top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

మా వాణి ...

ఇదిగో వచ్చేసింది సుమధుర వాణి!

వస్తూనే కబుర్లు, కాకరకాయలు... ఆగదే!  కథలు, కవితలు, శీర్షికలు… ఒకటే పరుగులు.

ఈ సారి విశేషం ఏమిటంటే, మన పత్రికకై ఎర్రాప్రగడ రామకృష్ణ గారు  ఆధ్యాత్మిక వ్యాసం రాస్తానని ఒప్పుకోవడం, ప్రసాద్ తుర్లపాటి గారు ప్రత్యేకశీర్షిక రాసేందుకు అంగీకరించటం. అవీ ఈ సంచికతో ఆవిష్కరించడం. ఈ రెండు శీర్షికలు మన పత్రికకి మరింత వన్నె తేనున్నాయి.

మంచి సాహిత్యం మీ ముందుంచాలని మా తపన.  సంచిక వెలువరించిన మరురోజు నుంచీ వచ్చే సంచిక గురించే ఆలోచన.  పాఠకుల మెప్పు పొందడం అంత సులభం కాదని తెలిసినా అమ్మని ఎలాగైనా మెప్పించాలని చూసే చంటి పిల్లల లాగా ఆరాటం.  కొత్త రచనలు, కొత్త ఆలోచనలు మీ ముందుకు తీసుకురావాలనే ఆకాంక్ష, దానికి తగ్గ కృషి మధురవాణిని మీముందు నిలబెడుతోంది.

ఇక, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు అందుకున్న తెలుగు యువ కెరటం-బాలసుధాకరమౌళి (యువ) కి మరియు నరంశెట్టి ఉమా మహేశ్వర రావుకి (బాలసాహిత్యం) madhuravani.com సంపాదకబృందం తరఫున అభినందనలు.

అమెరికా దేశమంతా, తెలుగువారిలో సాహితీ కోలాహలం!

అమెరికాలో పుట్టి పెరిగిన ఒక పదిహేడేళ్ళ చిన్నవాడు దేశంలో చాలా చోట్ల చేసిన, ఇంకా చేస్తున్న అష్టావధానాలతో సంచలనం సృష్టిస్తున్నాడు.  ఇక్కడి పిల్లలకి తెలుగు మాటలు పలకడమే రాదని ఒక నమ్మకం. అలాంటిది అష్టావధానమే? మనసుండాలేకాని ... మేధకి కొదవేమిటి? తెలుగు సాహిత్యం ఏమయిపోతోందో ఆన్న వాళ్లందరికీ ఒక సవాలు విసిరి నవ్వుతూ నవ్విస్తున్న లలిత్ గన్నవరం ఒక దివిటీ అయి దారి చూపిస్తాడని ఆశిద్దాం.  అతని బంగారు భవిష్యత్తుకి శుభాశీస్సులు. ఇక, అమెరికా ఖండాన, ఎన్నోతెలుగు సభలు. ఎందరో ఉద్దండులైన సాహితీ వేత్తలు రానున్నారు. ఎల్లలు దాటుతున్న సాహిత్యానందం, సాహితీ ప్రక్రియలలో మరిన్ని నూతన ఒరవడులని సృష్టించాలని madhuravani.com సంపాదకబృందం ఆకాంక్షిస్తోంది.

***

మధురవాణి నిర్వాహక బృందం

MADHURAVANI TELUGU MAGAZINE  మధురవాణి


Feedback
editor@madhuravani.com
 
©  2022 madhuravani.com

మధురవాణి కొత్త సంచిక విడుదల వివరాలు ఉచితంగా సకాలంలో అందుకోవాలంటే మీ పేరు, ఇ-మెయిల్ చిరునామా editor@madhuravani.com  కి పంపించండి.

మీ వివరాలు ఎవరితోనూ పంచుకొనబడవు.​

Website Designed
 &  Maintained
 by
Srinivas Pendyala

bottom of page