top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

వ్యాస​ మధురాలు

నిర్వహణ: శాయి రాచకొండ | శ్రీనివాస్ పెండ్యాల

vyasam@madhuravani.com

నాకు నచ్చిన కొన్ని పుస్తకాలు/రచనలు

మెడికో శ్యామ్

"కొత్త పుస్తకం తెరుద్దాం. కోతిచేష్టలు మరుద్దాం" అనిపించవచ్చు కొందరికి.

 

”చదివిందే చదివిందే చదివిందే చదవడం ఎప్పుడూ ఇష్టం కొందరికి".

పుస్తకాలు కొన్ని రుచిచూడమన్నాడు. కొన్ని మింగమన్నాడు. కొన్ని కొరికి నమిలి మింగి... జీర్ణ మంగే అని సుభాషితం. చదవడమా?  మానడమా? అని రాసేనొకసారి. ఎందుకు చదవాలో తెలియనప్పటినుంచీ ఎందుకు చదువుతున్నానో తెలియని ఇప్పటిదాకా చదువుతూనే వున్నాను.

కొన్ని కొన్ని పుస్తకాలూ, కొన్ని కొన్ని పాత్రలూ గుర్తొస్తూ వుంటాయి. ఎప్పటికీ తరగని గనిలా   జ్ఞాపకాల సువాసనలు వెదజల్లుతూనే వుంటాయి...

ఆ అక్షరాలు  చైతన్య జలపాతాలు…

మణి వడ్లమాని

సుప్రసిద్ధ నవలారాణి-యద్దనపూడి సులోచనారాణి గారికి ఆత్మీయ అక్షర నివాళి.

“అబ్బ! ఈ వారం  సీరియల్  చాలా బావుంది!!”

“అవునండీ!  రోజాకి, లావణ్యకి ఒకే రకం చీరలు కొన్నారు”

“అంతేనా?! చిన్నపిల్ల రాధ ఒకటే సంతోషపడుతోంది. ఆ అమ్మాయి చేత  మతాబులు కాల్పిస్తున్న  రోజా  మొహంలో విరిసే  కాంతి చూసి ఆ తండ్రి మురిసిపోతున్నారు”.

“నిజమే! ఆయన రోజాకి తండ్రి అని మనకి తెలుసు, కానీ పాపం  ఆ రోజాకే తెలియదు.”

ఈ విధంగా  ఆ వారం  సీరియల్ గురించి అమ్మ, పక్కింటావిడ మాట్లాడుకుంటున్నారు.  (ఆ సీరియల్ ఏవిటన్నది మీకు ఈపాటికే తెలిసిపోయుంటుంది కదా!)

వాళ్ళ మాటలు  అరుగుమీద ఆడుకుంటున్న  నా చెవి లో పడ్డాయి.  అంతే!  ఉత్సాహంగా  పరుగెత్తుకుంటూ  వెళ్లి...

సాహిత్యంలో శబ్ధము-నిశ్శబ్ధము

ఇంద్రాణి పాలపర్తి

శబ్ధశక్తి అనంతం.

ఈ ప్రపంచమే శబ్ధమయం.

కొన్ని ప్రత్యేక శబ్ధాలకు,వాటి ఉచ్చారణకు ఉన్న శక్తి గురించి మన ప్రాచీనులు చెప్పిన విషయాలు మనకి తెలియనివి కావు.

శబ్ధాలకు ఉన్న అధిదేవతలను గురించిన నమ్మకం మనకు ఎరుకే.   

ఈ శబ్ధాలు,అక్షరాలై,వాటి సముదాయం పదాలై,పదాల సముదాయం వాక్యాలై,ఇదంతా ఒక ప్రత్యేక మానవ సమూహం వారిలో వారు ఒకరి భావాలు ఒకరితో పంచుకోవడానికి ఒక భాష అయ్యి భాసిల్లుతోంది...


Feedback
editor@madhuravani.com
 
©  2022 madhuravani.com

మధురవాణి కొత్త సంచిక విడుదల వివరాలు ఉచితంగా సకాలంలో అందుకోవాలంటే మీ పేరు, ఇ-మెయిల్ చిరునామా editor@madhuravani.com  కి పంపించండి.

మీ వివరాలు ఎవరితోనూ పంచుకొనబడవు.​

Website Designed
 &  Maintained
 by
Srinivas Pendyala

bottom of page