top of page

సంపుటి 3  సంచిక 1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా మధురాలు

నిర్వహణ: దీప్తి పెండ్యాల | మధు పెమ్మరాజు

katha@madhuravani.com 

మేలుకో నేస్తం…

ప్రసూన రవీంద్రన్

madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన కథలపోటీ లో ప్రశంసా  బహుమతి సాధించిన కథ.

“మా అమ్మని చూసి నేర్చుకో. గుట్టుగా ఎలా ఉండాలో. భర్త ఎలా ప్రవర్తించినా అది మనసులోనే ఎలా దాచుకోవాలో. “ 

వివేక్ మాటలకి ఇంతకు ముందులా చివ్వున తలెత్తలేదు రూప. బాబుకి బట్టలు మారుస్తూనే అతని మాటలు వింటోంది.

వెంటనే త్రాచుపాములా బుస కొడుతుందనుకున్న రూప నిదానంగా ఉంటడంతో మెల్లగా ఊపిరి పీల్చుకుంటూ తిరిగి చెప్పడం మొదలుపెట్టాడు వివేక్.

“భార్యా భర్తల మధ్య ఏమైనా జరగొచ్చు. నచ్చని ప్రతి విషయమూ తల్లితండ్రులకి చెప్పుకుంటే పోయేది నీ పరువే. “

రూప వివేక్ వైపు చూస్తూ అవునన్నట్టుగా తలాడించింది.

దెయ్యాల వేళ

భవాని ఫణి

madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన కథలపోటీ లో ప్రశంసా  బహుమతి సాధించిన కథ.

నాకెంతో ఇష్టమైన ఆ పుస్తకం పూర్తయ్యేసరికి అర్థరాత్రి పన్నెండు దాటింది.  'దెయ్యాలకి ఇష్టమైన సమయం' అనుకుని నవ్వుకున్నాను. నేనప్పటివరకూ చదివింది ఒక హారర్ నవల. దాన్ని నేను చదవడం ఇప్పటికి ఏ ఇరవయ్యోసారో!. నాకు హారర్ కథలంటే చాలా ఇష్టం. నిజానికి దెయ్యాలుంటాయని నేను నమ్మను. అంతే కాదు దేవుడ్ని కూడా పెద్దగా నమ్మను. ఇంకా సరిగ్గా చెప్పాలంటే నాకు కనిపించనివేవీ నిజాలని నేననుకోను. అవి అతీంద్రియ శక్తులు కానీయండి, మానవాతీత శక్తులు కానీయండి -  ఇవన్నీ కేవలం అభూత కల్పనలని నా అభిప్రాయం. కానీ నాకీ పై పదాలంటే చాలా ఇష్టం. అటువంటి కథలన్నీ నాకు గొప్ప ఆనందాన్నిస్తాయి. అందుకే ఇవన్నీ నమ్మేవారందరి కంటే నాకే ఈ విషయాలకు చెందిన పరిజ్ఞానం ఎక్కువ.

కల కానిది

పాలెపు బుచ్చిరాజు

madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన కథలపోటీ లో ప్రశంసా  బహుమతి సాధించిన కథ.

ఉదయం లేచిన దగ్గరనుంచీ జానకికి మనసేమీ బాగోలేదు. ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు. గతం భూతమై భయపెడుతోంది. యాంత్రికంగా కాఫీ కలుపుకుని తాగింది. ఏదో కొంత ఉడకేసుకుని తింది. ఒంటరితనం భరించరానిదిగా ఉంది. రాత్రి కూడా అంతా కలత నిద్దరే అయింది. ఏవేవో పీడ కలలు. అలవాటుగా ప్రక్కన పడుకునే సునీత లేకపోడంతో నిద్ర సరిగ్గా పట్టలేదు. సునీత ఇంట్లో ఉంటే చేతినిండా పని ఉంటుంది. అసలు తీరిక ఉండదు. దాని స్నానం అయ్యాక తల దువ్వి, డ్రస్సువేసి, బడికి పంపాలి. లంచి బాక్సు తయారు చేసి ఇవ్వాలి. తిరిగి వచ్చేసరికి ఏదో ఒక పిండి వంట చేసి ఉంచాలి. అది పెట్టే చిన్నా చితకా పేచీలని సంబాళించుకోవాలి. అయినా ఏమాత్రము విసుగు కోపము లేకుండా అన్ని పనులూ చేస్తుంది. తనకి మాత్రం ఇంకెవరు ఉన్నారని? ఒక్కగానొక్క కూతురు సునీత ...

నేను సైతం

కర్రా నాగలక్ష్మి

" మీ రిక్వైర్ మెంటు చెబితే దాన్ని బట్టి మా రేటు వుంటుంది సార్ " ఫోను లో అవతలకి వ్యక్తి మాటలు ఆగదిలో వున్న అందరికీ వినిపించేయి. రిక్వైర్ మెంటు అంటే యేం చెప్పలో యెవ్వరికీ అర్దం కాలేదు .

ఇవతల వైపునుంచి సమాధానం రాకపోయేసరికి అవతల వ్యక్తి  " రమేష్ గారూ చెప్పండి "అన్నాడు .

కాస్త తటపటాయించి " నాకు యీ విషయాలు పెద్దగా తెలీవు , అందుకే .... " అంటూ నీళ్లు నమలసాగేడు.

" అందుకే కద సార్ మేమున్నది , మీరు నిశ్చింతగా వుండండి , మా టీం యిలాంటి యేర్పాట్లని చక్కగా నిర్వహించడానికి ప్రత్యేకంగా తర్ఫీదు పొందేరు సార్ , మీకు సంతృప్తికలిగేటట్లు కార్యం నిర్వహించడం మా బాధ్యత...

కాలంలో పయనం

డా. మూలా రవికుమార్

"మరో అరగంటలో మురళీ వస్తున్నాడు, ఏమైనా పనులుంటే ఇప్పుడే చెప్పేయ్"

"ఇంటికొచ్చి పూర్తిగా పన్నెండు గంటలు కాలేదు. ఇరవై రోజులనుంచీ ఇంట్లో లేరు. సాయంత్రం పెళ్ళాన్ని బైటికి తీసుకెళ్ళడం కన్నా మీ టూరు విషయాలు ఫ్రెండుకి చెప్పెయ్యాలన్న తొందరేనా?"  ఊహించినట్టే మా ఆవిడ అడిగింది.

"అది కాదమ్మాయ్. ఆఫీసులో ఇరవైరోజులు లేనేమో, మా బాస్ కూడా నన్ను రేపు తేలిగ్గా వదలడు. ఎల్లుండి మురళీ పదిరోజుల టూరు వెళ్తున్నాడు కనుక మాట్లాడుకోవటానికి కుదిరే అవకాశం లేదు.  ఐనా మురళీ వాళ్ళావిడ కూడా వస్తోందిలే, నన్ను నువ్వూ, వాణ్ణి వాళ్ళావిడా తిట్టుకుంటూ ఉంటే మీకు గంటలు నిమిషాల్లా గడిచిపోతాయి."...


Feedback
editor@madhuravani.com
 
©  2022 madhuravani.com

మధురవాణి కొత్త సంచిక విడుదల వివరాలు ఉచితంగా సకాలంలో అందుకోవాలంటే మీ పేరు, ఇ-మెయిల్ చిరునామా editor@madhuravani.com  కి పంపించండి.

మీ వివరాలు ఎవరితోనూ పంచుకొనబడవు.​

Website Designed
 &  Maintained
 by
Srinivas Pendyala

bottom of page