top of page
manaillu2.jpg
kathaamadhuralu-new.jpg
kavitamadhuralu.jpg
vyaasamadhuralu.jpg
adhyatmika.jpg
pustaka-parichayaalu.jpg
vanguripi.pa.jpg
deepthi-muchatlu.jpg
bhuvanollasam.jpg
nri-column.jpg
saahiteesourabhaalu.jpg
tappoppula.jpg
alanati.jpg
paatasanchikalu.jpg
samputi.jpg
maagurinchi.jpg
rachanalu.jpg

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

వ్యాస​ మధురాలు

నిర్వహణ: శాయి రాచకొండ | శ్రీనివాస్ పెండ్యాల

vyasam@madhuravani.com

అప్పిచ్చి’వాడు -వైద్యుడు [సైకియాట్రీలో వింత కథలు-5]

గిరిజా శంకర్ చింతపల్లి

"అంతా భ్రాంతియేనా”

"మా నాన్నని చూడాలి మీరు. ఆయన ఒక్కడే ఉంటాడు. యూనివర్సిటీ నించి రిటైర్ అయ్యాక, ఆవూళ్ళోనే స్థిరపడ్డాడు. మా అమ్మ చనిపోయి 10 సంవత్సరాలు దాటింది. మళ్ళీ పెళ్ళి చేసుకోలేదు. మేము ఇద్దరు పిల్లలం నేనూ, నా అక్కా. మాదగ్గరికి రమ్మంటే రాడు.

 గత 10 నెలలుగా ఇంట్లో పురుగులు కనిపిస్తున్నాయని, మాటిమాటికీ మందుకొట్టేవాళ్ళని పిలిపించి మందు కొట్టిస్తాడు. ప్రతీ సారీ  200 డాలర్లు. మాకేమీ కనబడవు. ఆయన మాత్రం , "అదిగదిగో అక్కడ పురుగులు, ఇక్కడ పురుగులు" అని బగ్-స్ప్రే కొడతాడు.  బయట కంపెనీలని పిలిచి స్ప్రే కొట్టిస్తాడు. ఇలాగ వచ్చిన పెన్షన్ అంతా ఈ పురుగుల పాలిటి ఖర్చు చేస్తున్నాడు. ఆ మధ్య మన వార్డ్ లో ఇల్లాంటి సింప్టంస్ ఉన్న ఒక పేషంట్ ని మీరు ట్రీట్ చేశారు. మా నాన్నని గూడా తీసుకొస్తాను." ఇదీ ఆనాడు నా నర్సు చేసిన విజ్ఞప్తి .

 

ఒకప్పుడు ఎవరయినా తనలో తను మాట్లాతుంటేనో, ఎవ్వరూ పక్కన లేకుండా నవ్వడం, మొహంలో ఏవో హావభావాలు చూపించడం, ఇవి ఉన్మాది లక్షణాలుగా అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు, సెల్ ఫోన్లు, ఇయర్ ప్లగ్స్ వచ్చాక అందరూ అలాగే కనిపిస్తున్నారు. ఒకరోజు నేను మా హాస్పటల్లో, ఎంప్లోయీ బాత్ రూం కాకుండా

కవిత్వం - కొన్ని అవసరాలు

విన్నకోట రవిశంకర్

కవిత్వం - అవసరాలు అన్న అంశాన్ని అనేక కోణాల నుండి పరిశీలించవలసి ఉంటుంది.

 

ముందుగా, సమాజానికి లేదా వ్యక్తులకి కవిత్వం అవసరం ఏమిటి అన్నది చూద్దాం. కవిత్వం మన మనసుల్ని మెత్తబరిచి, మనలో చేతనా సౌకుమార్యం పెంపొందిస్తుంది కాబట్టి, అది చాలా అవసరమైన ప్రక్రియ అన్నది ఒక వాదన. ఐతే, దీనినొక ప్రతిబంధకంగా చూసేవారు కూడా లేకపోలేదు. ఎందుకంటే, అటువంటి సున్నితత్వం, లేదా త్వరగా స్పందించే గుణం కర్తవ్య నిర్వహణలో, కఠిన నిర్ణయాలు తీసుకోవటంలో అవరోధం కల్పిస్తుందని వారు భావిస్తారు. ప్రారంభ యూవనంలో ఉన్న రోజుల్లో బాధ్యతల్లేని బలం వల్ల, వర్తమానం మీద ప్రేమతో, భవిష్యత్తు మీద ఆశతో ఒక స్వప్నలోకంలో విహరించే అవకాశం వల్ల అటువంటి సున్నితత్వం సహజంగా ఆకర్షిస్తుంది. కానీ, ఒక పరిణత వయసు వచ్చాక అనే మానసిక స్థితి ఉంటుందా అన్నది సందేహమే.

 

మనం సాధారణంగా చూస్తూ ఉంటాం - పదహారేళ్ళ వయస్సులో చాలా మంది కవిత్వం రాయటంగాని, కనీసం కవిత్వం మీద అభిమానం చూపించటంగాని చేస్తూ ఉంటారు. అసలు, ఒక థీరీ ప్రకారం మనుషులందరూ పుట్టినప్పుడు ...

తెలుగు భాషకి గొడుగు గిడుగు

ప్రసాద్ తోటకూర

గొప్ప భాషా శాస్త్రవేత్త, పరిశోధకుడు, గ్రంధ పరిష్కర్త, శాసన పరిష్కర్త, పత్రికా రచయిత, విద్యావేత్త, ప్రజాస్వామిక వాది, మానవతావాది, బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది, వ్యావవాహారిక భాషోద్యమ పితామహుడు, గ్రాంధిక భాషావాదుల నెత్తిన పిడుగు, వాడుక భాషకు గొడుగు గిడుగు వేంకట రామమూర్తి పంతులు గారి స్థానం తెలుగు సాహిత్య చరిత్రలో అజరామరం.

పండితులకే పరిమితమైన సాహిత్యం, ఏ కొద్దిమందికో పరిమితమైన గ్రాంధిక భాష - గిడుగు వారి ఉద్యమంవల్ల వ్యావహారికభాషలో సాగి సాహిత్యసృష్టి, సృజనాత్మకశక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చింది. గిడుగు రామ్మూర్తి గారి జయంతి ఆగష్టు 29 ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో “తెలుగు భాషా దినోత్సవం”గా జరుపుకుంటున్న విషయం అందరికీ విదితమే. మరొక్కసారి వారి గురించి సమగ్రంగా ఈ వ్యాసరూపంలో తెలుసుకుందాం.

దేశానికి స్వాతంత్ర్యం ఎంత ముఖ్యమో, జాతికి భాషా స్వాతంత్ర్యం కూడా అంతే ముఖ్యమైనదని గట్టిగా నమ్మిన మహనీయుడు గిడుగు.    

అందాల రాముడు

         గుమ్మడిదల వేణుగోపాల్ రావు

'శ్రీరాముని దయచేతను' అంటూ ప్రారంభించి తెలుగులో మొదటి నీతి శతకం వ్రాసిన పదమూడవ శతాబ్దపు బద్దెన భూపాలుడు ఆ 'శ్రీరామ' ఒరవడికి ఆద్యుడు కాకపోవచ్చు.

 

అది ఎప్పుడు ఆరంభమైనదో సరిగ్గా తెలియదు కానీ తెలుగు వారు మాత్రం ఏదైనా వ్రాసేముందు 'శ్రీ రామ' తోనే ఆరంభిస్తారు.

 

దశరథమహారాజ సుతునిగా జన్మించిన శ్రీ రాముడు ఆదర్శ మానవుడుగా-  శిష్యుడుగా, పుతృనిగా, భర్తగా, సోదరునిగా, “దుష్టశిక్షక-శిష్టరక్షక” మరియు న్యాయపాలనా దక్షుడైన మహారాజుగా – జీవించి,  అందరిచేత  "రామో విగ్రహవాన్ ధర్మః”  లేక  'ధర్మో విగ్రహవాన్ రామః '" అని కీర్తించబడ్డాడు.

 

రాముడు తాను అవతార పురుషునిగా ఎక్కడా ప్రకటించలేదు కానీ తెలుగు వాళ్ళు చాలా ఊళ్ళల్లో ఆ దేవుని కి గుడి కట్టి ఆరాధిస్తున్నారు. మనిషి మనుగడ లో దైనందినం ఎదుర్కునే సమస్యల ఆటుపోట్లలో మనస్థైర్యాన్ని కలిగించేందుకు ఎవరో ఒకరి మానసిక ఆలంబన అవసరమవుతుంది. అది సన్నిహితులైన పెద్దలుగా గానో, ఆత్మబంధువులు గానో ఉంటే మంచిదే. కానీ వారు  అవసరమైనప్పుడల్లా ...

bottom of page