top of page

కథా మధురాలు

నిర్వహణ: మధు పెమ్మరాజు | దీప్తి పెండ్యాల

katha@madhuravani.com 

నిర్ణయం

తిరుమలశ్రీ

madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన కథలపోటీ లో ప్రశంసా బహుమతి  సాధించిన కథ

Damayanti

“నా ఇల్లు ధర్మసత్రం కాదు, దారిన పోయే దానయ్యలందర్నీ తీసుకొచ్చి మేపడానికి. ఆ ముసలాణ్ణి వెంటనే ఇంటినుండి పంపివేయకపోతే నువ్వే వెళ్ళిపోవలసి వస్తుంది.”
 అనిల్ చిందులు త్రొక్కుతుంటే నిర్ఘాంతపోయాను నేను. అతను ఎందుకు అంత ఓవర్ గా రియాక్ట్ అవుతున్నాడో అర్థంకాలేదు నాకు. ‘నా ఇల్లు!’ – నిజమేనా? ఆ ఇల్లు మా ఇద్దరిదీ కాదా? దాని మీద నాకేమీ హక్కు లేదా? ఆ సంసారంలో, అతని జీవితంలో నాకూ సమాన పాత్ర ఉందని అతను ఎప్పుడు గుర్తిస్తాడు!?    “పాపం, అండీ! ఆల్జీమర్స్ వ్యాధితో బాధపడుతూ ఇంటినుండి తప్పిపోయి వచ్చిన ఓ డబ్బయ్యేళ్ళ వృద్ధుడు అనాథలా వీధుల్లో తిరుగాడుతుంటే…మానవతాదృక్పథంతో ఇంటికి తీసుకువచ్చాను. అది తప్పా?

ప్రేమించే మనసు

కొల్లిపర హితేష్

madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన కథలపోటీ లో ప్రశంసా బహుమతి సాధించిన కథ

Damayanti

బృందవిహార్ వర్శిటీ ఆడిటోరియం. స్నాతకోత్సవ సభ జరుగుతుంది.
 "ఇప్పుడు మాట్లాడవలసినదిగా ప్రముఖ శాస్త్రవేత్త చైతన్యగారిని ఆహ్వానిస్తున్నాం. పది సంవత్సరాల పాటు నాసాలో పనిచేస్తూ అంతరిక్షం మీద ఎన్నో పరిశోధనలు చేశారు. ఎన్నో విశ్వ రహస్యాలను బయటపెట్టారు. ఇప్పుడు దేశంలో యువ శాస్త్రవేత్తలకి మార్గనిర్దేశం చేయాలనే గొప్ప ఉద్దేశంతో అక్కడ్నుంచి వచ్చేసి ఇస్రోలో చేరిన వారి దేశభక్తి అమోఘం. ఇటువంటి వ్యక్తి మన వర్శిటీ విద్యార్థి కావటం నిజంగా మనకి గర్వకారణం. చప్పట్లతో వారిని ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాం” చెప్పగానే ఆడిటోరియం మొత్తం చప్పట్లతో నిండిపోయింది. చైతన్య పోడియం ముందుకొచ్చాడు. అంతలోనే అంతా నిశ్శబ్ధం.

ఏకాకి

ఆర్. శర్మ దంతుర్తి

madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన కథలపోటీ లో ప్రశంసా బహుమతి సాధించిన కథ

Tirumalasree

టెక్సాస్ లో ఆస్టిన్ సరిహద్దుల్లో ఉన్న ఓ అపార్ట్ మెంట్. సత్య మూర్తి పొద్దుటే లేచి కుక్కతో బాటు అలా నాలుగు రోడ్లూ తిరిగొచ్చాక స్నానం చేసి టి.వి. చూడ్డం మొదలు పెట్టాడు కాఫీ తాగుతూ. ఈ ఎనభై ఏళ్ళ జీవితంలో ఎన్ని మార్పులు? తాను అమెరికా వచ్చినప్పుడు టి.వి. రిమోట్ అనేది ఉండేది కాదు. ఇప్పుడో? తన ఫోను ఉంటే చాలు, కాలు కదిపే పనిలేదు. ఆ ఫోనే టివీ రిమోట్ లాగానూ, దానితోటే వాతావరణం ఎలా ఉందో, అన్ని ఒక్క సెకనులో తెలుస్తున్నాయి. మనిషి ఎంత పురోగమించినా మనస్తత్వం పురోగమించదు కాబోలు. తానొచ్చి యాభై ఆరేళ్ళవుతోంది.

ఆలోచనలని ఆపడానికా అన్నట్టు ఫోను మోగింది. తనని వారానికి మూడు సార్లు ఇంటికే చూడడానికొచ్చే నర్సమ్మ దగ్గిర్నుంచి. ఓ గంటలో రావొచ్చా అని అడుగుతోంది. రావొచ్చని చెప్పాక మళ్ళీ ఆలోచనలు. నదులన్నీ

అలా మొదలైంది

ప్రసూన రవీంద్రన్

madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన కథలపోటీ లో ప్రశంసా బహుమతి సాధించిన కథ

Damayanti

“చిత్ర కొంచమైనా తలొంచుకుంటే బావుంటుంది కావేరీ. మరీ అంత చనువుగా అందరితోనూ మాట్లాడేస్తుంటే, తనేనా పెళ్ళికూతురు అని అనుమానం వస్తోంది.“ నిష్టూరంగా అంది కావేరి పెద్దక్క నర్మద.

“అవునక్కా. ఇప్పటి ఆడపిల్లలు కనీసం తాళి కట్టే సమయంలోనైనా సిగ్గు నటిస్తే చాలు.“ కావేరి నిస్సహాయురాల్లా ముఖం ముడుచుకుంటూ అంది.

***

“తాళి కట్టేటప్పుడైనా కాస్త తలొంచుకుని సిగ్గుపడవే“ మధుపర్కాలు కట్టేటప్పుడు జడ జాగ్రత్తగా పట్టుకుంటూ అంది చిత్ర స్నేహితురాలు శ్రీలత.

శిల క్రింది జల

వాలి హిరణ్మయీ దేవి

madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన కథలపోటీ లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ

Damayanti

“ధరణీ, అమ్మా ధరణీ... నీ కోసం ఎవరో వచ్చారమ్మా!” అంటున్న పరంధామయ్య మాటలతో, లాప్ టాప్ మూసేసి, బెడ్ రూమ్ లోనుండి బయటకు వచ్చింది ధరణి.

హాల్లోని సోఫాలో కూర్చుని ఉన్న అపరిచిత వ్యక్తిని చూస్తూ, “ఎవరికోసం వచ్చారు? నేనే ధరణినండీ... నాతో పనేమిటి?” అడిగింది సౌమ్యంగా.

“నేనెవరో నీకు తెలియదు లేమ్మా... నన్ను రామ్మూర్తి అంటారు. నీకోసం నిన్నటినుండీ వెదుకుతున్నాను...” అన్నాడతను అలసటగా.

“ఎందుకు?” అప్రయత్నంగా అడిగింది.

bottom of page