top of page

కవితా  మధురాలు

నిర్వహణ: చిలుకూరి సత్యదేవ్ | మధు పెమ్మరాజు

kavita@madhuravani.com 

శివన్న చందు 

శివన్న చందు (ఎస్. చంద్రయ్య)

కవి, రచయిత అయిన ఎస్. చంద్రయ్య గారు హైదరాబాద్ విశ్వవిద్యాలయం, తెలుగుశాఖలో డా. పమ్మి పవన్ కుమార్ గారి పర్యవేక్షణలో పిహెచ్. డి. పరిశోధక విద్యార్థి.  వీరి కవిత్వం ఎక్కువగా సామాజిక అంశాలను ప్రస్తావిస్తూ కొనసాగినదే. తెలుగు భాషకు గల వివిధ మాండలికాలను సేకరించడమన్నా, వాటికి వర్ణనాత్మక వ్యాకరణాలను రాయడమన్నా వీరికి ఎంతో ఇష్టమైన పనులు. మాండలిక పదాల నిఘంటువులను కూర్చడంలో ఎక్కువ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో వివిధ అంశాలపై సమర్పించిన 10 పరిశోధన పత్రాలు వివిధ మాస పత్రికల్లోనూ, పుస్తకాల్లోనూ ముద్రించబడ్డాయి.

జడా సుబ్బారావు

డా. జడా సుబ్బారావు

డా. జడా సుబ్బారావు గారు కృష్ణాజిల్లా నూజివీడులోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో 2009వ సంవత్సరం నుండి తెలుగు లెక్చరరుగా చేస్తున్నారు. నూజివీడు, కృష్ణాజిల్లా (ఆంధ్రప్రదేశ్, ఇండియా) వాస్తవ్యులు. ఆయన రాసిన ‘తలరాతలు’ అనే కథా సంకలనాన్ని మధురవాణి మునుపు సంచికలో పరిచయం చేసాము.  కథలేకాకుండా ఆయన రాసిన ఎన్నో సాహితీ పరిశోధనా వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి.

కథాసంపుటం  : తలరాతలు (విశాలాంధ్ర ప్రచురణ)
వ్యాససంకలనం: వ్యాసలోహిత (ప్రాచీన సాహిత్య పరిశోధనా వ్యాససంపుటి) 
అముద్రిత కవితాసంకలనం: కొన్ని కలలు...కొన్ని కన్నీళ్లు.
రేడియో ప్రసంగాలు: తెలుగు కవులు - భట్టుమూర్తి అనే అంశంపై ప్రసంగం.

స్వీయ కవితా పఠనం వృత్తికి సంబంధించిన రచనలు:  వివిధ కాలేజీలు, విశ్వవిద్యాలయ జాతీయ సదస్సుల్లో 40 పత్రాలకు పైగా సమర్పణ, అంతర్జాతీయ సదస్సులో పత్ర సమర్పణ, వివిధ సాహిత్య పత్రికలలో పలు వ్యాసాలు ప్రచురితం.
.

మల్లిపూడి రవిచంద్ర

మల్లిపూడి రవిచంద్ర

మల్లిపూడి రవిచంద్ర గారు హైదరాబాదు విశ్వవిద్యాలయం, తెలుగుశాఖలో పిహెచ్. డి. పరిశోధక విద్యార్థి.

శ్రీనివాస భరద్వాజ కిశోర్ (కిభశ్రీ)

శ్రీనివాస భరద్వాజ కిశోర్ (కిభశ్రీ)

శ్రీనివాస భరద్వాజ కిశోర్ గారి కలం పేరు కిభశ్రీ. 17 సం।।లు భారత దేశంలో వైజ్ఞానికునిగానూ, గత 19 సం।।లుగా అమెరికాలో ఐటీ మానేజ్మెంట్ లోనూ పని చేసి కళారంగంలో కృషి ద్విగుణీకృతం చేసేందుకు పదవీవిరమణ చేయాలని ఉవ్విళ్ళూరుతున్నారు. దాదాపు 600 గేయాలకు బాణీలు కట్టారు, 16 సంగీత రూపకాలకు సంగీతం సమకూర్చారు.  తెలుగు, హిందీ ఆంగ్ల భాషలలో పద్యాలు, కవితలు, గజళ్ళు, నాటికలు, సంగీత రూపకాలు వ్రాసారు.  గత సంవత్సరం "కదంబం" పద్య గేయ సంపుటి డా।।సినారె గారి చేతులమీద విడుదల అయింది. 250 మంది అమెరికన్ సభ్యులు గల టాలహాసీ కమ్యూనిటీ కోరస్, స్వరవాహిని బృందాలు ఈయన వ్రాసి స్వరబద్ధం చేసిన గేయాలను చాలా వేదికలమీద పాడారు.  ఈయన వ్రాసి స్వరబద్ధం చేసిన చాలా గేయాలను, నాటకాలను బృందాలు దర్శించాయి. ఫ్లారిడా లోని టాలహాసీ నగర నివాసి.


Feedback
editor@madhuravani.com
 
©  2022 madhuravani.com

మధురవాణి కొత్త సంచిక విడుదల వివరాలు ఉచితంగా సకాలంలో అందుకోవాలంటే మీ పేరు, ఇ-మెయిల్ చిరునామా editor@madhuravani.com  కి పంపించండి.

మీ వివరాలు ఎవరితోనూ పంచుకొనబడవు.​

Website Designed
 &  Maintained
 by
Srinivas Pendyala

bottom of page