
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
ప్రసాద్ ర్యాలి
ప్రసాద్ ర్యాలి గారు కళాశాలలో లెక్చరరుగా పని చేస్తున్నారు. కవితలప ఎంతో ఆసక్తి వున్న ప్రసాద్ గారు పలు బహుమతులు అందుకున్నారు - ఏంజని-కుందురి పురస్కారం, వంగూరి ఫౌండేషన్, ఆంధ్ర భూమి కవితల పోటీ, తానా బహుమతి, వగైరాలెన్నో. మొట్టమొదటి సారిగా రాజమండ్రిలోని నన్నయ విశ్వవిద్యాలయంలో "తెలుగు వచన కవితా శతావధానం"లో పాల్గొన్నారు.

పూండ్ల మహేష్
పూండ్ల మహేష్ గారి కలం పేరు "సుపర్ణ మహి". ఉండేది ప్రకాశం జిల్లా - అద్దంకి.
కవిత్వంతో నాకున్న బంధం, ఆప్త మిత్రత్వం. కవిత్వాన్ని చదవడం, అర్థం చేసుకోవడం, కొత్త కొత్త ప్రయోగాలు చెయ్యడం, ముఖ్యంగా మరింత నేర్చుకోవడం నాకెంతో నచ్చిన పనులు.

ఎమ్వీ రామిరెడ్డి
పూర్తి పేరు మువ్వా వెంకటరామిరెడ్డి. పుట్టిందీ, పెరిగిందీ గుంటూరు జిల్లా పెదపరిమిలో. సూర్యాపేటలో 'ఈనాడు' దినపత్రికలో పదేళ్లు సబ్-ఎడిటర్‌గా ఉద్యోగం. పదేళ్ల నుంచి 'రామ్‌కీ ఫౌండేషన్' హెడ్-ఆపరేషన్స్‌గా, హైదరాబాదులో.
‘బిందువు’, ‘మనిషి జాడ’, ‘అజరామరం’ కవితాసంపుటాలు; ‘వెన్నలో లావా’ కథాసంపుటి ప్రచురించారు.
'మువ్వా చినబాపిరెడ్డి మెమోరియల్ ట్రస్టు' తరఫున పేదపిల్లల చదువుకు ఆర్థిక సహకారం అందించడంతోపాటు 11 పుస్తకాలు ప్రచురించారు
.

మానస చామర్తి
విజయవాడలో పుట్టి పెరిగి. ఇంజనీరింగ్ పూర్తి చేసి తొమ్మిదేళ్ళ పాటు ఇన్ఫోసిస్‌లో చేసిన మానస చామర్తి గారి ప్రస్తుత నివాసం బెంగళూరు. “తమ రచనలనూ, తమను ప్రభావితం చేసిన మహారచయితల రచనల మీద అభిప్రాయాలనూ, "మధుమానసం" అన్న బ్లాగులో పొందుపరుస్తూ ఉంటారు.

శ్రీనివాస భరద్వాజ కిశోర్ (కిభశ్రీ)
శ్రీనివాస భరద్వాజ కిశోర్ గారి కలం పేరు కిభశ్రీ. 17 సం।।లు భారత దేశంలో వైజ్ఞానికునిగానూ, గత 19 సం।।లుగా అమెరికాలో ఐటీ మానేజ్మెంట్ లోనూ పని చేసి కళారంగంలో కృషి ద్విగుణీకృతం చేసేందుకు పదవీవిరమణ చేయాలని ఉవ్విళ్ళూరుతున్నారు. దాదాపు 600 గేయాలకు బాణీలు కట్టారు, 16 సంగీత రూపకాలకు సంగీతం సమకూర్చారు. తెలుగు, హిందీ ఆంగ్ల భాషలలో పద్యాలు, కవితలు, గజళ్ళు, నాటికలు, సంగీత రూపకాలు వ్రాసారు. గత సంవత్సరం "కదంబం" పద్య గేయ సంపుటి డా।।సినారె గారి చేతులమీద విడుదల అయింది. 250 మంది అమెరికన్ సభ్యులు గల టాలహాసీ కమ్యూనిటీ కోరస్, స్వరవాహిని బృందాలు ఈయన వ్రాసి స్వరబద్ధం చేసిన గేయాలను చాలా వేదికలమీద పాడారు. ఈయన వ్రాసి స్వరబద్ధం చేసిన చాలా గేయాలను, నాటకాలను బృందాలు దర్శించాయి. ఫ్లారిడా లోని టాలహాసీ నగర నివాసి.

శ్రీమతి డేగల అనితాసూరి
సచివాలయంలో ఒక విభాగానికి అధికారిణి, 'ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, కౌముది, మయూరి,
ఆంధ్రప్రభ, సాహితికిరణం, నేటినిజం ....మున్నగు పత్రికలలో వీరి రచనలు వెలువడ్డాయి. వీరి కవితా సంపుటి
'సర్వధారి ' 'చేతన ' సచివాలయ సారస్వత వేదిక' లో 2014 ఆగస్ట్ లో ఆవిష్కరించబడింది. డా.
సి.నారాయణ రెడ్డి గారు, ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు, పరుచూరి గోపాలకృష్ణ, గౌ. నారా
చంద్రబాబునాయుడు గారు, తనికెళ్ళ భరణి, రంగనాధ్ వంటి నటులు ...వంటి ఎందరో ప్రముఖుల నుంచి
పురస్కారాలు అందుకోవడం మరపురాని అనుభూతులు.
.
.
