Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
అనంతమైన అరూప క్షణాలు
అలా... కాలమాయలో కరిగిపోతూ...
అపుడే మరో సంవత్సరం,మన ముందుకి!
క్షణాలన్నీ కాలంలో కరిగి రోజులు, వారాలు, నెలలుగా మారుతూ... కాలంతో పాటే ఎప్పటికప్పుడు ప్రకృతీ మారుతూ, మనలనీ తదనుగుణంగా మారుస్తూ...
మార్పుకి అతీతమైనదేముందని?
సంవత్సరమూ మారింది. ప్రతీ ఇంటా కేలండర్లని మారుస్తూ.
నూతన ఆంగ్లసంవత్సరాది సందర్భంగా madhuravani.com అంతర్జాల పత్రిక పాఠకులకి, రచయితలకి, విశేషంగా ప్రోత్సహిస్తున్న అందరు సాహితీ బంధువులకీ శుభాకాంక్షలు. ఈ 2018 సంవత్సరం అందరికీ సకల శుభాలనీ, సంతోషాలనీ కలుగజేయాలని ఆశిస్తున్నాము. అలాగే ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు.
ప్రతీ సంచిక వలెనే, ఈ సంక్రాంతి-2018 సంచికలో కూడా చక్కటి కథలు, కవితలు, వ్యాసాలు, ప్రత్యేక శీర్షికలు మొదలయినవెన్నో కొలువుతీరాయి.
ఇక, మరో విశేషమేంటంటే-
ఈ సంవత్సరాది సంక్రాంతి సంచిక నుండి ప్రఖ్యాత సినీగేయరచయిత-భువనచంద్ర గారు 'భువనోల్లాసం" శీర్షిక ద్వారా "పాండీబజార్ కథలు" పాఠకులతో పంచుకోనున్నారు. సినీ ప్రపంచంలో మాయాజాలాలని, మార్పులనీ మౌనంగా తనలో నిక్షిప్తం చేసుకుంటూ ఉన్న పాండీబజార్ గురించి తెలీనివారు ఉండరేమో. ఎందరో ఉద్ధండుల ఉత్థాన ప్రస్థానాలకి, మరి కొందరి లబ్ధప్రతిష్టుల పతనాలకీ సాక్షీభూతమీ పాండీబజార్. చెన్నై నగరంలోని ఆ పాండీబజార్ లోని తన అనుభవాలనీ, అనుబంధాన్నీ, గమనింపులనీ madhuravani.com పాఠకులతో పంచుకుంటున్నందుకు భువనచంద్ర గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు.
ఎప్పటివలెనే, ఈ సంచికనీ ఆదరిస్తారని, మీ స్నేహితులతో, బంధువులతో పంచుకుంటారని ఆశిస్తూ...

మధురవాణి నిర్వాహక బృందం
వార్షికోత్సవ సంచిక
నూతన సంవత్సర శుభాకాంక్షలు