఫీసులో డి. ఎస్. ప్రకాశరావునీ, జయరాంనీ తిట్టిన సందర్భం. జర్దా కిళ్ళీ.
ఇది 46 సంవత్సరాల కింద మాట. ఏ విధంగా చూసినా ఈ వాక్యాలు డైరీలో రాసుకోవలసినంత ప్రత్యేకమయినవీ కావు, ముఖ్యమైనవీ కావు. ఎందుకు రాశాను? నా జీవితం లో అతి ముఖ్యమయిన మలుపుల్లో ఈ రెండు వాక్యాల ప్రమేయం ఉంది, ఆశ్చర్యం.
'చెల్లెలి కాపురం' సినీ నటులు బాలయ్యగారి మొదటి చిత్రం. ఆ చిత్రానికి దర్శకులు కె.విశ్వనాథ్. ఆయనతో నేను కలిసి పనిచేసిన రెండో చిత్రం. ఆయన మొదటి చిత్రం నాకు రెండో చిత్రం. దాని పేరు "ఆత్మ గౌరవం'...
మెడమీద వాటా అద్దెకివ్వబడును
కొండేపూడి నిర్మల
సుభద్రకివాళ మనసు మనసులో లేదు.
వొంటిమీద నగలన్నీ వొలిచి గంపలో వేసింది. రివ్వుమంటూ వళ్లంతా చల్లటి ఏ.సి గాలి తగిలింది. నగలు తీసేస్తే ఇంత గాలి తగులుతుందా? అని ఆశ్చర్య పోలేదు. అసలా సుఖాన్ని గుర్తించే పరిస్థితిలోనే ఆమె లేదు. ఎడమ కాలితో కార్పెట్ మీద ఒక తాపు తన్నింది. గంప తుళ్ళి రాక్షసుడి నాలుక బద్ద లాంటి వడ్డాణం కిందపడింది. వెంటనే కళ్ళకద్దుకుని దాన్ని తీసి గంపలో వెయ్యలేదు. వొలికిన పళ్లరసంలో తడిసిపోయిన వారపత్రికలోకి క్రూరంగా చూస్తూ...
అమెరికా వారోత్సవాల కథ
వంగూరి పి.పా. లో....
మొన్న ఆదివారం మా వారోత్సవంలో భలే చికాకు వేసింది. అదేమిటో కానీ, ప్రతీ వారం ఇలా ఏదో ఒక చిన్న చికాకు వస్తూనే ఉంటుంది, అయినా మా ఇంట్లో వారోత్సవాలు ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉన్నాయి. వారోత్సవం అంటే ప్రతీ వారం అడ్డమైన గడ్డీ, నానా చెత్తా కొనేసుకుని డబ్బులు తగలేసేసి ఆ తరవాత భోరుమనే మా షాపింగ్ సంబరాలు అన్నమాట. ఈ ఉత్సవ తతంగం ప్రతీ శనివారం పొద్దున్నే మొదలవుతుంది. వారాంతంలో కూడా ఏదో పెద్ద పని ఉన్నట్టు నా కంటే ఎప్పుడూ ముందే నిద్ర లేచి, రక రకాల చప్పుళ్ళు, కూతలు, సద్దుళ్ళు, కొండొకచో అరుపులతో ...
నిర్భావం సద్భవతి! అవునంటారా?
-దీప్తి పెండ్యాల

మానవ జన్మ సార్ధకత మోక్ష పురుషార్ధములోనే ఉన్నది. వేదాంత పరంగా చూస్తే “అహమస్మి” అనే అనుభవపూర్వకమైన జ్ఞానమే మోక్షం. ఈ గమ్యం చేరుకోడానికి సాధన మార్గములేవి? అని చూస్తే కర్మ యోగం, జ్ఞాన యోగం, సమాధి యోగం మరియు భక్తి యోగములని మనం విన్నాము. ఇక్కడ భక్తి అంటే సగుణ ఈశ్వర భక్తి అని అర్ధము. అన్ని నదులు సముద్రములో చేరినట్లు ...
భక్తి మార్గము – జ్ఞాన మార్గము -సుధేష్ పిల్లుట్ల
