
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
కథా మధురాలు
నిర్వహణ: మధు పెమ్మరాజు | దీప్తి పెండ్యాల
రిటైర్డ్ హస్బెండ్
శ్యామలాదేవి దశిక
ఏమిటీ… ఇవ్వాళ లంచ్ కి ఏం చేస్తున్నావు అంటారా?
ఏదో ఒకటి చేస్తాలేండి… బ్రేక్ ఫాస్ట్ చేసి గంటన్నా కాలేదు, అప్పుడే లంచ్ ఏంటీ అంటూ ప్రశ్నలు.
మీరు రిటైర్ అయిన తర్వాత నాకు పనీ...మీకు హడావిడి ఎక్కువైంది. అస్తమానం కాలుగాలిన పిల్లిలా పైకీ కిందకీ తిరగడం..... లేదంటే నా చుట్టూ తిరగడం.
సాయంకాలం వంటేమిటీ… పప్పుపులుసు లోకి కారం అప్పడాలా… మెడ్రాస్ అప్పడాలా?
వలస తెచ్చిన మార్పు
శ్రీనివాస భరద్వాజ కిశోర్ ( కిభశ్రీ)
అట్లాంటా విమానాశ్రయం ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ దాటుకుని నుంచి తమ లగేజ్ ట్రాలీ తోసుకుంటూ బైటికి వచ్చారు ఉజ్వల, నాగేంద్ర. ముప్ఫై ఏళ్ళక్రితం చూసిన ఎయిర్పోర్టే అయినా కొత్తగా వచ్చిన అంతర్జాతీయ టర్మినల్ సొబగులను చూస్తూ ఆదమరచి వున్న ఉజ్వల, నాగేంద్ర ఎటు వెడుతున్నాడో అర్థంకాకపోయినా, ఎక్కడికి వెళ్ళాలో ముందుగానే తెలుసన్నట్లు నడుస్తున్న అతనివెంట నడువసాగింది.
“ఆర్ యూ అనూష్క?” దాదాపు పాతిక సంవత్సరాల వయసు, చామనచాయలో వున్నా చక్కని....
గారడీ
జయంతి ప్రకాశ శర్మ
మస్తాన్ వలీ అంటే ఆ ఊరులో ఎవరికీ తెలియదు, మస్తాను అంటే కూడా ఎవరికీ తెలియదేమో గాని గారడీగాడు అంటే మాత్రం ఆ ఊర్లో అందరికీ తెలుస్తుంది. ఆ ఊరి తురకల కోనేరుని ఆనుకుని ఓ పెద్దరావిచెట్టు, ఆ పక్కనే మట్టితో మూడు వైపులా నాలుగడుగుల ఎత్తున్న గోడలు, నాలుగో వైపు తలుపులుగా వాడుకునే కర్రల తడిక పైన నాలుగు తాటికమ్మలు, వాటిని కప్పుతూ, చిల్లులతో జీర్ణావస్థలో ఉన్న టార్పలిన్ మస్తాను ఇల్లు...
భలే మంచి చౌక బేరము
నిర్మలాదిత్య (భాస్కర్ పులికల్)
పాటామాక్ నది దాని ఇరువైపులా అందంగా లాండ్స్కేప్ చేసిన ఒడ్డు, నది పైన వాషింగ్టన్ అందాలు విహార యాత్రికులకు చూపెడుతూ వయ్యారంగా తిరుగుతున్న పడవలు. ఓ క్లాసిక్ పెయింటింగ్ లాగ కనిపిస్తున్నది.
సాయంత్రం కావడంతో ఆకాశం, క్షణక్షణం మారుతున్న కెంజాయ రంగులతో, కదులుతున్న మబ్బులతో ఎదురుగా 19 అంతస్తుల ఏట్రియం లో ఓ వనంలా కట్టిన రెస్టారెంట్ లో కూర్చుని ఏమి త్రాగాలి ఏమి తినాలి అని సతమతమౌతున్న వారి దృష్టి ఆకర్షించడానికి తెగ పాట్లు పడుతున్నది.
ఆనాటి వాన చినుకులు
గీతిక.బి
తుప్పెక్కిన పాత ఇనప సామాను గుట్టలలో నుంచి పనికొచ్చే వస్తువుల్ని వేరు చేయిస్తున్నాను. రేకులూ, పాత సైకిళ్ళూ, విరిగిన రిక్షాలూ, ఇనప కుర్చీలూ,.. ఎక్కువే ఉన్నాయి.
నెల రోజులుగా మా అమ్మాయి పెళ్ళి పనుల్లో మునిగి, కొట్టుని బాగా అశ్రద్ధ చేసేశాను. రీసైక్లింగ్ లోడు అమ్మకపోవడం వల్ల మెటీరియల్ బాగా పేరుకుపోయి, మొన్న కురిసిన వానకి తడిసి తుప్పు వాసన ఘాటుగా వస్తోంది.
కుర్రాళ్ళు సామానుని వేగంగా లాగి పక్కకు పడేస్తుండడంతో చెవులు చిల్లులు పడేంతగా డబడబల ...