
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
ఎప్రియల్ - జూన్ 2022 సంచిక
'అలనాటి' మధురాలు
నిర్వహణ: వంగూరి చిట్టెన్ రాజు | శ్రీనివాస్ పెండ్యాల
అప్రజ్ఞాతం
ప్రముఖ రచయిత, కథానిలయం వ్యవస్థాపకులు కాళీపట్నం రామారావు గారికి నివాళిగా ఈ సంచికలో వారి కథ "అప్రజ్ఞాతం" పునఃప్రచురిస్తున్నాము.
నవంబర్ 1, 1951 న "జయభారత్" పత్రికలో తొలి ముద్రణ కాబడిన కథ కారా మాష్టారు గారి ఈ కథలో స్పృషించిన పార్శ్వాలు, విసురులతో, విరుపులతో సాగి పెళుసుగా తెగే చర్చలు, వాటిల్లో చర్చించిన ఆలోచనలు ఆనాటి సామాజిక, రాజకీయ పరిస్థితులకి అద్దం పడుతూన్నప్పటికీ, ఈనాటికీ అవేవీ కాలదోషం పట్టకపోవటం పాఠకులు గమనించవచ్చు. ఈ కథ "కథానిలయం" నుంచి సేకరించబడింది. పునఃప్రచురణకి అనుమతిచ్చిన కారామాష్టారు గారి తనయులు "కాళీపట్నం సుబ్బారావు" గారికి ధన్యవాదాలు.
కథారచయితగానే కాక, సాహిత్యాభిమానులు ఎంతగానో ఆదరించే కథానిలయం సంస్థాపకులుగా కారామాష్టారి గారి పేరు సాహితీలోకంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.
తదుపరి పేజీ కొరకు, పేజీ పై భాగంలో పేజీ నెంబరు ప్రక్కన గల > ని క్లిక్ చేయగలరు