
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
కథా మధురాలు
నిర్వహణ: దీప్తి పెండ్యాల | మధు పెమ్మరాజు
మొలకలు
మణి వడ్లమాని
పొలంగట్టున కూర్చున్న నరసయ్య చేతులు అడ్డంపెట్టుకొని పైకి చూస్తున్నాడు. ఎక్కడా వాన దేవుడు కరుణించేలాలేడు. ఇక ఈ ఏడు కూడా పంటలు వేయలేనేమో? ఒక్క వాన కురవకూడదా? పచ్చని పైరు, గాదెల నిండా ధాన్యం ఈ జీవితంలో చూస్తానా? అనుకుంటున్నాడు.
ఇంతలోపక్కపొలమువీరన్నవచ్చాడు. “ఏంటి నరసయ్య అట్టా పైకి చూస్తున్నావు? అని అడిగాడు’
“ఏం లేదు వీరయ్యా ఈ ఏడు కూడా పంట వేయకపోతే ఎలా? ఏం చెయ్యలా అని ఆలోచిస్తున్నా” అన్నాడు.
“అవును నరసయ్యా! నీమాట నిజమే, తీసుకున్న అప్పులు తీరేమార్గం కనిపించటంలేదు. మొన్నే నర్సయ్య పండిన పంటకు గిట్టుబాటు ధరరాక, చేసిన అప్పులు తీర్చలేక,
గొంగళి
హైమావతి ఆదూరి
అవి ఎన్నికల పండగల రోజులు.
పండగలు కొందరికైతే , ఉద్యోగులకు ఎండగలు, ప్రభుత్వ ఖజానాకు దండగలు. ఎలక్షన్ సిబ్బందికి గండాలు. కొంద రు గ్రామవాసులు కూలి పనులన్నీ, వదిలేసి ఎవరు డబ్బిస్తే వారి జెండాలుపట్టు కుని అరుస్తూ తిరిగి, ఒప్పందం ప్రకారం ముట్టినంత తీసుకుని వెళ్ళిపోతుంటారు. ఇహ ఎన్నికల సిబ్బంది కష్టాలు అదీ మహిళా ఉద్యోగుల ఇబ్బందులు చెప్పనలవికానివి. గుండె ల్లో రైళ్ళు పరుగెడుతుంటాయి.
ఆరోజూ అలాగే- భయపడుతూనే స్కూల్ కెళ్ళింది కళ్యాణి. ఆ మధ్యే కష్టపడి,పిల్లలతో పాటుగా ఏడేళ్ళు చదివి,చదివి ఎం.ఏ. ఏమెడ్ పూర్తిచేసి, ప్రమోషన్ పొందింది .స్కూల్ కెళ్ళగానే" మేడం! ఎలక్షన్ డ్యూటీ ఆర్డర్స్ ఇవాళో రేపో వస్తాయిట! ఈ మారు మీకు పీ.ఓ.గా వస్తుందను కుంటున్నారు మేడం ఆర్.డీ.ఓ ఆఫీస్లో ." అంటూ చావుకబురు చల్లగా అందించాడు అసిస్టెంట్ ఆనంద్.
"బాబోయ్!పీ.ఓ నే!" అంటూ కల్యాణి కూర్చీలో వెనక్కువాలింది భయంగా.
"అదేంటి మేడం! ఎన్నోమార్లు ఏ.పీ.ఓ.గా డ్యూటీ అద్భుతంగా చేసి,మంచిపేరు తెచ్చుకున్నారు,ఈమారు పీ.ఓ ఐతే-
ఈప్సితం
మస్తో వంశీ
ఆ పై నైరుతి మూలగదిలో కూర్చుని ఉన్న లంకేశ్, ఆమెను విప్పారిన నేత్రాలతో చూస్తూ ఉండిపోయాడు స్తబ్దంగా... కదలకుండా.
ఆమె కిర్రున బీరువా తెరిచింది. వజ్రాల హారమున్న పెట్టెను సుతారంగా బయటికి తీసింది. ఝిగేల్ మంటున్న అందులోని నెక్లెస్ ను కుడి చేతిలో పట్టుకొని, తల పంకించి అతడి వైపు మెరుస్తున్న కళ్లతో చూసింది. అందమైన చిరునవ్వు ఒకటి ప్రత్యక్షం అయింది లేత గులాబీ రంగులో మెరుస్తున్న ఆమె పెదాల పైన.
మిరుమిట్లు గొలుపుతున్న వజ్రాల హారం కన్నా అందంగా ఉన్న షాకియా మోనీ అనే ఆమెను కళ్ళు అప్పగించి చూస్తున్న లంకేశ్ మనసు, అతను కూర్చున్న కుర్చీ లోంచి అమాంతం గతంలోకి పయనం అయిపోయింది.
రావల్పూర్ లో లంకేశ్ ఓ పేద తండ్రికి జన్మించాడు. నానా అగచాట్లూ పడి డిగ్రీ వరకూ కొడుకును చదివించిన లంకేశ్ తండ్రి, ఇక కొడుకు ఏ కొలువో చేసి తనకు ఆసరాగా నిలుస్తాడని ఊపిరి పీల్చుకుందాం అనుకుంటున్న సమయంలోనే, అనుకోకుండా ఆయన ఊపిరి ఆగిపోయింది.
లంకేశ్ తల్లి, ఆమె ఒక్కగానొక్క సంతానమైన లంకేశ్, బాగా ఒంటరివారైన మాట వాస్తవమే అయినా, వారి జీవితాల మీద అదృష్టం ఢాం అని అఫ్ఘాన్లో ఎయిర్ స్ట్రైక్ లా వచ్చి పడింది.
టీం-జావా (Click & Call ==SAVE)
ప్రసాద్ ఓరుగంటి
సమయం రాత్రి 8 గంటలు.
హైదరాబాద్.
ఒక పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీ.
ఒక పాతికేళ్ల యువతీ కంప్యూటర్ వైపు చూస్తూ చాలా అసహనం గా ఉంది, తను అనుకున్న, రావాల్సిన ఫలితం రాకపోవడం తో. ఇంకో అరగంట లో ఆన్ సైట్ కాల్ ఉంది. ఇంకా ప్రాబ్లెమ్ సాల్వ్ అవలేదు అని. ఈ ఇష్యూ ఫిక్స్ అయితే, అమెరికా లో నున్న టీం కి అప్డేట్ చేసేసి క్యాబ్ లో రూం కి వెళ్ళవచ్చని ఆ అమ్మాయి ఆలోచన.
ట్రింగ్ ట్రింగ్ మని సెల్ ఫోన్ రింగు. “హే దివ్యా! ఏంటి ఇంకా ఆఫీస్ లో ఉన్నావా? ఇంటికెళ్ళావా” అంటూ ఒక గొంతు అటుపక్క. "ఇంకో అరగంట లో మీటింగ్ ఉంది, నాకేమో ఇక్కడ బగ్ ఫిక్స్ అవ్వలేదు. టెన్షన్ తో చస్తున్నా ఇక్కడ...మా టీం అందరూ వెళ్లిపోయారు. ఈరోజు నాదే అప్డేట్ ఇవ్వాలి ఆన్ సైట్ వాళ్ళకి...నాకు పిచ్చి ఎక్కేలా ఉంది" -మాటల్లో విసుగు దాచలేకపోయింది దివ్య.
" ఫర్లేదులే. నేను నీ ఆఫీసుకి వచ్చి, మీ హాస్టల్ దగ్గర వదిలేస్తాను. " చెప్పింది అటువైపు గొంతు. "సరే, అయిన వెంటనే వాట్స్ అప్ టెక్స్ట్ చేస్తా. వచ్చేసేయ్” అంది దివ్య. “ సరే. జాగ్రత్త.” అని పెట్టింది అటుపక్క గొంతు.
సమయం 8 గంటల ఏభై నిముషాలు. ఆఫీస్ లో అందరూ ఒక్కొక్క ఇంటికి మెల్లగా వెళ్తున్నారు.