top of page

సంపుటి 1    సంచిక 4

కథా ​మధురాలు

నిర్వహణ: మధు పెమ్మరాజు | దీప్తి పెండ్యాల

katha@madhuravani.com 

హుండీ

ఆర్. దమయంతి

madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన కథలపోటీ లో ఉత్తమ బహుమతి సాధించిన కథ

Damayanti

గుడి మెట్ల మీద నిశ్శబ్దంగా కూర్చుని, ఆలయ ప్రాంగణాన్ని పరికించి చూస్తున్నాడు  నీలకంఠం.
రావి చెట్టు చుట్టూ - దీపాలు వెలిగించి వదిలేసిన ప్రమిదలు ఎడా పెడా పడున్నాయి. చెట్టుకల్లా ఆన్చి దీపాలు  పెట్టొద్దంటే  వినరు.  వాళ్ళ మూఢ భక్తికి  వృక్ష కాండం మాడి నల్ల బొగ్గౌతోంది. దాని పక్కనే కొత్తగా నాటిన మూడడుగుల వేప మొక్క –   అజ్ఞానపు  మంటలంటుకుని లేత రెమ్మలన్నీ మాడిపోయి,  తల వాల్చేసింది.
ప్రాంగణం లో ఓ మూల  చెత్త బుట్ట పెట్టించాడా?!  ఊహు. చెత్త అందులో తప్ప అంతటా పోస్తారు.  వెలిగి ఆరిన వొత్తులు, అగరబత్తుల డబ్బాలు,  పసుపు కుంకుమల  పొట్లాలు, 

మేనిక్విన్ (Mannequin)

మణి వడ్లమాని

madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన కథలపోటీ లో ఉత్తమ బహుమతి సాధించిన కథ

Damayanti

అది నగరం లో మహా రద్దీగా ఉండే ప్రాంతం. ఆ రోడ్డు మొత్తం  పెద్ద పెద్ద బట్టల షాప్ లు హోటల్స్ ఉండటంతో రోజంతా హడావుడి గానే  ఉంటుంది. వచ్చే పోయే బస్సులు, కార్లు, ఆటొలు, మోటారుసైకిళ్ళు తో మోతెత్తి  పోతూంటూంది. క్రమంగా పొద్దు గడచి రాత్రి కావటం తో నెమ్మదినెమ్మదిగా నిశబ్ధం కొండచిలువలా  ఆక్రమించుకుంటోంది. అప్పటికే కొన్ని షాపులు మూసేసారు. కొంతమంది షట్టర్స్ వేసేసి లోపల పని చేసుకుంటున్నారు.

ఆ వరుసలో ఉన్న ఒక పెద్ద షాప్ లోపల ఓ ముసలతను, మరో నలుగురు కుర్రాళ్ళు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు పనిచేస్తూ  

పాప కోసం

భవానీ ఫణి

madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన కథలపోటీ లో బహుమతి సాధించిన కథ

Bhavani Phani

దూరంగా హెడ్ లైట్ల వెలుగు కనిపించడంతో రిలీఫ్ గా ఊపిరి పీల్చుకుంది కల్పన. కానీ, వెనువెంటనే ఆమె మనసులోకి ఓ సందేహం ప్రవేశించింది. ఒకవేళ అదే నిజమైతే ఎంత ప్రమాదమోననుకుంటూ అటూ ఇటూ చూసేసరికి పక్కనే గుబురుగా ఉన్న పొదలు కనిపించాయి . పాకెట్ బాటరీ లైట్ వెలుగులో, సంశయిస్తూనే ఆ పొదల మధ్యకి ప్రవేశించిందామె . కొంచెం లోపలగా దాక్కుని, భయం భయంగా రోడ్డు వైపు చూడసాగింది. 

ఇంతలో చీకటిని చీల్చుకుంటూ ఒక తెల్లని కారొచ్చి సరిగా బస్ షెల్టర్ ముందుగా ఆగింది. కల్పన గుండె మరింత వేగంగా కొట్టుకోసాగింది. కార్లో ఎవరున్నారోనని కళ్ళు  చిట్లించి పరిశీలనగా చూసింది. ఎత్తుగా భారీగా ఉన్న ఒక వ్యక్తి  క్రిందికి

ఎపిసోడ్ నంబర్ 876

రాజేష్ యాళ్ళ

madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన కథలపోటీ లో బహుమతి సాధించిన కథ

rajesh yalla

"కొంచెం కాఫీ ఇస్తావా సీతాలూ?!" అలసటగా సోఫాలో కూర్చుంటూ భార్యను అడిగాడు రామారావ్!
కనుచివరలనుండే రామారావ్ వైపు కోపంగా చూసింది సీతాలు. 'రెప్ప కూడా ఆర్పకుండా నేను "ఈ యుగం ఇల్లాలు" సీరియల్ చూస్తోంటే మధ్యలో నీ గోలేంటీ' అన్నట్టుగా ఉందామె క్రీగంటి కోపం!
మళ్ళీ రెట్టించకుండా ప్రకటనల విరామం వరకూ ఓపిగ్గా ఎదురు చూశాడు రామారావ్. "బ్రేక్ వచ్చింది సీతాలూ, కాఫీ కలిపెయ్యొచ్చులే!" ఆనందంగా అరిచాడు.
"ఆ ముదనష్టపు కాఫీ ఏదో ఆఫీస్ క్యాంటీన్లో తాగేసి రమ్మని ఎన్నిసార్లు మొత్తుకున్నా వినరేంటీ?!" 

లెట్స్ గో ఇండియా

శ్యామలాదేవి దశిక

Bhavani Phani

ఏమిటీ… చేతిలో న్యూస్ పేపరు పట్టుకుని ఏదో ఆలోచిస్తున్నారు? మనం ఇండియా వచ్చి మూడు నెలలై పోయింది. హైదరాబాద్ లో మా ఆఖరి చెల్లిలింట్లో నెలరోజులు... గుంటూర్లో మీ తమ్ముడింట్లో నెలరోజులు మకాం పెట్టాం. అక్కడ్నించి బంధువుల్ని చూసినట్టు ఉంటుంది... ఊళ్ళు  చూసినట్టు ఉంటుందంటూ  బెంగుళూరు...  చెన్నై...  వైజాగ్...  తిప్పారు. ఆ తర్వాత కాకినాడ వెళ్ళి మీ అక్కగారిని చూసొచ్చాం. ఇక ఈ తిరుగుళ్ళు నావల్లకాదు. మన గృహప్రవేశం ఎక్కడో చెప్తే నేను తట్టా, బుట్టా చూసుకోటం మొదలెట్టుకుంటాను. నా తిప్పలేవో నేను పడాలికదా?
ఏమిటీ...  అంతా అయోమయంగా ఉందా.. ఇక్కడి ఈ లైఫ్ స్టైలు... ఈ హడావిడి… గందరగోళం...  ఈ ధరలు చూస్తుంటే 

bottom of page