top of page

క్రింది పేజీలు

ప్రస్తుత తాజా సంచికలో

లభ్యమవుతాయి

'అలనాటి' మధురాలు

అంధ భిక్షువు

స్వర్గీయ విశ్వనాథ సత్యనారాయణ

సంక్రాంతి సంచిక 2016​

అతడు, రైలులో నేఁ బోయినప్పుడెల్ల

నెక్కడో ఒక్కచోటఁ దా నెక్కు- వాని

నతనికూతురు నడిపించు చనుసరించు;

అతడు దాశరథీశతకాంతరస్థ

మైన యా పద్యమె పఠించు ననవరతము;

 

అతని యాగొంతు కట్లనే - అతడు పూర్వ

జన్మమందు నే నూతిలోననో చచ్చిపోవు

చెంత పిలిచిన వినువారలేని లేక,

 

ఆ పిలుపు ప్రాణకంఠ మధ్యములయందు

సన్నవడి సన్నవడి నేటిజన్మ నతని

కనుచు వెదకుచు వచ్చి చేరినది కాక -

 

అతని కన్నులా బొత్తలే - ఆ సమయము

నందు తన్ను రక్షింప నేరైన వత్తు

రేమొ యని చూచి చూచి యట్లే నిలబడి -

అతని ప్రాణాలు కనుగూళ్ళయందు నిలిచి

మరలఁ గనెఁగాక నేటిజన్మమున నతని !

 

అతనిపాడినయంత సే పల్ల - నట్టి

యతని కన్నులు చూచిన యప్పు డెల్ల,

నూతిలో మున్గునాతని తీతు నంచు

వేగిరముపుట్టు నాదు హృద్వీథియందు !

 

అంతలో పాట నాపి, తా నచట నచట

కాను లడిగి, కూతురు ముందుగా, వినిర్గ

మించు నాతడు -

నే నందు మిగిలిపోదు !​.

 

*****

Please keep your facebook logged in another browser tab or new browser window to post a comment in madhuravani.com website. 

bottom of page