top of page

వ్యాస​ మధురాలు

నిర్వహణ: దీప్తి పెండ్యాల | శ్రీనివాస్ పెండ్యాల

vyasam@madhuravani.com

అప్పిచ్చి’వాడు -వైద్యుడు [సైకియాట్రీలో వింత కథలు-11]

గిరిజా శంకర్ చింతపల్లి

నా అనుభవంలో టెక్సాస్  లో చాలామంది old fashioned residents డాక్టర్ దగ్గరికి వచ్చేటప్పుడు, గవర్నర్ ఆఫీసుకు వచ్చినట్టు వస్తారు.

డిప్రెషన్ డయాగ్నసిస్ ని వాళ్ళు అంగీకరించారు. మందులు వాడటానికి ఒప్పుకున్నారు. నెలనెలా ఫాలో అప్ కి వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడల్లా ఎంత ఓపిక లేకపోయినా, మర్యాద దుస్తులు వేసుకుని వచ్చేవారు. డాక్టరు బాధపడతాడని నాకు "అన్నీ బాగానే ఉన్నాయి" అని చెబుతున్నారని నాకు అనుమానం కలిగింది.

ఒకానొకరోజు, నేను ఆఫీసుకి వచ్చే టైం కే వాళ్ళూ వస్తున్నారు.  పార్కింగ్ లాట్ నించి హాస్పిటల్ బిల్డింగ్ దగ్గరికి కలిసి నడుస్తూ వచ్చాము.  అప్పుడు అతన్ని పరీక్షగా చూశాను. నడవడం చాలా నెమ్మది, చేతులు ఊపడం లేదు. అడుగులో అడుగు వేస్తున్నట్టు కనిపించింది. అడిగితే ఒక ఆరునెలల నించీ నడక ఇలా మారిందని చెప్పారు.

ఆధునికత నేపథ్యంలో కథలు

గంటి భానుమతి

 1990 ఆరంభంనుంచి ఈ ప్రపంచీకరణ గాలులు వీచడం ప్రారంభం అయిందని చెప్పచ్చు. అప్పుడు మొదలైన ఆర్ధిక విధానాల క్రమం, తెలుగు సమాజాన్ని అతలాకుతలం చేసింది. ఆ ప్రభావం సాహిత్యం మీద ఓ పదేళ్ళ తరవాత  పడింది. జన జీవనంలో కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ మార్పుల మూలంగా సామాజిక, సాంస్కృతిక విద్యా రంగాలలోని మానవీయ అంశాలపై ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. ఎన్నో సవాళ్లని  ఎదురుకొంటున్నాయి. ముఖ్యంగా పిల్లల జీవితాలకి సంబంధించిన మౌళిక విలువలు చర్చలకి లోనయ్యాయి. సంక్లిష్టమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. వైరుధ్యాలు ఎక్కువైపోయాయి. విడిపోని చిక్కుముళ్లు పిల్లలని చుట్టుకుని , ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

      ప్రపంచీకరణ నేపధ్యంలో కథలు,నవలలు,వ్యాసాల విస్తృతి పెరిగింది,కాని, గమనిస్తే కొన్ని అంశాలలోని కొన్ని కోణాలపై దృష్టి పెట్టలేదని,వాటిమీద విరివిగా రాలేదని చెప్పుకోవాలి. అయితే ఇంతవరకూ వచ్చిన కథలు, నవలలు గమనిస్తే, రచయిత్రులు వివిధ అంతరంగ కోణాల ఆవిష్కరణతో, కథా నిర్మాణం, శిల్ప వైవిధ్యంవంటి విషయాలను పరిగణలోకి తీసుకుని, చక్కటి భాషతో రాయడంలో కృతకృత్యులు అయ్యారనే చెప్పచ్చు. సమాజంపై ఎక్కుపెట్టిన విల్లులా సూటిగా ఉన్నవి, స్పూర్తి దాయకమైనవి,మానవతా విలువలకి అద్దం పట్టేవి, ఇంకా గుండె మూలల్ని తడిమేవి, హృదయాన్ని స్పృశించే కథలు వచ్చాయి. ఇంకా వస్తున్నాయి కూడా.

ఆదీవాసీ సాహిత్యం - ప్రాప్యత, ప్రజాదరణ 

వి.బి. సౌమ్య, కెనడా

మనం సాహిత్యం ఎందుకు చదువుతాము?

కాలక్షేపం, రసాస్వాదన, ప్రపంచం తెలుసుకోడానికి, మనల్ని మనం తెలుసుకోవడానికి, విషయ పరిజ్ఞానానికి, స్వీయ భాష-వ్యక్తీకరణ ని పెంపొందించుకోడానికి, రీసర్చి కి - ఇలా ఎన్నో కారణాలు చెప్పుకోవచ్చు. మరి మనకి కథా, కవితా, నవలా, నాటికా, వ్యాసం, ఉపన్యాస పాఠం ఇలా ఇన్ని రకాలున్నాయి చదువుకోడానికి. ఫలానా ప్రాంతం వారి యాస, గోస; ఫలానా దేశీయులవి, ఫలానా కులం, మతం, ఇట్లా చెప్పుకుంటూ పోతే ముక్కోటి దేవతల్లా ముప్పైరెండు కోట్ల రకాలుంటాయి సాహిత్యంలో. ఇన్నింటి మధ్య-

 

అసలు ఏమిటి ఆదివాసీ సాహిత్యం అంటే?

ఆదివాసీల జానపద కథలూ, పాటలు, చరిత్రా - వీటిని గురించి మాట్లాడటం లేదు నేను. అలాగే, ఎందరో రచయితలు వాళ్ళ జీవితాలని దగ్గరగా గమనించి రాసిన సాహిత్యం గురించి కూడా మాట్లాడటం లేదు. మారుతున్న కాలంతో వారి జీవితాలూ మారాయి. కానీ మనకి వార్తల్లో కనబడే ఆదివాసీలు ఎప్పుడూ అమాయకులు, మోసపోయిన వాళ్ళు, ఆధునికత నాగరికత బలి పెట్టిన వాళ్ళు. ఇంతేనా? ఇంకేం‌ లేదా? వివిధ ఆదివాసీ జాతుల జీవితాలలో ఇప్పుడు ఉన్న సాహిత్యం ఎలాంటిది? వాళ్ళేం రాస్తున్నారు? దేన్ని గురించి రాస్తున్నారు? - దీన్ని నేను ఆదివాసీ సాహిత్యం అంటున్నాను.

bottom of page