కవితా వాణి
నిర్వహణ: చిలుకూరి సత్యదేవ్ | మధు పెమ్మరాజు
పుస్తకాన్ని ఎలా చూడాలన్నదే ప్రశ్న
ఇప్పుడెలా అమ్ముకోవాలన్నదే ప్రశ్న -
కధల్ని కవిత్వాలని గుండెకెక్కించు కుంటావు
వేళ్ళతో తెల్ల కాగితాల మీద ముద్రించుకుంటావు
అది మాయకుండా ముట్టుకోకుండానే అటకెక్కి పోతుంది
ఇక్కట్లకి అర్జీలు పెట్టినట్టే
అస్తవ్యస్తాలపై ఫిర్యాదులు చేసినట్టే
అర్దమవనీ ప్రపంచ తీరుతెన్నులపై
పరమాత్ముని కోసమో ప్రశ్నావళి
*
లోకాన వింత పోకడలెందుకు?
నానీలు
~కొమ్ముల వెంకట సూర్యనారాయణ
మధుర వాణి
సాహితీవనంలో
విరబూసిన
అక్షరతరంగిణి
ఏదో ఒక
దైనిక ఘటన
ఆలంబనగా
మనసులో ఒక మూల
దైర్య వచనాల కింద
వానదేవుడా!
~వి. చెన్నయ్య (“దోరవేటి”)
తేII దివినిగల యమృతమునంత తివిరి, తివిరి
దేహభాండమ్మునను నింపితెచ్చి మనకు
ప్రేమమీర నిచ్చెడి మేఘ భామలదియె
ప్రాణులను పావనమొనర్చు వర్షధార!
ఈ శీర్షికలో ఆసక్తికరమైన కవితలు తగిన సంఖ్యలో ప్రచురిస్తాం. ఈ శీర్షికలో ప్రచురణార్థం ఆధునిక వచన కవిత, ఛందోబద్దమైన పద్య కవితలు, ఇతర కవితా ప్రక్రియలలో “అముద్రిత” స్వీయ రచనలని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కేవలం యూనికోడ్ (గూగుల్, లేఖిని మొదలైన వెబ్ సైట్ లలో, గౌతమి మొదలైన ఫాంట్స్) లో ఉన్న రచనలు మాత్రమే పరిశీలించబడతాయి. PDF, స్కాన్ చేసిన వ్రాత ప్రతులు, తదితర పద్ధతులలో వచ్చిన రచనలు పరిశీలించబడవు. మీ రచన మీద సర్వహక్కులూ మీవే. కానీ దయ ఉంచి ఇంకెక్కడైనా పరిశీలనలో ఉన్న కవితలు, ఇది వరలో ప్రచురించబడిన రచనలు మరో రూపంలోనూ పంపించకండి. మీ రచన అందిన సుమారు నెల రోజులలో ఎంపిక వివరాలు తెలియపరుస్తాం.
ఈ శీర్షికలో పరిశీలనకి కవితలుపంపించ వలసిన ఇమెయిల్