top of page

వ్యాస​ మధురాలు

నిర్వహణ: దీప్తి పెండ్యాల | శ్రీనివాస్ పెండ్యాల

vyasam@madhuravani.com

అప్పిచ్చి’వాడు -వైద్యుడు [సైకియాట్రీలో వింత కథలు-12]

గిరిజా శంకర్ చింతపల్లి

సాధారణంగా, నూటికి 25-30 మందికి anxiety disorder ఉంటుంది. వాటిలో general anxiety, phobia, panic disorder,social anxiety, specific phobias, OCD ఇలా రకరకాలయిన రూపాలున్నాయి.

 

సరిగ్గా డయాగ్నోస్ చేస్తే ఉపశమనం చాలావరకు లభిస్తుంది. అయితే ప్రాబ్లెం అంతా జబ్బని తెలియకపోవడం, తద్వారా ఇదేదో స్వభావ పరివర్తన అని,  మొండితనమని, రెటమతమని, దెయ్యం పట్టిందనీ. తెలిసి గూడా బయటకి చెప్పుకోవడానికీ వైద్యం చేయించుకోవడానికీ నామోషీ.

 

ఆశ్చర్యమయిన విషయం ఏమిటంటే, పేరుమోసిన తెల్ల దేశాల్లోగూడా మానసిక జబ్బులంటే నామోషీ  తగ్గలేదు. ఈ విధంగా వివాహం లో బాధలూ, ఉద్యోగంలో బాధలూ, ఆత్మహత్యలూ, ఈ విధంగా కొంతమంది జీవితం నరకంగా చేసుకుంటారు.

రసికులకనురాగమై...

మల్లాది లక్ష్మణ శాస్త్రి 

సృజనకారుని బాధ్యత సృజన. నిజమైన సృజనకారుని ఊపిరి సృజన. ఈ ప్రక్రియ ద్వారా నాకేమిటి, నాకెంత అనుకునేవారు, అలా అనుకునే ప్రాతిపదికతో సృజించలేరు ఎప్పటికీ, ఎంతమాత్రమైనా.

 

బల్ల మీద కుప్ప పోసి ఉన్న జిగ్ సా ముక్కలతో పజిల్ పూర్తి చేయడం సృజన కాదు. ఉన్న పేకముక్కలతో కొత్త గాలిమేడ కట్టటం సృజన అనిపించుకోదు.

 

సృజనకి ప్రాతిపదిక ఆహ్లాదం. ఆహ్లాద ప్రసారణ సృజనకి అనుబంధ విశేషం. సృజించలేనివానిని రచయిత అనటం భరిస్తున్న వాళ్ళకే కాదు, భాషకీ అవమానమే. రచన సృజన పర్యాయపదాలు.

 

"అనిర్వచనీయమైన అపరిమిత ఆనందమే - 'రసం'," అన్నాడు శాస్త్రకారుడు.

తెలుగు కథకుడు

జే.పీ.శర్మ

కథకుడు గురించి చెప్పుకునే ముందు, కథ గురించి సూక్ష్మంగా చెప్పుకోవాలి.   ఏవేవో ఆలోచనలు మేధడులో చోటు చేసుకుని, కథా వస్తువుకి అంకురార్పణ జరిగి, కథగా అవతరించి, కథా రూపంలో అందించే ప్రక్రియతో కథకుడు పాత్ర మొదలవుతుంది.  సమాజం పట్ల ఉండవలసిన బాధ్యతగానే భావించి, కథ ద్వారా సమాజంలో చైతన్యం తీసుకురావాలనే తపనతో రచయిత ముందడుగు వేసాడు.   ఈ ఆలోచనలు చాలామందికే రావొచ్చు.  అయితే వారి స్పందనలు వేరే రూపాంతరాలు దిద్దుకుంటాయి. అలా రూపాంతరాలలో అక్షరరూపం ఇవ్వగలిగే అదృష్ణం కొందరినే వరిస్తుంది.   

అప్పట్లో కథావస్తువుపై పరిశీలన చేసి రాయగలిగే సమయం ఉండేది, లేకపోతే చేసుకునేవారు.  ఇప్పుడు ఆ సమయం తీసుకోగలిగే ఆలోచన కరువైంది.  ఆ అవసరం లేదని అనుకుంటున్నారు.   

 

 'మేం మనుషులను చదివి రాస్తున్నాం. అంతకంటే ఏం కావాలి?' అంటూ వాదించే ఈ తరం వారికి అర్ధం కాని విషయం ఒకటే. మనుషులు మరణించినా,  మరణం లేనిది కథే! వందేళ్ల తెలుగు కథ ఇప్పటికీ అజరామరంగా ఉందంటే, ఆ కథ వెనుక ఆ రచయితలు పడ్డ శ్రమ తెలియాలి. ఎన్ని పుస్తకాలు చదివారో,  సమాజాన్ని ఎంతలా చదివారో తెలుసుకోవాలి!

bottom of page