top of page

వ్యాస​ మధురాలు

నిర్వహణ: దీప్తి పెండ్యాల | శ్రీనివాస్ పెండ్యాల

vyasam@madhuravani.com

అప్పిచ్చి 'వాడు వైద్యుడు-13   (సైకియాట్రీలో వింతకథలు)

గిరిజా శంకర్ చింతపల్లి

 నిద్రాభావ, నిద్రాలశ్య జాడ్యం - Narcolepsy కి నాపైత్యం

ప్రతీ మనిషి కి నిద్ర చాలా అవసరమని వేరే చెప్పక్కరలేదు కదా. ఒక రాత్రి నిద్ర లేకపోతే మనం పడే కష్టాలు ఎన్నో. మర్నాడు అలసట, ఆవలింతలూ, మతిమరుపూ, ఆలోచనలు తట్టకపోవడం ఇలాగాఎన్నో. jet lag లో గూడా ఈ లక్షణాలు కనిపిస్తాయి. అప్పుడప్పుడు రాత్రి సరిగా నిద్ర పోకపోతేనే ఇన్ని కష్టాలొస్తే, ఇక రోజువారీగా నిద్ర క్వాలిటీ పడిపోతే వచ్చే కష్టాలే ఈ వ్యాధి లక్షణాలు.

 

ఈ జబ్బులో 4 లక్షణాలుంటాయి ముఖ్యంగా మొదటిది - రాత్రి నిద్రాభంగం.

 

మామూలుగా మనకి రాత్రి పూట 4 దశల నిద్రావస్థలుంటాయి. నిద్రలోకి జారుకోవడం, గాఢ నిద్ర, కొంచెం తెరిపిగా నిద్ర, స్వప్న జగత్.

పోతన - శ్రీనాథుల జీవిత ప్రస్థానం

డా. శివుని రాజేశ్వరి

నా నృషిః కురుతే కావ్యం అంటే బుషి కాని వాడు కావ్యాన్ని రచింపలేడు.

 

ఋషులు, ద్రష్టలు, స్రష్టలు వారు సత్యాన్ని ఆత్మ జ్ఞానంతో దర్శించి వాఙ్మయ రూపంలో సృష్టించారు. భారతీయ వేద విజ్ఞానం అంతా ఆవిధంగా వెలువడింది. వేదాలు, వేదాంగాలు ఉపనిషత్తులు, శృతులు, స్మృతులు అందులో భాగం. ఇది ప్రభుసమ్మితమైన వాఙ్మయం. మంత్ర రూపంలోను సూత్రీకరించబడింది. పురాణ ఇతిహాసాలు వీని ఆధారంగా ‘మిత్రసమ్మితంగా’ వెలువడినాయి. వ్యాస వాల్మీకాది మహర్షులు, శంకరాచార్యులవంటి గురువులు, కాళిదాసాది కవులు ప్రభుతసమ్మితమైన వాఙ్మయాన్ని మిత్రసమ్మితమైన సాహిత్య గ్రంథాల రూపంలో మానవాళికి అందించారు.

ఆ తరువాత దశలో సామాన్య జనులకు అర్థమయ్యే విధంగా సద్గ్రంథాలనుండి ఎన్నో గ్రంథాలను కవులు, పండితులు రచించారు. క్రమక్రమంగా పురాణేతిహాసాలనుండి మూలాన్ని తీసుకొని కల్పనలు జోడించి, కావ్యాలు, ప్రబంధాలు రచించే కవుల సంఖ్య పెరిగింది. ఈ దశలో...

పంచతంత్రం  అనే ప్రాచీన జ్ఞాన మంత్రం

  - ముప్పాళ్ల  అప్పారావు 

ప్రాచీన కాలంలో భారతదేశం కథలకు, కళలకు కాణాచి. ఆ కాలపు నీతి కథల్లో పంచతంత్రం అతి ముఖ్యమైనది. పంచతంత్రం వంటి కథల సమాహారాన్ని’కథా  కావ్యము’లని పిలుస్తారు. పంచతంత్రం మూలగ్రంథం ఏదో ఎవరికీ లభించలేదు.

ఈ కథ  ప్రాచీనతపై ఎన్నో కథనాలున్నాయి. అందులో ప్రముఖంగా వినిపించేది విష్ణుశర్మ గాథ. ముఖ్యంగా అతని జీవించిన కాలంపై భిన్న స్వరాలు వినిపిస్తాయి. ఎక్కువ మంది  క్రీ.పూ. ౩వ శతాబ్ది అంటారు.

ఒక కథనం ప్రకారం ‘మహిలారోప్య’ అనే దేశపు రాజు అమరశక్తికి ముగ్గురు(కొన్ని చోట్ల ఐదుగురు)  మంద బుద్ధులైన పిల్లలు ఉన్నారు. అయన తన రాజ్యంలో  మంచి గురువు కోసం వాకబు చేసి విష్ణుశర్మ మాత్రమే వారిని సరి అయిన మార్గం లో పెట్టగలడని భావించి వారిని అతని వద్దకు పంపుతాడు.

bottom of page