'అలనాటి' మధురాలు

తన కవిత్వము గురించి తనే...

స్వర్గీయ శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ)

ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ (ఏప్రిల్ 301910 - జూన్ 151983). శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ గా ప్రసిద్ధులు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ఆయన ప్రసిద్ధుడు. మహాప్రస్థానం ఆయన రచించిన కావ్యాల్లో ప్రసిద్ధమైనది. 1981 లో సతీమణి సరోజ గారితో అమెరికా పర్యటన కి ఒక “సాహిత్య జ్ఞాపిక” గా హ్యూస్టన్ మహా నగరంలో ఆయన చేతి వ్రాతతో “సిప్రాలి’” ....(సిరి సిరి మువ్వలు, ప్రాస క్రీడలు, లిమరిక్కులు అనే మకుతాలతో 308 వచన కవితలు  ---పుస్తక రూపంగా వెలువడింది.  గత జూన్ నెలలో ఆయన 33 వ వర్ధంతి సందర్భంగా ఆ గ్రంధం నుంచి కొన్ని కవితలు “మధురవాణి” పాఠకుల కోసం సమర్పిస్తున్నాం.

 

తన కవిత్వం గురించి తనే...