
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
కథా మధురాలు
మళ్ళీ కథ మొదలు
అనన్య
"సరే ఈ ఎర్ర చీర కట్టుకో".
"ఏదో మీ అక్కయ్యగారు పెట్టారని ఉంచుకోవాలి తప్ప, అసలు ఆ చీరకి ఆ బోర్డరు ఏమైనా నప్పిందిటండీ?" అంది తిప్పుకుంటూ.
విశ్వనాధం నోరువిప్పి అనేలోపే అన్నపూర్ణ అందుకుంది. "మరి చూడమని పైన ఎందుకు పెట్టావూ అంటారు. అంతేగా? ఉన్న చీర ఎప్పుడో ఒకప్పుడు కట్టాలిగా? తాంబూలాలు అయిపోయాక భోజన సమయంలో కట్టుకుంటాను. ఇది పక్కన ఉంచుదాం. అసలు కార్యక్రమానికి చీర ఏమి కట్టాలో చెప్పండి."
"ఈ వంకాయ రంగు?"
"దానికి ఇంకా జాకెట్ కుట్టించలేదు. ఎల్లుండే తాంబూలాలు."
"పోనీ ఆ నీలం రంగు?"
నరాసురులు!
జయంతి ప్రకాశ శర్మ
"స్వామి.. అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ...'! మీరే మమ్మల్ని కాపాడాలి!" అంటూ దేవతలందరూ ఏకకంఠంతో చేతులు జోడించారు.
"శరణమా... ఏమైనది?" శ్రీమహావిష్ణువు మందహాసంతో వారి వైపు చూస్తూ అన్నాడు.
ఆ దేవతా సందోహంలో కలియుగ మహాపురుషుడు కూడా కనిపించడంతో ఆశ్చర్యపోయాడు శ్రీమహావిష్ణువు!
"ఏమి షిరిడిశైలవాస.. మీరు కూడా...!" అంటూ చిరునవ్వు నవ్వేడు.
వాణి-జ్యం
నిర్మలాదిత్య
సాయంత్రం జమ్మలమడుగు తో కవితా గోష్టు లే కొద్దిగా ఇబ్బంది కరంగా తయారయ్యాయి. జమ్మలమడుగు విజయనగర సామ్రాజ్యేశ్వైరుడి సింహాసనం అధిష్టించ లేక పోయాడు.
సుందరాచారి ఇబ్బంది గమనించి, జమ్మలమడుగు "సా, మయామిలో తెలుగువాళ్ళ కాన్ఫరెన్స్ ఉంది వెళ్తారా" అన్నాడు.
"నాకు అంతా కొత్త. ఒకడినే వెళ్లాలా?" అడిగాడు సుందరాచారి.
"నాకు ఆన్ కాల్ పడింది సుందరాచారి గారు. నా డోనార్ టికెట్లు ఎలా వేస్ట్ అవ్వుతాయి. మీరెళ్ళితే సరిపోతుంది. మా ఆవిడ మిమ్మల్ని హోటల్ దగ్గర దింపి మళ్లీ రెండు రోజులకు, సమావేశం ముగిసిన తరువాత, మిమ్మల్ని ఇక్కడికి తిరిగి తీసుకు వస్తుంది. సమావేశం హోటల్ ఆవరణలోనే ఉంది. మీకు హోటల్ బయట రానవసరం లేదు. సమావేశంలో భోజనాలు పెడతారు. అది కాక, మీరుంటున్న హోటల్ రూం లో కూడా మీకు కావలసిన తిండి, డ్రింకులు మీరు ఫోన్ లో ఆర్డర్ చేస్తే రూముకే తెచ్చి ఇస్తారు. మీకు ఎలా సౌకర్యం అయితే అలా --
నవరాత్రి - 4
గిరిజా హరి కరణం
కొడుకును వెంటబెట్టుకుని గుడికొచ్చింది సరస్వతి.
తీర్ధ ప్రసాదాలయ్యాక,”నీ భర్తజాడేమైనా తెలిసిందామ్మా” అని అడిగాను.
“అయ్యగారూ, రోజూ ఆఫీసరుగారింటికి తిరుగుతూనే వున్నాను. ఆయన విసుక్కుంటూ- 'నీవిలా రోజూ మావెంటబడితే ఎలా, ఏదో ఆఫీసు పని మీద పంపినాము. అతనెటువెళ్ళాడో ఏమో, పొలీస్ కంప్లైంట్ యిచ్చాము యింకేమి చెయ్యగలం యిదిగో శివస్వామి ఏదో చెప్తున్నాడు విను” అన్నారు. ఆ శివస్వామి గారు –‘పూజచేసి అంజనం వేస్తాను, యెక్కడున్నా కనిపిస్తాడు. వచ్చేస్తాడు, వెయ్యి రూపాయలవుతుంది తీసుకుని మాయింటికి రా’అన్నారు.
తాళిబొట్టు అమ్మితే మూడువందలిస్తానన్నాడు లింగంసెట్టి, మిగతాది ఎక్కడినుండి తేగలను. మీయింటికెళ్ళానయ్యా అమ్మగారు అయిదువందలుంది యిస్తాను అన్నారు"అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది.
"తల్లీ! నీవేమీ దిగులుపడకు యీ అంజనాలూ క్షుద్ర పూజలూ నమ్మకమ్మా, ఆ తల్లిని నమ్ముకో సరస్వతమ్మా, నరనరంలోనూ ప్రతీ రక్తపు బొట్టులోనూ అమ్మను నిలుపుకో! ఆత్మసమర్పణ చేసుకో! పూర్తి శరణాగతితో ధ్యానించు. బిడ్డను జాగ్రత్తగా చూసుకో. నీ భర్త తప్పక తిరిగి వస్తాడు, ఈ భ్రమరాంబికా దేవిని కళ్ళారా చూసి ---
లక్ష్మి అంతటా ఉంది - తమిళ మూలం: ఆర్ చూడామణి
అనువాదం: రంగన్ సుందరేశన్
“ఎందుకు లేదు? ఇవాళ ఇడ్లీలు ఫలాహారం. నేను భోంచేసేసాను. పిండి తయారుగా తీసిపెట్టాను. నాన్నగారు నీకు వంటగదిలో అన్నీ చూపిస్తారు. నువ్వు అతనికోసం ఇడ్లీలు చేసి, నువ్వూ తిను. పిల్లవాడికి ఇష్టమంటే వాడికీ ఇవ్వు. నూనె, ఇడ్లీపొడి అల్మారాలో ఉన్నాయి. నీకు చట్నీ కావాలా? కొబ్బరికాయ, రుబ్బురోలు పక్కనే ఉన్నాయి. నాకు కొంచెం పని ఉంది, బయటికి వెళ్ళిరావాలి.”
అది విని నిత్య కలవరపడింది. ఏమీ తోచక “అమ్మా, నువ్వు బయటికి వెళ్ళాలా?” అని అడిగింది.
“అవును. ఇవాళ సమాజంలో నేను కుట్టుపని బోధించాలి. నాకు టైమైయింది. నేను తిరిగివచ్చినతరువాత నీకన్నీ వివరంగా చెప్తాను. సరేనా, నువ్వన్నీ చూసుకుంటావా? నేను వస్తాను.” అని చెప్పులు తొడుక్కొని లక్ష్మి గబగబమని బయటికి నడిచింది.
“నాన్నగారూ, ఇదేంటి?” అని నిత్య దిగ్భ్రమతో అడిగింది.
“మరేం లేదమ్మా, నీ అమ్మ ఇప్పుడు అందరికీ లక్ష్మిగా ఐపోయింది, అంతే!” అన్నారు అతను, సావధానంగా.