top of page
sanchika 2.png
hasya.JPG

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కవితా  మధురాలు

నిర్వహణ 

విన్నకోట రవి శంకర్ | మధు పెమ్మరాజు

kavita@madhuravani.com 

Sivareddy_edited.jpg

ఆమె ఎవరైతే మాత్రం

~కె.శివారెడ్డి

సంపాదకుల ప్రత్యేక ఎంపిక

ఆమె ఎవరైతే మాత్రం ఎలా కదుపుతాం

ప్రశాంతంగా  నిర్మలంగా దేవతలెవరో ఆమె తల చుట్టూ

            తిరుగుతూ వింజామరలు విసురుతున్నట్టు

హాయిగా అస్వప్నంగా మళ్ళా ముకుళిత పుష్పంలా

                                       శయనించిన ఆమెను

ఆమె ఎవరైతే మాత్రం ఎలా కదిలిస్తాం-

ఆమె ఎవరైతే మాత్రమేమిటి

నా భార్యో, పక్కింటావిడో, పిల్లల తల్లి తెల్లని పిల్లో

ఆమె ఎవరైతే మాత్రం ఎలా కదిలిస్తాం, కనలిస్తాం

పెదవులు కూడా కదపకుండా అయితే మాత్రం ఎలా పిలుస్తాం-

ఒక సంక్షుభిత పగటి తర్వాత

ఒక వ్యాకుల కలిత శిథిల పగటి తర్వాత

ఏ సౌందర్యమూ లేని, ఏ లాలిత్యమూ లేని భయంకర

                                      పశువు పగటి తర్వాత

విశ్రమిస్తున్న ఆమెను కదపటం ఎలా

మళ్ళా రేపటి జీవన వ్యాపారం కొరకు

మళ్ళా రేపటి అనూత్న అత్యతి సాధారణ నిర్జీవ యాంత్రిక జీవనాన్ని

ఎదుర్కునే శక్తినీ, సారాన్నీ, ఓర్పునూ నిశ్శబ్దంగా

తన నుంచే తను స్వీకరిస్తున్న ఆమెను

ఆ స్వేచ్ఛా సమాధి నుంచి, రోజూ పొందే

                            ఆ అప్రయత్న గాఢ సౌఖ్యం నుంచి

ఎలా కనలించను, కలతించను

కరుగుతున్న మంచు ముక్కలా ఆమె పడుకుంటే

కదులుతున్న నీటిబొట్టులా ఆమె పడుకుంటే

కంట్లో బంధించబడ్డ గొప్ప దృశ్యంలా ఆమె పడుకుంటే

రాత్రంతా ముకుళించి రేప్పొద్దున వికసించే అద్భుత పుష్పంలా

ఆమె పడుకుంటే పడుకోనీ –

మనం ఆమె చుట్టూ చేరి ప్రార్థనలు చేద్దాం

ఏ కల్మష స్వప్నమూ ఆమెను అంటవద్దని

రేపటి తాలూకు ఏ దురూహన్నా ఆమెను సోకవద్దని

రేపటి మృగాన్నెదుర్కోనేందుకు

సర్వశక్తి సామర్థ్యాల్నీ స్వీకరిస్తున్న

ఆమెను కదపొద్దు, మనసులో అన్నా పిలవద్దు.

 

(“అజేయం”  సంకలనం నుండి)

సంపాదకుల ప్రత్యేక ఎంపిక

ఆమె ఎవరైతే మాత్రం ఎలా కదుపుతాం

ప్రశాంతంగా  నిర్మలంగా దేవతలెవరో ఆమె తల చుట్టూ

            తిరుగుతూ వింజామరలు విసురుతున్నట్టు

హాయిగా అస్వప్నంగా మళ్ళా ముకుళిత పుష్పంలా

                                       శయనించిన ఆమెను

ఆమె ఎవరైతే మాత్రం ఎలా కదిలిస్తాం-

ఆమె ఎవరైతే మాత్రమేమిటి

నా భార్యో, పక్కింటావిడో, పిల్లల తల్లి తెల్లని పిల్లో

ఆమె ఎవరైతే మాత్రం ఎలా కదిలిస్తాం, కనలిస్తాం

పెదవులు కూడా కదపకుండా అయితే మాత్రం ఎలా పిలుస్తాం-

ఒక సంక్షుభిత పగటి తర్వాత

ఒక వ్యాకుల కలిత శిథిల పగటి తర్వాత

ఏ సౌందర్యమూ లేని, ఏ లాలిత్యమూ లేని భయంకర

                                      పశువు పగటి తర్వాత

విశ్రమిస్తున్న ఆమెను కదపటం ఎలా

మళ్ళా రేపటి జీవన వ్యాపారం కొరకు

మళ్ళా రేపటి అనూత్న అత్యతి సాధారణ నిర్జీవ యాంత్రిక జీవనాన్ని

ఎదుర్కునే శక్తినీ, సారాన్నీ, ఓర్పునూ నిశ్శబ్దంగా

తన నుంచే తను స్వీకరిస్తున్న ఆమెను

ఆ స్వేచ్ఛా సమాధి నుంచి, రోజూ పొందే

                            ఆ అప్రయత్న గాఢ సౌఖ్యం నుంచి

ఎలా కనలించను, కలతించను

కరుగుతున్న మంచు ముక్కలా ఆమె పడుకుంటే

కదులుతున్న నీటిబొట్టులా ఆమె పడుకుంటే

కంట్లో బంధించబడ్డ గొప్ప దృశ్యంలా ఆమె పడుకుంటే

రాత్రంతా ముకుళించి రేప్పొద్దున వికసించే అద్భుత పుష్పంలా

ఆమె పడుకుంటే పడుకోనీ –

మనం ఆమె చుట్టూ చేరి ప్రార్థనలు చేద్దాం

ఏ కల్మష స్వప్నమూ ఆమెను అంటవద్దని

రేపటి తాలూకు ఏ దురూహన్నా ఆమెను సోకవద్దని

రేపటి మృగాన్నెదుర్కోనేందుకు

సర్వశక్తి సామర్థ్యాల్నీ స్వీకరిస్తున్న

ఆమెను కదపొద్దు, మనసులో అన్నా పిలవద్దు.

 

(“అజేయం”  సంకలనం నుండి)

madhuravani sahityam

ఆమె ఎవరు?

                                            ~మాచిరాజు సావిత్రి

ఎవరీమె?

చేతిలో ఘంటం

పెదవిపై చిద్విలాసం

కనులలో అలౌకిక ధ్యానం

ఎవరీమె?

 

పేరు తెలియని శిల్పి

రూపమెరుగని ఆమెకు

కల్పించిన ఊహా చిత్రమిది

అక్కడున్న ఫలకం ప్రకారం

తొలి తెలుగు విదుషీమణి ఆమె

 

కొందరి కామె కుమ్మరి

మరికొందరికామె కవయిత్రి

 

కొందరికామె దళిత ప్రతినిధి

మరికొందరికామె పురుషాధిపత్యాన్ని

ధిక్కరించిన నారీశిరోమణి

 

భక్తురాలు

విప్లవకారిణి

 

అసలు "ఆమె" ఎవరు?

 

పాశ్చాత్య దేశాలలో ఆమె

ఒక రంగు గల ఆడది

స్త్రీవాది

అణచబడ్డ జాతుల ప్రతినిధి

 

ఆమె అవన్నీనూ

కానీ అవేవీ "ఆమె" కాదు

 

ఆమె కావ్య సౌందర్యమే

ఆమె జీవిత సత్యం

 

అంతకు మించి తెలియాల్సిందీ

తెలుసుకోవాల్సిందీ

ఏమీలేదు

 

ఆమె మొల్ల

madhuravani sahityam

ఉద్దీపన

~పరిమి శ్రీరామనాథ్

సంపాదకుల ప్రత్యేక ఎంపిక

ఆమె ఎవరైతే మాత్రం ఎలా కదుపుతాం

ప్రశాంతంగా  నిర్మలంగా దేవతలెవరో ఆమె తల చుట్టూ

            తిరుగుతూ వింజామరలు విసురుతున్నట్టు

హాయిగా అస్వప్నంగా మళ్ళా ముకుళిత పుష్పంలా

                                       శయనించిన ఆమెను

ఆమె ఎవరైతే మాత్రం ఎలా కదిలిస్తాం-

ఆమె ఎవరైతే మాత్రమేమిటి

నా భార్యో, పక్కింటావిడో, పిల్లల తల్లి తెల్లని పిల్లో

ఆమె ఎవరైతే మాత్రం ఎలా కదిలిస్తాం, కనలిస్తాం

పెదవులు కూడా కదపకుండా అయితే మాత్రం ఎలా పిలుస్తాం-

ఒక సంక్షుభిత పగటి తర్వాత

ఒక వ్యాకుల కలిత శిథిల పగటి తర్వాత

ఏ సౌందర్యమూ లేని, ఏ లాలిత్యమూ లేని భయంకర

                                      పశువు పగటి తర్వాత

విశ్రమిస్తున్న ఆమెను కదపటం ఎలా

మళ్ళా రేపటి జీవన వ్యాపారం కొరకు

మళ్ళా రేపటి అనూత్న అత్యతి సాధారణ నిర్జీవ యాంత్రిక జీవనాన్ని

ఎదుర్కునే శక్తినీ, సారాన్నీ, ఓర్పునూ నిశ్శబ్దంగా

తన నుంచే తను స్వీకరిస్తున్న ఆమెను

ఆ స్వేచ్ఛా సమాధి నుంచి, రోజూ పొందే

                            ఆ అప్రయత్న గాఢ సౌఖ్యం నుంచి

ఎలా కనలించను, కలతించను

కరుగుతున్న మంచు ముక్కలా ఆమె పడుకుంటే

కదులుతున్న నీటిబొట్టులా ఆమె పడుకుంటే

కంట్లో బంధించబడ్డ గొప్ప దృశ్యంలా ఆమె పడుకుంటే

రాత్రంతా ముకుళించి రేప్పొద్దున వికసించే అద్భుత పుష్పంలా

ఆమె పడుకుంటే పడుకోనీ –

మనం ఆమె చుట్టూ చేరి ప్రార్థనలు చేద్దాం

ఏ కల్మష స్వప్నమూ ఆమెను అంటవద్దని

రేపటి తాలూకు ఏ దురూహన్నా ఆమెను సోకవద్దని

రేపటి మృగాన్నెదుర్కోనేందుకు

సర్వశక్తి సామర్థ్యాల్నీ స్వీకరిస్తున్న

ఆమెను కదపొద్దు, మనసులో అన్నా పిలవద్దు.

 

(“అజేయం”  సంకలనం నుండి)

ప్రతిరోజూ చీకటి పోయిన రాత్రులలో

నిదురని నిరసించే పరాకుల మెళకువలో

పురుడుపోసుకున్న సన్నని శకారుడు

నాందీప్రస్తావనలు లేకుండా

పరుషంగా ఒకేసారి లోలోపలి నాటకశాలలోకి

హఠాత్తుగా దూరిపోతాడు

ఒక్కొక గురుతుల పొరనీ తమాషగా వొలుస్తూ

తేలికగా లొంగదీసుకుని

మెడపట్టి క్రమపద్ధతి లేకుండా  మునకలు వేయిస్తాడు

 

ఎత్తుపల్లాలు తెలియని అఖాతంలో

దుర్భిణీ, దిక్సూచికలు లేకపోయినా కలియతిరిగి

అతుకుల తెరగుడ్డకోసం కలవరిస్తాను

మూసిన కనురెప్పలలో దుమ్ముపడిన కనీనికలను

దిగంతాల వరకూ అటునించిటూ ఇటునుంచటూ ఆడించి

పలుచని నిద్రాంబరాన్ని కుట్టుకుంటాను

నా పనితనాన్నీ, సమర్ధతనీ చూసుకుని మురిసిపోతూ

గెలిచానని అనుకుంటూ విస్తారంగా పరుద్దామని

లేస్తాను కానీ

సలుపుల చిల్లులు చూసి తలదించుకుంటాను

 

నిన్నటిరాత్రి మధ్యలో ఆపేసిన

వేయివెలుగుల కలల సౌధాల నిర్మాణానికి

సరిపడినంత ముడిసరుకు లేకపోయినా పూనుకుంటాను

రంగులేని ప్రతీ కొత్త ఇటుకపైనా నా పేరు చూసుకుని

నాలోనేనే మురిసిపోతాను

కాలం కలిసిరాక, పరిస్థితులనుకూలించక

వదిలేసిన కొన్ని పాత గోడలని కూలదోస్తూ

వాటి రంగురంగుల నమూనాలని గుండెకి హత్తుకుంటాను

 

విరామసమయంలో ముందే కట్టుకున్న

చల్లని తాటాకు గుడిసెవైపుకి

వాటంతటవే తెరుచుకునే

అదృష్టపు నవనిధుల కవటాలవైపుకి

తెచ్చిపెట్టుకున్న త్రాణతో చూడకుండా  నడుస్తాను

అప్పుడు నా పాదాల కింద జనించే

తెల్లతామరల నవ్వులని

జాగ్రత్తగా జేబులో దాచుకుంటాను

 

చల్లని మట్టినేలపై ఒకవైపుకి తిరిగి

పవ్వళించిన నన్ను

ఒక మెత్తటి చేయి సుతారంగా జోకొడుతుంది

ఈరోజైనా ఎలాగైనా ఆమె ముఖాన్ని

చూద్దామని వెనుకకి తిరిగేలోగానే

తన గాజుల కదలికల లయలోని

అనురాగపు జోల

అప్రయత్నంగా నా కన్నులు మూసివేస్తుంది

 

ఆ అశక్తతలో

అప్పుడే రెక్కలు విదిలించి

ఎగిరి వస్తున్న ఆనందపు దివ్యహంస రెక్కల గాలి

నాకై వింజామర విసురుతుంది

sabbani.JPG

కవిత్వం

~సబ్బని లక్ష్మీనారాయణ

కవిత్వం కల్తీ లేని బంగారం

కన్నతల్లి పాలు, కంటి నీరు

గుండె లోని స్వేచ్ఛా శ్వాస

నరాల్లో ప్రవహించే ఉడుకు రక్తం

అమ్మ కడుపులోంచి, ఉమ్మి నీరు లోంచి

స్వేచ్ఛగా ఉబికి వచ్చే పసిపాప కేక

ఎవడి మనసు నిర్మలమో, ఎవడి మనసు వజ్ర సంకల్పమో

ఎవడు అవకాశవాది, అల్పుడు కాడో వాడి బతుకులోంచి

వానచ్చినట్టు, వరదచ్చినట్టు కన్నీళ్ళు వచ్చినట్లు కవిత్వమస్తుంది

కవిత్వం అరువు తెచ్చుకునే సరుకు కాదు

అలికివేసే ముగ్గు కాదు

కవిత్వం మనిషికి మనిషికి అనుసంధానం

కవి వేరు మనిషి వేరు కానే కాదు

సూర్య కిరణ ప్రతాపం జగతి వెలుగు కోసం

కవి ప్రవచనం ప్రపంచ గమనం కోసం

ఎందరికి తెలుసులే సీతాకోక చిలుక పుట్టుక సంగతి

ఎందరికి తెలుసులే బతుకడానికి పరుగులిడే లేడిపిల్ల సంగతి

ఎందరికి తెలుసులే ఆకలిగొన్న సింహం వేట సంగతి

సూర్యుడు ఎప్పుడూ చెప్పుకోలేదు ఉజ్వలంగా ప్రకాశిస్తున్నానని

నది ఎప్పుడూ చెప్పుకోలేదు వాడిగా, వేగంగా ప్రవహిస్తున్నానని

చెట్టు ఎప్పుడూ చెప్పుకోలేదు పరోపకారిలా బతుకుతున్నానని

కవి సూర్యుడిలా, నదిలా, చెట్టులా ఉంటే ఎంత బాగుండు !

గాలిలా వ్యాపిస్తూ, నీరులా ప్రవహిస్తూ , నిప్పులా అంటుకుంటే ఎంత బాగుండు !

అప్పుడు వ్యక్తిత్వం, జీవితం, కవిత్వం ఔన్నత్యమై వర్ధిల్లదా !

madhuravani sahityam

దేశదిమ్మరి

-~రవూఫ్

 

పాడుకుంటూ –

తంబూరాని మీటుకొంటూ

చిట్టడవుల చీకటి మూలల్లోకి

తిరుగాడుతున్నాన్నేను.

 

ఇంతకీ నేనెవర్ని?

దేహాన్ని అంగవస్త్రంగా

చేసుకొని –

భుజాన్నేసుకొని

గమిస్తున్న దిమ్మరిని.

నా జోలెలో ఉన్నది

నా హృదయమే!

నా స్వరంలోని విస్ఫోటనమే

కదా నా గానం.

గళమెత్తిన అంతరాళాన్ని

అక్షరీకరించుకొంటూ

నన్ను నేను అన్వేషించుకుంటూ

నాలోకి లోలోపలికి

పాతాళపు లోతుల్లోకి

నా ప్రయాణం!

 

 

(ముకుందరామారావు గారికి కృతజ్ఞతలతో – ఆయన రాసిన

“హృదయంలోని మనిషిని అన్వేషించే ‘బౌల్స్’ “వ్యాసం చదివాక)

SrinivasaBharadwajKishoreKiBaSri_edited.

తథ్యమయ్య తెలిసె దైవాంశజులె

 

~సీతాసమేత శ్రీరామచంద్రుడే

(కిభశ్రీ నిమిత్తమాత్రుడు)

గోస్వామి తులసీదాస్ రచించిన రామచరిత మానస్ లో వనవాస సమయంలో సీతా లక్ష్మణసమేతంగా శ్రీరామచంద్రుడు ఒక గ్రామానికి వచ్చినప్పుడు, వాళ్ళెవరో తెలియని గ్రామవాసుల, సీతమ్మ మధ్య సంభాషణే "కహాంకే పథిక్ కహాం కిన్హై గవన్వా కౌన్ గ్రామ్ కే ధామ్ కే వాసీ" అన్న పద్యసమూహానికి ఇతివృత్తం.

 

అ పద్యాలు చదివినప్పటినుంచీ, ఆ నిర్మలమైన ఆటవికుల హృదయాలలోని భావనలు ఇతివృత్తంగా ఏదో వ్రాయాలని ఎన్నాళ్ళుగానో ఉన్న తపన గత వారాంతానికి, సీతమ్మ దయదలచగా ఒక రూపం దిద్దుకుంది.

ఇది ఆ తల్లికే అంకితం.

అన్నీ ఆటవెలదులే

(అడవిలో సంచరిస్తూ వున్న శ్రీరామచంద్రుడు, సీతమ్మ, లక్ష్మణులను చూసి వారెవరో తెలియని ఆటవికులు ఈ విధంగా అనుకుంటున్నారు)

ఎవ్వరయ్య వీరు యేల కారడవిలో

తిరుగుచుండిరిటుల తిరము లేక

పావుకోళ్ళు లేక పైతొడుగూ లేక

భయమొకింత లేక బాధలేక

 

మునులవోలెనున్న పురుషులిర్వురిమధ్య

ముత్యమల్లెనున్న ముదితయొకతి

ముందు వాడు నీలి మోహనాకారుడే

వెనుకవాడు తెలుపు వెన్నెలల్లె

 

నల్లవాని పదము తాకగానే చూడు

నల్లవాని పదము నలుప నచ్చెరువొంద (నలిపివేసినకూడ)

 

నల్లవాని నడక నలుపగా కరకైన

కంటకములు పచ్చగడ్డియాయె

పసిడిబొమ్మ లేత పదములన్ కాపాడ

పూయజేసె కసువు పూలనెన్నొ

 

ఒక్కపూవుబరువె యుండెనాయాబాల

నలుగలేదు ఒక్క దళముకూడ

కోరి పెట్టుకున్న గోరింట ఎరుపంత

పసుపు పూలకంటె పండినట్లు

 

తరుణి కొంగుతగిలి తలలూపుతూనాడె

దారిపక్కనున్న తరువులతలు

మోడుపోయియున్న మొక్కకూడా లేచి

మూడుకాయలారు మొగ్గలిచ్చె

 

వీరివెంటనుండి విడువకుండనివాడు

వనిత పదముతగిలి వదిలినట్టి

ఒక్కనొక్కపూవు నొద్దికెంతో చూపి

యేలనోమరటుల యేరుకొనెను

 

తథ్యమయ్య తెలిసె దైవాంశజులె కదా

వీరయోధ్యవారె వేరు కారు

రాముడుండె ముందు రమణి సీతమ్మయే

లక్ష్మణుండు వెనుక లయను నడచె

 

ఎంతొ కొంత పపుణ్యమేజన్మలోచేయ

వారినిచటచూచుాు భాగ్యమబ్బె

పాదపూజ చేయ పావనమ్మయ్యేను

బతుకు మనది రండు బాగుపడగ


Feedback
editor@madhuravani.com
 
©  2022 madhuravani.com

మధురవాణి కొత్త సంచిక విడుదల వివరాలు ఉచితంగా సకాలంలో అందుకోవాలంటే మీ పేరు, ఇ-మెయిల్ చిరునామా editor@madhuravani.com  కి పంపించండి.

మీ వివరాలు ఎవరితోనూ పంచుకొనబడవు.​

Website Designed
 &  Maintained
 by
Srinivas Pendyala

bottom of page