వ్యాస మధురాలు
కథలు ఎందుకు చదవాలి?
మెడికో శ్యాం
ఈ శీర్షికని రెండు రకాలుగా అర్ధం చేసుకోవచ్చు.
ఒకటి : కథలు ఎవరైనా ఎందుకు చదవాలి?
రెండు: ప్రత్య్రేకించి కథకులు ఎందుకు చదవాలి??
అసలు ఏ పనైనా ఎందుకు చేయాలి? ఉధాహరణకి భోంచెయ్యడం, తిండి తినడం. తినడంకోసం బతుకుతామా? బతకడం కోసం తింటామా? అంటే అందరూ బతకడం కోసం తింటామనే చెబుతారు. నిజానికి తినడం కోసం బతుకుతున్నవాళ్లే ...
సి. పి. బ్రౌన్- పూర్వాపరాలు
తమ్మినేని యదుకుల భూషణ్
వచనం మీద ఎవరికీ శ్రద్ధ లేదు. కాస్తో కూస్తో రాయడం వచ్చిన ప్రతి ఒక్కరూ కవి అనిపించుకోవడానికి ఉబలాటపడతారు. కాబట్టి, గత నలభై ఏళ్లుగా గమనిస్తే, వచనం అన్నది నశించి పోతోంది. చక్కని వచనం బాగా రాసేవారు చాలా తక్కువ మంది. పండితులు అనుకునే వారి వచనం చూస్తే అందులో ఏమీ కండ ఉండదు. అంటే బుద్ధికి పని పెట్టగల -తర్క ప్రజ్ఞ, భావావేశం రెండూ కలగలసిన- వచన శైలి రోజు రోజుకు దిగనాసిల్లి పోతోంది కాబట్టి, పాండిత్యం అనగానే వచనం రాయగల ప్రజ్ఞ. అలాంటి ప్రజ్ఞ గల వాడే పండితుడు....
వలస వేదన - నా కవిత్వం
ముకుంద రామారావు
కవిత్వంలో జీవితమూ ఉంది, జీవితంలో కవిత్వమూ ఉంది. నా వరకూ నాకు, రెండూ విడదీయలేనివి. వలస కూడా నాకు అటువంటిదే. నా కవిత్వంలోనే కాదు, బహుశా నా రక్తంలోనే, వలస ఉంది. నా పూర్వీకులు భూమిని నమ్ముకున్న వారు. అది ఏ భూమి, ఎక్కడి భూమి అన్న దానితో సంబంధమే లేదు. ఎక్కడైనా వారికి అదే ఆకాశం, అదే భూమి, అదే గాలి, అదే నీరు. లేదంటే వాళ్లు, చదువు లేకుండా, మరో భాష రాకుండా, ఏ ప్రాంతమో చూడకుండా, ఎలాంటివారో తెలియకుండా, దేశాల్ని సముద్రాల్ని దాటిపోగలిగే సాహసం ఎలా చేయగలిగారు. కేవలం బతుకుతెరువు...
కాదేదీ కథలకనర్హం
సత్యం మందపాటి
ఎక్కడయినా, ఎప్పుడయినా మన సాహితీ మిత్రులని కలిసినప్పుడు, కొంతమంది అడిగే ప్రశ్న, “కథలు వ్రాయటం ఎలా?” అని.
వీరిలో కథలు వ్రాద్దామనే కుతూహలం వున్నవారు కొందరయితే, రచయితల ఆలోచననా స్రవంతి ఎలా కథారూపం దాల్చుతుందో తెలుసుకోవాలనుకునేవాళ్ళు కొంతమంది.
ఇక్కడ మిగతా రచయితల తరఫున వకాల్తా తీసుకుని చెప్పే స్థోమతా, అర్హతా నాకు లేవు కనుక, నా స్వంత అభిప్రాయాలు ఎలా వున్నాయో, నేను అభిమానించే రచయితల రచనల ద్వారానూ, వారి మాటల
అల్లసాని అల్లికలు-జగదీశుని మల్లికలు
పుదూరు షణ్ముగం జగదీశ్వరన్
“కవి అంటే అల్లసాని పెద్దనయట. కవి అంటే తిక్కన అంట. నేను కూడ కవినే. నీరు కాకికి కూడ కవి యనే పేరుంది కదా” అని అంటాడు తెనాలి. “క” అంటే నీళ్ళు. “వి” అంటే పక్షి. కనుక కవి అంటే నీటి పక్షి లేక నీరు కాకి అని అర్థము.
మరి కవి సమ్మేళనం అంటే నీరు కాకుల కూటమి అనే అర్థం.
ఈ నాటి నా శీర్షిక "అల్లసాని అల్లికలు - జగదీశుని మల్లికలు". నా కిచ్చిన వ్యవధి ఇరువది నిముషములు. అంటే అల్లసాని అల్లికల పైన పది నిముషములు మరి నా పద్యములపై పది నిముషములన్న మాట. అల్లసాని...
కవిత్వంలో ప్రయోగాలు
విన్నకోట రవిశంకర్
నా మొదటి కవితా సంకలనం “కుండీలో మర్రిచెట్టు” వచ్చిన కొత్తలో, ఒక ప్రముఖ కథకునికి ఆ పుస్తకం కాపీ ఇచ్చినప్పుడు, ఆయన వచన కవులు ఉచితంగా ఇచ్చిన పుస్తకాలకి తన ఇంట్లో సముచిత వినియోగం ఎలాఉంటుందో సోదాహరణంగా వివరించారు. కొన్ని గిన్నెల మీద మూతలుగా, కొన్ని టేబుల్ కోళ్ళ కింద సపోర్టుగా .. ఇలా. అదృష్టవశాత్తు నా పుస్తకానికి అటువంటి సత్కారం జరగలేదు గాని, పుస్తకం చదివాక మెచ్చుకొంటూ ఆయన ఒక మాట అన్నారు. “కవిత్వం ఇలా కూడా రాయవచ్చా అనిపించింది ఈ కవితలు....
బ్రౌన్ : తెలుగు తల్లి ఫ్రౌన్: నిజం డౌన్ (మూడవ భాగము)
డా. నెల్లుట్ల నవీన చంద్ర
తెలుగు సాహిత్యపు భిన్న పోకడల గూర్చి రాస్తూ ఇతిహసాలూ, ప్రబంధాలూ, ద్విపదలూ, కావ్యాలూ, కీర్తనలూ, జానపద గీతాలూ, మీడియా సాహిత్యమూ, శతకాలూ, చాటుపద్యాలూ , నవలలూ, కథానికలూ, వ్యాసాలూ, విమర్శలూ, ముత్యాల సరాలూ, మహాప్రస్థానము లాంటి గీతాలూ, శివతాండవమూ మొదలైన భంగిమలను ఉదాహరణలుగా చెప్పడమైనది. త్యాగయ్య గారు 1847 వరకూ రాసిన కవిత్వము వీటిలో ఏ ఒక్క ప్రక్రియకూ తగ్గదని నిరూపించబడినది. శ్యామ శాస్త్రి, చిన్నయ్య సూరి కూడా ఇదే కాలము లో ....