
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
జనవరి-మార్చి 2023 సంచిక
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
వ్యాస మధురాలు
వ్యాకరణ శాస్త్ర౦ – ఆవశ్యకత
డా. పి.వి.లక్ష్మణరావు
భాష లక్ష్యం అయితే వ్యాకరణం లక్షణం. లక్షణమెప్పుడూ లక్ష్యాన్ని అనుసరిస్తుంది. లక్ష్యం లేనిదే లక్షణానికి అవకాశమే లేదు. కాలం మారుతోంది. అవసరాలు మారుతున్నాయి. వ్యాకరణమైనా, భాషా సాహిత్యాలైనా స్థలకాలాలకు అతీతమైన అమూర్త విషయాలు కావు. కాబట్టి ఈ రోజున వ్యాకరణ ప్రాభవం క్షీణించి భాషాశాస్త్ర వెలుగులో నూతనమార్గాలు అన్వేషిస్తున్న వర్తమానం ఇది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో ప్రయోజనాలు కలిగిన వ్యాకరణ శాస్త్ర ఆవశ్యకతని తెయజేయడమే ప్రస్తుతాంశం.
వ్యాకరణ శాస్త్ర ఆవిర్భావం ఎలా జరిగిందో పరిశీలించడం వల్ల ఎంతో ఉపయోగం ఉంది. పవిత్ర మైనవీ, దివ్యమైనవీ అయిన వేద మంత్రాల పఠనంలోనూ, వాటి ఉచ్చారణలోనూ, యజ్ఞాల నిర్వహణలోనూ తప్పు జరిగితే ప్రమాదం. అది ఉచ్చరించిన వారి మీదే ప్రతికూలంగా పనిచేసే అవకాశం ఉందని భయం ఉండేది. ఆ అవసరం నుంచి ఆరు వేదాంగాలు రూపొందాయి....
కధలు ఎందుకు రాస్తారు?
మెడికో శ్యాం
కధలు ఎందుకు రాస్తారు? నేనెందుకు రాసేను? ఎందుకు రాయటం లేదు?
ప్రశ్నలేమయినా సమాధానం ఒకటే.
"ఒరేయ్ ఒరేయ్ కవీ
నాదొక చిన్న మనవి
నువ్వెందుకు రాస్తున్నవ్?
నూకలివ్వక పోయినా భావాల
మేకలెందుకు కాస్తున్నవ్?"
అన్నాడు ఒకాయన.
నిజమే మనలో చాలామంది నూకలివ్వకపోయినా మేకలు కాసేరు. రూకలివ్వకపోయినా కధలు రాసేరు.
ఇవాళంటే బ్లాగులూ, ఫేస్బుక్కులూ,వాట్సప్పులూ వచ్చి సులభంగా చవగ్గా అచ్చేస్తున్నారు (పబ్లిష్ చేస్తున్నారు) కానీ మేమంతా ఒకప్పుడు ...
వాషింగ్టన్ తెలుగు సాహితీ సదస్సు-ప్రసంగ వ్యాసాలు
మధురవాణి.కాం సంపాదకవర్గ బృందంలో ఒకరైన వంగూరి గారు తమ వంగూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాషింగ్టన్ లో నిర్వహించిన "సాహితీ సదస్సు" లో వక్తల వ్యాసాలు ఒకేచోట పొందుపరుస్తున్నాము.మిగతా వక్తల ప్రసంగాలు రానున్న ఉగాది సంచికలో (ఏప్రిల్-1 ) చదువగలరు.
భారతీయులు కాని వారితో మన బాంధవ్యాలు
ఎస్. నారాయణస్వామి
అమెరికాకి కొద్ది రోజుల పాటు చుట్టపు చూపుగా వచ్చి పోయేవారికీ, కొన్నేళ్ళు నివాసం ఉన్న వారికీ, ఇక్కడే స్థిరనివారం ఏర్పరుచుకున్న వారికీ - ఈ మూడు వర్గాల భారతీయులకీ - ఈ సమాజాన్ని చూసే దృక్కోణంలో, ఈ సమాజంతో మెలిగే పద్ధతిలో కొన్ని మౌలికమైన భేదాలు ఉన్నాయి. ఇక్కడే నివాసం ఏర్పరుచుకున్న భారతీయులకి, అందునా తెలుగు వారికి, వాళ్ళవి మాత్రమే అయిన అనుభవాలు ప్రత్యేకంగా ఉన్నాయి. ఆ అనుభవాల కథలని వాళ్ళే చెప్పుకోవాలి, రాసుకోవాలి అని ఒక కచ్చితమైన అభిప్రాయంతో కలం పట్టిన వాణ్ణి నేను. అంచేత నేను రాసుకునే ...
రచనలలో వైజ్ఞానిక దృష్టి అవసరం
ఇన్నయ్య నరిశెట్టి
“చంద్రుడు గుండ్రంగా ఎందుకు కనిపిస్తాడు” అని పిల్లలు అడిగితే తల్లిదండ్రులు ఏం చెపుతారు.
“అమ్మా నేనెట్లా పుట్టాను?” అని అడిగితే తల్లి ఏం చెబుతుంది?
పిల్లలు అనేక సందర్భాలలో అమాయకంగా తల్లిదండ్రులను అడుగుతూ పోతారు. వాటికి సమాధానం చెప్పలేనప్పుడు, నోరుమూసుకో అని గానీ, దేవుడిచ్చాడు అని గానీ, బుకాయిస్తే అది సమాధానం చెప్పినట్లు కాదు. తెలియనప్పుడు తెలుసుకుని చెపుతాను అంటే పోయేదేమీ లేదు. అది సరైన ధోరణి కూడా. అబద్ధాలు, అసత్యాలు కలిపి చెప్పి పిల్లలకు వక్రీకరించే ధోరణి చేయకూడదు. కానీ, చాలామంది తల్లిదండ్రులు ఈ తప్పులే చేస్తుంటారు. వారు చెప్పే విషయాలు పిల్లలకు గాఢంగా నాటుకుపోతాయి. అలాగే తల్లిదండ్రుల మాటలు...
సైబర్ తెలుగు
సత్యం మందపాటి
ద్రావిడ భాష అయిన తెలుగు భాషా పరిణామం చూస్తే, ఎన్నో రకాల అందాలను ఆపాదించుకుంటూ రెండు వేల సంవత్సరాలకు పైగా ఎలా రూపాంతరం చెందిందో అర్థమవుతుంది.
క్రీస్తు పూర్వమే తెలుగులో ప్రప్రధమ కవియిత్రి రంగాజమ్మ సాహిత్యంలో తెలుగు పదాలను వాడిన దగ్గరనించీ, ఇప్పటి దాకా పరిశీలనగా చూస్తే ఒక పుస్తకం వ్రాయాలి. కనుక మనం ఇప్పుడా పని చేయటం లేదు. ఈ రోజుల్లో విడిపోదామనే తెగులుతో కొట్టుకుచచ్చే మన తెలుగు వాళ్ళని కలుపుతున్న ఒకే ఒకటి తెలుగు భాష కనుక, ఇప్పుడు ఆ తెలుగు భాష ఎలా వుందో చూద్దాం. అదికూడా మళ్ళీ ఆంధ్రా తెలుగు, తెలంగాణా తెలుగు, రాయలసీమ తెలుగు...
తెలుగు కథలు, స.ప.స.లు
తాడికొండ కె. శివకుమార శర్మ
తెలుగులో మంచికథలు రావట్లేదని ఈమధ్య తరచుగా వింటున్నాం, చదువుతున్నాం. అయితే, ఈ “మంచి” అన్న విశేషణం గూర్చి పెద్దగా చర్చ జరగలేదు. పైగా, “మంచికథలు రావట్లేదు” అని మొదలయ్యే వ్యాసాలు రెండో వాక్యంలోనే చెహోవ్ ఇలా అన్నాడనో, లేదా గాబ్రియేల్ గార్సియా మార్క్వెజ్ అలా అన్నాడనో తరచుగా చూస్తుంటాం కూడా. ఈ వ్యాసకర్తలకు సాటి తెలుగువాళ్లు గానీ లేక భారతీయులు గానీ మంచికథ గూర్చి ఏమన్నారో తెలియదో లేక తెలుసుకోవాలని అనిపించదో అర్థంకాని విషయం. అయితే, తెలుగులో మూసకథలు కొల్లలుగా వస్తున్నాయనేది మాత్రం పత్రికలే ఒప్పుకునే విషయం. ఆ మధ్య ఆంధ్రభూమి కథలపోటీని నిర్వహిస్తూ, “మాకు మూసకథలు వద్దు!”...
కవిత్వం కొన్ని ఆలోచనలు
డా. వైదేహి శశిధర్
కవిత్వం హృదయసంబంధి.కవిత్వాన్నిఎన్నిరకాలుగా నిర్వచించినా సిద్దాంతీకరించి నా అవి ప్రతిపాదనలు/పరిశీలనలు మాత్రమే కానీ నిరూపిత సత్యాలు కావు. మంచి కవిత్వాన్ని నిర్వచించటం కష్టం కానీ తెలుసుకోవటం కష్టం కాదనే నా అభిప్రాయం. దానికి మేధాసంపత్తి ,భాషాపాండిత్యం అవసరం లేదు.ఒక గాఢమైన అనుభూతికి స్పందించే హృదయం చాలు.
నా ఉద్దేశ్యం లో కవిత్వం ఎప్పుడూ వైయుక్తికమే .వ్యక్తి అనుభవం లో లేనిదేదీ సమాజం లో లేదు.సామాజిక వస్తు ప్రధాన కవిత్వం కూడా వైయుక్తిక కవిత్వం లాగా తన ప్రత్యక్ష లేదా పరోక్ష అనుభవం లోంచి కవి సారించిన దృష్టి .కవితా వస్తువు వైయుక్తికమైనా...
గమనమే గమ్యం: చారిత్రక సందర్భం
గోపరాజు లక్ష్మి
భారత స్వాతంత్రోద్యమం జరిగి ఎంతో కాలం కాలేదు కానీ, దాని గురించి మనకి తెలిసింది తక్కువేమో అనిపిస్తుంది. అమెరికాలో 240 ఏళ్ల క్రితం జరిగిన సివిల్ వార్ గురించి ఇక్కడ ఇప్పటికీ చెప్పుకున్నంత కానీ, సినిమాల్లోనో, టీవీ డాక్యూమెంటరీల్లోనో చూసినంత కానీ, భారత స్వాతంత్రోద్యమం గురించి ఇండియాలో మాట్లాడతారా, విన్నామా అనిపిస్తుంది. దాని గురించి స్కూళ్లలో చెప్పేది చాలా తక్కువ. స్వాతంత్రోద్యమానికి dedicated గా ఉన్న మ్యూజియాలు ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కడా ఉన్నట్లు లేవు; విజయవాడలో 2008లో ఒకటి తెరిచారని విన్నాము కానీ, దాని గురించి ఎక్కువ ప్రచారం ఏమీ జరిగినట్లు లేదు. వైజాగ్ లో ...