MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
వ్యాస మధురాలు
అప్పిచ్చివాడు వైద్యుడు-12
ఆందోళనా గందరగోళం
చింతపల్లి గిరిజా శంకర్
పేషంట్ గుండెనొప్పితో ఎమర్జన్సీ రూం లో ఉన్నది. ఒకసారి వచ్చి చూసి పోవలసినది" అని కన్సల్టేషన్ వచ్చింది, ఫాక్స్ మెషీన్ లో. [అప్పటికింకా cell phone communication రాలేదు.] గుండెనొప్పి వస్తే psychiatrist ఏం చేస్తాడు. అని మీకొచ్చిన సందేహమే ఆ చిన్నదానికి గూడా వచ్చింది. కోపంగా "నాకేమీ పిచ్చి లేదు" అని మూతి తిప్పింది. అంతకుముందే ఆమె కేసు హిస్టరీ అంతా క్షుణ్ణంగా పరిశీలించిన నాకు ఇది కొత్తగా ఏమీ అనిపించలేదు.
గత మూడు సంవత్సరాల్లో ఆ పాతికేళ్ళ సెక్రటరీ ఇప్పటికి 10 సార్లు ఇలా ER కి వచ్చి, కార్డియాలజిస్ట్ ని, న్యూరాలజిస్ట్ ని, లంగ్ స్పెషలిస్టు ని చూసింది. పరీక్షలన్నీ నార్మల్ గా వున్నాయి కాబట్టి ఈ జబ్బు మానసికవ్యాధి అని నన్ను పిలిచారు. నేను అతి త్వరగా ఆ పేషంట్ కి సరయిన డయాగ్నసిస్ చేసి, మందులు రాసిచ్చాను. మళ్ళీ వారం రోజుల్లో ఆఫీస్ అప్పాయింట్మెంట్ ఇచ్చి పంపించాను.
నా డయాగ్నసిస్ Panic Disrder with agarophobia.
ఈ జబ్బు లక్షణాలు 1.గుండెదడ, 2.చెమటలు పట్టడం[అకారణంగా] 3. చేతులూ కాళ్ళూ వణకడం, 4. ఆయాసం, 5. గుండెనొప్పి. 6. Choking 7. కడుపులో వికారం, వాంతి 8. కళ్ళు తిరగడం, 9. విపరీతమయిన చలి, లేదా ఒళ్ళంతా భగభగ మని వేడి. 10. చేతులూ కాళ్ళూ తిమ్మిరులు,. 11. డీపర్సనలైజేషన్ 12. మతిపోతున్నదేమో నని భయం, 13 anger animi[ feeling of impending death]
పైన చెప్పిన 13 లక్షణాల్లో 4 ఒకేసారి వస్తే ఈ జబ్బుని తలుచుకోవాలి. ఈ గుణాలు అన్నీ ఒక సారి రాకపోవచ్చు. ఇందులో ఏ నాలుగయినా ఒక్కొక్కసారి కనబడవచ్చు. ముఖ్యంగా విపరీతమయిన భయం, ఆందోళన, చావు ముంచుకొస్తున్నదనే భయం వీటివల్ల ఎమర్జన్సీ రూం కి వస్తారు.
పానిక్ అన్న మాటకి తెలుగు నిఘంటువుల్లో నచ్చిన పదం కనబళ్ళేదు. అంక్జయిటీ అంటే, చింత, ఆందోళన, ఆదుర్దా, విచారము, ఆరాటము, వ్యాకులము, వేదన, తపన ఈ పదాలున్నాయి. వీటిల్ఫ్ నాకు నచ్చినవి వేదన, తపన. వాటితోబాటు "ఏమి జరగనున్నదో అని "ఆందోళన" ఇక Panic అంటే అత్యధికమయిన తపన, వేదన, ఆందోళన. అందుకే నేను పెట్టిన పేరు "గందరగోళం"
ఒక చిన్న పిట్టకథ. భారతం లో, పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు, కర్ణుడి సలహామేరకు దుర్యోధనుడు సతీ సమేతంగా ససైన్యంగా పాండవులున్నచోటికి వస్తాడు. [కర్ణుడు " మనమెంత ఆనందంగా ఉన్నా గూడా, మన శత్రువులు పడేబాధని కళ్ళారా చూస్తే ఆ ఆనందం వేల రెట్లు ఇనుమడిస్తుంది"" అని చెప్పి ఒప్పిస్తాడు. అప్పుడు చిత్రసేనుడనే గంధర్వుడు ఇంద్రుని తరఫున వచ్చి దుర్యోధనుణ్ణి పట్టి, తీసుకుపోతుంటే, అర్జునుడు తన అస్త్రాలతో ఒక వలయాన్ని సృష్టించి గంధర్వులు పారిపోకుండా దిగ్బంధనం చేస్తాడు. గంధర్వుల్ని ఒక గోళాకృతి వలయంలో బంధించాడు గనక, దాన్ని "గంధర్వ గోళం" అన్నారు. అదే తరువాత తరువాత గందరగోళంగా మారింది. ఒక్కొక సారి ఈ జబ్బుగలవాళ్ళకి, agarophobia అంటే ఆరుబయట ప్రదేశాలంటే విపరీతమయిన భయం. కొంతకాలానికి, ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలన్న ఆలోచన వచ్చినా panic attack వస్తుందన్నమాట. వైద్యం లేకుండా వదిలేస్తే ఇంటిలో పనులలో, స్కూల్లో. ఉద్యోగంలో. వివాహంలో చాలా కష్టాలు పడతారు.
సాధారణంగా, నూటికి 25-30 మందికి anxiety disorder ఉంటుంది. వాటిలో general anxiety, phobia, panic disorder,social anxiety, specific phobias, OCD ఇలా రకరకాలయిన రూపాలున్నాయి. సరిగ్గా డయాగ్నోస్ చేస్తే ఉపశమనం చాలావరకు లభిస్తుంది. అయితే ప్రాబ్లెం అంతా జబ్బని తెలియకపోవడం, తద్వారా ఇదేదో స్వభావ పరివర్తన అని, మొండితనమని, రెటమతమని, దెయ్యం పట్టిందనీ. తెలిసి గూడా బయటకి చెప్పుకోవడానికీ వైద్యం చేయించుకోవడానికీ నామోషీ. ఆశ్చర్యమయిన విషయం ఏమిటంటే, పేరుమోసిన తెల్ల దేశాల్లోగూడా మానసిక జబ్బులంటే నామోషీ తగ్గలేదు. ఈ విధంగా వివాహం లో బాధలూ, ఉద్యోగంలో బాధలూ, ఆత్మహత్యలూ, ఈవిధంగా కొంతమంది జీవితం నరకంగా చేసుకుంటారు.
ఒక్క మానసిక వ్యాధులేకాదు, శారీరక వ్యాధులకి గూడా మంచి కారణాలు కనిపెట్టలేదు. William Harvey రక్తప్రసరణాన్ని నిర్హేతుకంగా నిరూపించినదాకా, humors సిద్ధాంతం వెల్లివిరిసింది. ఎవరికి తెలిసిన డయాగ్నోసిస్ వారు చెయ్యడం, ఆకులూ పసర్లూ ఇవ్వడం [అవును పాస్చాత్య దేశాల్లో గూడా] ఇక్కడగూడ 200 సంవత్సరాలుగా దాదాపు 1940 లో సల్ఫా డ్రగ్స్ వచ్చేంతవరకూ, వ్యాధి పేరు ఏదో చెప్పడం, దానికి వాళ్ళకి తోచిన పసర్లు ఇవ్వడం. మలేరియా అని వ్యాధిని కనిపెట్టారు గానీ, "చెడు గాలి [mal air] వల్ల వచ్చింది కాబట్టి మలేరియా అని. మైక్రోస్కోప్ కనిపెట్టిన తరువాత బాక్టీరియా, వైరస్ ల వల్ల జబ్బులొస్తాయనీ వాటిని అరికడితే ఆ జబ్బులు నమయమవుతాయనీ వైద్యం మొదలెట్టారు. Hippocrates దగ్గర్నించి, గాలెన్ ఇత్యాది మహర్షులందరూ దేవుణ్ణి నమ్మేవారు. మన అశ్వనీ దేవతల్లాగా. అపోలో కొడుకు Aesculapius గ్రీక్ పురాణాల్లో ధన్వంతరి లాంటి వాడు. ఆంటిబయటిక్స్ వచ్చేంతవరకూ. నూటికి 98 మంది సర్జరీ తరవాత చచ్చిపోయేవారు.చాలామంది ఆ రోజునే.
ఇక మానసిక వ్యాధుల అవగాహన ఇంకా భయంకరంగా, పురాతనంగా ఉండేది. ఆ సమయంలో, Freud వచ్చాడు. 20వ శతాబ్దం లో. మనిషి పుట్టినప్పుడు ID, Ego తో పుడతాడని, ID అంటే inborn drives [both sexual and aggressive] and Ego అంటే మనసూ+ బుద్ధి అనీ ఆ రెంటి పరస్పర సంఘర్షణ వల్ల మానసిక రోగాలొస్తాయనీ. మనిషి పుట్టినప్పుడు మెదడులో చాలా ఇంఫర్మేషనుంటుందనీ, సైకో ఎనాలసిస్ చేస్తే కాన్షియస్ నెస్ లోకి తెస్తే జబ్బులు నయమవుతాయనీ. ఇంకా బ్రెయిన్ లో preconscious, subconscious, conscious levels ఉంటాయనీ, ఉంచొన్స్చిఔస్ ఫేర్స్ ని చొన్స్చిఔస్ అవరెనెస్స్ లోకి తీసుకువస్తే జబ్బు నయమవుతుందనీ. ఒక 50-60 సంవత్సరాలు స్వైరవిహారం చేశాడు. వివేకానందుడు మనిషి మెదడులో Subconscious, conscious,superconscious ఉంటాయనీ, ఆ మూడు లెవెల్స్ లో ఉన్న సమాచారమంతా మనం వాడుకోగలగడమే మోక్ష జ్ఞానమని చెప్పాడు. ఫ్రాయిడ్ కంటే 50 సంవత్సరాలు ముందు చెప్పాడు. ఫ్రాయిడ్ మన గ్రంథాలు చాలా చదివాడని నా అనుమానం.
Oliver Holmes, a physician said, "I firmly believe if the whole materia medica could be sent into the sea, it would be all better for the mankind, and all the worse for the fish" [19th century] John Hunter ఇంగ్లండ్ డాక్టర్, గనేరియా కి వాక్సినేషన్ కనిపెడదామని, ఒక రోగి చీముని తనకి ఇంజక్షన్ రూపం లో ఇచ్చుకున్నాడు. జబ్బొచ్చింది. జ్ఞానం గూడా వచ్చిన్ది, జబ్బులు క్రిముల వల్ల వస్తాయి గానీ, గాలి వల్ల కాదని. ఎలాగయితే గలీలియొ కనిపెట్టిన టెలీస్కోప్ మన ఖగోళ జ్ఞానాన్ని ఎన్నిరెట్లు పెంచిందో, అలానే మక్రో స్కోప్ వచ్చాక జబ్బులు శాపాలవల్లా, దయ్యాలవల్లా, గాలివల్లా రావనీ, క్రిములవల్లవస్తాయనీ, ఆ క్రిముల్ని అరికడితే జబ్బులు రావనీ తెలిసింది. దాంతో యాంటీబయాటిక్స్వచ్చాయి. WW1 లో తుపాకి గుండు తగిలి పడిపోయిన వాళ్ళకి సర్జరీ చేసినవాళ్ళలో నూటికి 90 మంది చనిపోయారు. WW2 లో నూటికి 75 మందికి నయమయింది. [1Aseptic surgery + antibiotics వల్ల.
మరి ఇప్పుడు తర్కిస్తున్న పానిక్ డిసార్డర్ కి కారణం ఏమిటి? 50 సంవత్సరాల కిందట నేను రెసిడెన్సీ చేస్తున్నప్పుడు, మాకు 4 హార్మోన్ల గురించి చెప్పారు. అవి ఎక్కువయినా తక్కువయినా కొన్ని జబ్బులొస్తాయనీ [schizophrenia, manic depressive illness మిగిలిన వాటికి బయటి మనుషులనో, పరిసరాలనో, పరిస్థితులనో అనుమానించడం - వాటివల్ల పేషంట్ లో కలిగే మానసిక మార్పులవల్ల కష్టాలొస్తాయనీ దానికి రకరకాల సైకోథెరపీ కనిపెట్టి వైద్యం మొదలెట్టారు. హ్యూమన్ జీనోం కనిపెట్టేదాకా ఇదే పరిస్థితి. మన శరీరంలో 3 తరవాత 10 సున్నాలు చుడితే వచ్చే సంఖ్య జీవకణాలున్నాయి. అవన్నీ ఎవరిస్థానంలో వాళ్ళు స్పెషలిస్టులు.
మన బ్రెయిన్ లో కొన్ని బిలియన్ల జీవకణాలున్నాయి. అవి మెదడు స్పెషలిశ్టులు వాటిని తీసుకొచ్చి గుండె కి పెడితే పని చెయ్యవు. ఆ కణాలు ఒకదానితో ఒకటి వందలు వేల సంఖ్యల్లో కలుస్తాయి. సంభాషించుకుంటాయి. సందేశాలు పంపిస్తాయి. ఇత్యాది సవాలక్ష పనులు చేస్తుంటే మనం కులాసాగా తిరుగుతున్నాము. మనం వస్తువెక్కడపోతే అక్కడే వెతుక్కోవాలి గానీ, పక్క వూర్లో వెతకం గదా! కాబట్టి మానసిక వ్యాధులకి గూడా కారణం మన మనస్సులోనే ఉండాలి గదా! గత 30-40 యేళ్ళుగా రీసర్చ్ అంతా ఈ మార్గంలో పోతున్నది. ఇప్పుడు మన పానిక్ డిజార్డర్ గూడా కొన్ని హర్మోన్ల ప్రభావమే అని పూర్తిగా నమ్ముతారు. ఆ హెచ్చు తగ్గుల్ని సవరించడానికి 1. Anxiolytics. 2, Serton increasing drugs, 3 Dopamine blockers, 4. Histamine blockers ఇలా చాలా మందులొచ్చాయి.
ఉదాహరణకి, నేను చూసిన వనిత కి 1.Valium 2.Tofranil అని రెండు మందులిచ్చాను. కౌన్సిలెంగ్ కూడా ఇచ్చాను. ఆరు నెలలఓ ఆమెకి పూర్తిగా నయమయ్యింది. 6 సంవత్సరాల తరవాత, అప్పుడప్పుడూ వాలియం మాత్ర మాత్రమే వేసుకుంటున్నది.
ఈ వనితను ట్రీట్ చేస్తున్నప్పుడు నా దగ్గర ఒక సైకాలజీ ఇంటర్న్ పని చేశాడు. ఒకరోజు నా ఆఫీసుకి వచ్చి రహస్యంగా తనగురించి చెప్పాడు. త్వరలో అతను తన థీసీస్ డిఫెండ్ చేసుకోబోతున్నాడనీ అటువంటి సమయాల్లో తనకి పానిక్ అటాక్స్ వస్తాయనీ ఒక్కోసారి ఆ పరిస్థితుల్లో తను పేరలైజ్ అయిపోతాడనీ మొత్తం తన కథంతా చెప్పాడు. ఇతను ఈ దేశంలో 20వ శతాబ్దంలో పుట్టిన గ్రాడ్యుయేట్ స్టూడెంట్. ఇతనికి గూడా బయటకి చెప్పుకోలేని పరిస్థితి. అతనికి కొన్ని మందులు ఇచ్చాను. 3 నెలల తరవాత నా ఆఫీస్ కి వచ్చి Dr.C. I defended my thesis with flying color. I knocked them dead. Thanks for the medicine"
ఒక 30 సంవత్సరాల యువతి రోడ్ క్రాస్ చేస్తున్నది. ఆమె నెమ్మదిగా పోతున్నదనే ఎవడో ఆకతాయి హార్న్ కొట్టాడు. అకస్మాత్తుగా అమె రోడ్ మీద కుప్పకూలిపోయింది. వాడి కారు ఆమెకు 2 గజాల దూరంగా ఉంది, హాస్పటల్ కి తీసుకొచ్చారు. ఇంతవరకూ ఎవరికీ చెప్పుకోలేదు. మందులకి నయమయింది. దీని కథ వచ్చే సంచికలో.
*****
ఒక టీజర్- మీకు తెలిసిన వాళ్ళెవరయినా ఒక చోట పడుకొని, మర్నాడు చూస్తే మరోచోట నిద్రపోతుంటారా? రాబోయే సంచికలో వచ్చే రాబోయే కథకి ఇదే హింటు.