Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
క్రొత్త శీర్షికలు - మధురవాణి ప్రత్యేకం
నిర్వహణ: వంగూరి చిట్టెన్ రాజు | దీప్తి పెండ్యాల
అందమైన అబద్ధాలు
భువనచంద్ర
ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ చేసిన రోజునే ఇది 'సూపర్ హిట్' అవుతుందని చెప్పా. ఇది సూపర్ డూపర్ హిట్టని చెబుతున్నా" చిరునవ్వుతో అన్నాడు సూది నాయుడుగారు. అసలు పేరు ABC నాయుడు. 'సూది' సినిమాతో హిట్టయ్యాడు గనక అందరూ ఆయన్ని సూది నాయుడంటారు.
హాలంతా చప్పట్లతో, ఈలలతో దద్దరిల్లిపోయింది. "మీ హీరోనే మా హీరో. అంటే ప్రజల కోసం, ప్రజల్లోంచి ఇండస్ట్రీకొచ్చిన ప్రజాహీరో అన్నమాట. మీకేం కావాలో ఆయనకి బాగా తెలుసు" హీరోగారి ఫేన్స్ వూగిపోయారు. ఉత్సాహంతో వెర్రికేకలు వేశారు.
"ఇక రచయిత సంగతి. ప్రజలనాడి పర్ఫెక్టుగా తెలిసిన ప్రజారచయిత మాటల తూటాలు పేల్చడంలో ఆయనకి ఆయనే సాటి. ముఖ్యంగా ఆ డైలాగు,
యూరేకా... అమెరికా
బలభద్రపాత్రుని రమణి
" మా పెరుగు తీస్కోండోయ్ హా..." అని అవలించే సోడాబుడ్డి కళ్ళద్దాల నారాయణలా ఆవలిస్తూ పెరుగు అమ్మేవాడూ కనపడలా!
ఇంకా మనతో మాట్లాడ్తూనే, మా నిర్మాత ఒకరు, పుల్ల వెదుక్కుని పళ్ళు కుట్టుకుంటూ వుంటాడు. మనం కథ చెప్తుంటామా... "అప్పుడు ఆ హీరోయిన్ ’ధు’ జారి హీరో మీద… ’ధు’ పడిందా? డైనింగ్ టేబుల్ మీద ’థు’ ఏం వున్నాయి? అవి తింటూ ’థు’ " ఇలా కథ వింటూ, పళ్ళు కుట్టుకుని ఉమ్ముకుంటూ ఆస్వాదించే సీతాఫలాల వంటి మనుషులే కనిపించలేదు. సీతాఫలం అంటే మనుషుల నోళ్ళు సగం చేసిన సీతాఫలాల్లో గింజల్లా వుండడం అని కవి భావన...
సత్యాన్వేషణ
సత్యం మందపాటి
సిధ్ధార్ధుడు ఎంతో సుకుమారంగా, బయట ప్రపంచం చూడకుండా, నాలుగు కోట గోడల మధ్యా పుట్టి, పెరిగి పెద్దవాడయాడు. దానికి కారణం తండ్రి శుధ్ధోధన మహారాజుకి ఆనాటి జ్యోతిష్కులు అతను పెరిగి పెద్దవాడయాక, ఒక మహారాజుగానో, ఒక సన్యాసిగానో అవుతాడని చెప్పారుట. తనలాగా గొప్ప మహారాజు అవవలసిన యువరాజు, అలా సన్యాసి అవటం ఆయనకి నచ్చలేదు. అందుకే ఆయన సిధ్ధార్ధుడిని ఇటు జీవితంలోని కష్టనష్టాలకూ, బాధలకూ, మతాలకూ దూరంగా వుంచి ఎంతో జాగ్రత్తగా పెంచాడుట...
పెద్దవాడయాక మొట్టమొదటిసారిగా తన తండ్రికి తెలియకుండా ఒక్కడే బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టాడు సిధ్ధార్ధుడు...
అదన్నమాట సంగతి
జ్యోతి వలబోజు
ఎండలు ఎండలు ఎండలు…
మండుతున్న ఎండలు… మంటలు పుట్టిస్తున్న ఎండలు...
నేలమీది రాళ్లను, తలమీద బుర్రను కాల్చేస్తున్న ఎండలు...
ఇలా ప్రతీ సంవత్సరం పెరుగుతున్న ఎండలను వామ్మో, వాయ్యో అనుకుంటూ తిట్టుకుంటూనే ఉంటాం. చెట్లను పెంచేబదులు నరికేస్తుంటే నీడ ఎక్కడ, ఆ పచ్చదనం ఇచ్చే చల్లదనం ఎలా దొరుకుతుంది? ఎండాకాలం లేదా వేసవి అనగానే బాబోయ్ ఎండలు అనుకుంటూనే ఆకుపచ్చని మామిడికాయల ఆవకాయలు, పసుపుపచ్చని ...