top of page
srinivyasavani.PNG
adannamaata.png

సంపుటి  4   సంచిక  1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

వ్యాస​ మధురాలు

నిర్వహణ: శాయి రాచకొండ | శ్రీనివాస్ పెండ్యాల

vyasam@madhuravani.com

సాహిత్యం -మన ఆలోచనలూ పరిమితులూ

మెడికో శ్యాం

గజల్ నిర్వచనాలన్నిటిలోకీ గజలంటే 'ప్యార్ కా గుఫ్తగూ' అన్నది నాకిష్టం. గుఫ్తగూ అంటే సంభాషణ.

 

సాహిత్యరూపాలన్నీ సంభాషణలే.

అంటే- నాలో నేను, తనలో తను, ఇద్దరి మధ్యా , కొందరి మధ్యా సంభాషణలే. 

వ్యాసాలు బహుశా మోనోలాగ్సేమో.

ఇవాళ ఇదీ మీకూ, నాకూ మధ్య సంభాషణ. మనం, మీరూ, నేనూ - సాహితీవేత్తలం. ఇపుడు రాసేవాడూ, చదివేవాడూ ఒకటే. నిజానికి రాసేవాళ్ళమున్నాము కానీ, చదివేవాళ్ళము ఎక్కువగా లేము. 

తెలుగు సాహిత్యంలో హాస్యం - మహిళల రచనలు

వి. శాంతిప్రబోధ

నవ్వు నాలుగు విధాల చేటు అంటారు కానీ నవ్వు నలభయ్ విధాలా రైటనీ  గ్రేటనీ చెప్పరు . 

కానీ..  మనసు బాగోనప్పుడు, చికాకులో ఉన్నప్పుడు ధ్యాస మళ్లించుకునేందుకు, మనసారా నవ్వుకునేందుకు హాస్యాన్ని వెతుక్కుంటాం .  నిజమే హాస్యాన్ని  మించిన  ఔషధం ఉందా?

 

నవరసాల్లో హాస్యం ప్రధానమైంది. అందుకేనేమో   అసలు నవ్వని వాడు రోగి. నవ్వటం ఒక భోగం అంటాడు జంధ్యాల.

మన వాస్తవ జీవితంలో  హాస్యంగా మాట్లాడడం , చెణుకులు, చతురోక్తులు విసరడం వాటికి పడీపడీ పొట్ట చెక్కలయ్యేలా నవ్వడమో లేదా ముసిముసి నవ్వులు విసరడమో  చేస్తుంటాం. చాలా సహజంగా జరిగిపోతుందది. ఆ నవ్వుల పంచాంగం విప్పడం లేదిక్కడ.  

భలే మంచి రోజు

రమాకాంత్ రెడ్డి

ఈ సువిశాల వసుధైక కుటుంబంలో నేను ప్రప్రథమంగా, మౌలికాతిమౌలికంగా తెలుగువాణ్ణి. పదహారణాల అనను కానీ పది పన్నెండణాల తెలుగు వాణ్ని. 

 

రాయలోరిసీమలో చిత్రావతి నది ఒడ్డున జన్మించిన వాణ్ని. ఒక మట్టిపలక మధ్యలో సుద్దబలపంతో మా తాత దిద్దించిన  చిన్న 'అ'ని ఆ పలక నిండిపోయేలా దిద్దుకున్నవాణ్ణి. 

అదే 'అ'తో నేర్చుకున్న మొదటి పదంతోనే 'అమ్మ' అనే అమృతభాండాన్ని రుచిచూసినవాణ్ని. 

 

బుద్ధి, లోకజ్ఞానం ఇంకా ఏర్పడి ఏర్పడని దశలోనే 

అపకారికి ఉపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి అనీ 

కని కల్ల నిజము తెలిసిన మనుజుడే నీతిపరుడనీ 


Feedback
editor@madhuravani.com
 
©  2022 madhuravani.com

మధురవాణి కొత్త సంచిక విడుదల వివరాలు ఉచితంగా సకాలంలో అందుకోవాలంటే మీ పేరు, ఇ-మెయిల్ చిరునామా editor@madhuravani.com  కి పంపించండి.

మీ వివరాలు ఎవరితోనూ పంచుకొనబడవు.​

Website Designed
 &  Maintained
 by
Srinivas Pendyala

bottom of page