top of page
bhuvanollasam.PNG

సంపుటి  6   సంచిక  4

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

వ్యాస​ మధురాలు

అప్పిచ్చి'వాడు -వైద్యుడు- 5
 

"అంతా భ్రాంతియేనా”

girja sankar.JPG

 చింతపల్లి గిరిజా శంకర్

"మా నాన్నని చూడాలి మీరు. ఆయన ఒక్కడే ఉంటాడు. యూనివర్సిటీ నించి రిటైర్ అయ్యాక, ఆవూళ్ళోనే స్థిరపడ్డాడు. మా అమ్మ చనిపోయి 10 సంవత్సరాలు దాటింది. మళ్ళీ పెళ్ళి చేసుకోలేదు. మేము ఇద్దరు పిల్లలం నేనూ, నా అక్కా. మాదగ్గరికి రమ్మంటే రాడు.

 

గత 10 నెలలుగా ఇంట్లో పురుగులు కనిపిస్తున్నాయని, మాటిమాటికీ మందుకొట్టేవాళ్ళని పిలిపించి మందు కొట్టిస్తాడు. ప్రతీ సారీ  200 డాలర్లు. మాకేమీ కనబడవు. ఆయన మాత్రం , "అదిగదిగో అక్కడ పురుగులు, ఇక్కడ పురుగులు" అని బగ్-స్ప్రే కొడతాడు.  బయట కంపెనీలని పిలిచి స్ప్రే కొట్టిస్తాడు. ఇలాగ వచ్చిన పెన్షన్ అంతా ఈ పురుగుల పాలిటి ఖర్చు చేస్తున్నాడు. ఆ మధ్య మన వార్డ్ లో ఇల్లాంటి సింప్టంస్ ఉన్న ఒక పేషంట్ ని మీరు ట్రీట్ చేశారు. మా నాన్నని గూడా తీసుకొస్తాను." ఇదీ నా నర్సు చేసిన విజ్ఞప్తి ఆనాడు.

 

***

ఒకప్పుడు ఎవరయినా తనలో తను మాట్లాతుంటేనో, ఎవ్వరూ పక్కన లేకుండా నవ్వడం, మొహంలో ఏవో హావభావాలు చూపించడం, ఇవి ఉన్మాది లక్షణాలుగా అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు, సెల్ ఫోన్లు, ఇయర్ ప్లగ్స్ వచ్చాక అందరూ అలాగే కనిపిస్తున్నారు. ఒకరోజు నేను మా హాస్పటల్లో, ఎంప్లోయీ బాత్ రూం కాకుండా, జనరల్ బాత్ రూం కి వెళ్ళాను, లోపలికి వెళ్ళి "గోరాడెను నంతలోన..." పక్క బూత్ నించి "How are you?" అని వినబడింది. ఎవరయినా మిత్రుడేమోనని, "Fine. How are you?"  అని సమాధానం చెప్పాను. కానీ పక్క బూత్ నాథుడు నన్ను పట్టించుకోకుండా వాడి సంభాషణ కొనసాగించాడు. అప్పుడర్థమయింది నాకు, వాడు సెల్ ఫోన్ లో ఇంకెవడితోనో మాట్లాడుతున్నాడని. చెప్పక్కర్లేదుకదా నేనెలా ఫీల్ అయ్యానో?

                                                        

***

 

మా నర్సు నాన్నని అడ్మిట్ చేసి వైద్యం చేశాను. కొన్నిమందులు ఇచ్చాము. వారం రోజులకి ఆయనకి ఎక్కడబడితే అక్కడ పురుగులు కనబట్టం మానేశాయి. పూర్తిగా కోలుకున్నాడు.

 

ఈ పేషంట్ కి ఉన్న వ్యాధిని పారసైటోసిస్ [Parasitosis] అంటారు. ఆయనకి కనబడే పురుగులు లక్షణాన్ని, Visual hallucinations [దృశ్య భ్రమ] Hallucinations, illusions  అనేమాటలకి మన నిఘంటువుల్లో భ్రమ , మిధ్య, మాయ అన్న మాటలే వున్నాయి. కాని అవ్వి పూర్తిగా అర్థాన్ని చెప్పలేవు. కనికట్టు అని గూడా అనవచ్చు. బయట నిజంగా పురుగులు లెకున్నా, మరి అతనికి ఎలా కనిపిస్తున్నాయి? అంటే ఆ దృశ్యాలనీతడే సృష్టించుకుంటున్నాడన్నమాట. ఇంకొంతమంది రోగులు, చెవుల్లో, ఏదో శబ్దాలు, మాటలు, పాటలు, సంభాషణలు...ఇత్యాది వింటుంటారు. ఇలాగే, రకరకాల రుచులూ, భావోద్రేకాలూ, ఇవన్నీ గూడా మన బ్రెయిన్ లొంచే సృష్టించుకోవచ్చు. అంటేఈ hallucinations అన్నీ మన మెదడులోంచి వచ్చినవే. మెదడులో ఏస్థానం నించి పుడతాయో, ఆ రకాలయిన భ్రమ కలుగుతుంది. అనగా కన్ను కేంద్రం లోంచి వస్తే, దృశ్య hallucinations, వినికిడి సెంటర్ నించి వస్తే వినికిడి [auditory hallucinations] వగైరా. కొంతమంది రోగులకి వాళ్ళ శరీరంలోనే, పురుగులున్నట్టు అనుభూతి కలుగుతుంది. ఒక రోగి వియత్నాం యుద్ధంలో పాల్గొన్నాడు. తిరిగివచ్చిన కొన్నాళ్ళకి, "తన మెదడులోంచి రోజూ రాత్రిపూట పురుగులు బయటికి వచ్చితిరుగుతాయనీ, మళ్ళీ పొద్దున్నే మెదడులోకి వెళతాయని " గాఢ నమ్మకం.   అడ్మిట్ చేసి అతని భార్యతోగూడా మాట్లాడాను. ఆమెగూడా తను చూశానని చెప్పింది. అట్లా బ్రెయిన్ లోనించి, స్కల్ల్ బోన్ ని ఛేదించుకుని ఏదీ బయటకు రాదనీ, అసంభవమనీ, ఎన్ని చెప్పినా వాళ్ళిదరూ నమ్మలేదు.  తీరా ట్రీట్మెంట్ అయిపోయాక, అతనికి కనబళ్ళేదు  సరే,  మరి ఆమెకు గూడా కనబట్టం మానేసింది. మరి ఈ వింతేమిటి?  దీన్ని {Folie a edux...shared paranoid disorder} అంటారు. గమనించండి. ఒక సాధువుకి తన యోగబలం వల్ల కొన్ని దృశ్యాలు కనిపిస్తాయనుకోండి. లేదా కొన్ని అనుభూతులు కలుగుతాయనుకొండి. అవి వాళ్ళ శిష్యులు గూడా తమకున్నాయని అనుకుంటారు. ఇక్కడ భర్తకి మందులిచ్చాము. భార్యకి మందులు లేకుండానే నయమయ్యింది.

    

ఈ సంఘటనే ఒక వెయ్యి రెట్లు ఎన్లార్జ్ [enlarge] చేస్తే మనకీదేశంలోఈ మధ్య జరిగిన కొన్ని పొలిటికల్ సందర్భాలు అర్థమవుతాయి. ట్రంప్  అనుచరులు ఎంతమంది చెప్పినా, ఎన్ని కోర్టుల్లో చెప్పినా, "మా ట్రంప్  గెలిచాడు. మొన్న జరిగిన ఎన్నికల్లో మోసం జరిగింది" అంటున్నారు.  దీన్నే "Mass Hysteria" అంటారు. మతప్రవక్తలు కొంతమంది గూడా ఈ శక్తులు చూపిస్తారు. పాకిస్తాన్ లో 1947 దగ్గరనించి, ఈ మతంతో సంబంధించిన అస్త్రం ప్రయోగిస్తున్నారు. దాంతో. ఇటు తమ దేశ ప్రజల్నీ, అటు అమెరికా, రస్ష్యా దేశాలనిగూడా భ్రమలో ముంచేస్తున్నారు. [1. Autobiography by Malaala Yousufzi, 2. Chasing a Mirage by Tarak Fatah]

 

ఇంకొక mass hysteria 1979 లొ జరిగిన JIM JONES అనుచరులందరూ,   అతని మాటమేరకి విషం తాగి మరణించారు. 80 ల్లో జరిగిన Waco, David Koresh అనుచరుల కథ గూడా ఇలాంటిదే.

 

Auditory Hallucinations  తీసుకుంటే, ఆమాటలు  ఎప్పుడూ, ఆరోగి మాతృభాష [అతడికి మామూలుగా మాటలాడే భాష] లోనే ఉంటాయి.  ఒకప్పుడు వివిధ దేశాల్లో ప్రయోగాలు చేసి ఈవిషయం ఋజువు చేశారు. అంతే కాకుండా, Paranoid ideas ఉన్నాయనుకొండి . 

Paranoid అంటే, తన్ని ఎవరో ద్వేషిస్తున్నారు, చంపడానికి ప్రయత్నిస్తున్నారు, పోలీసులు తన వెంటబడుతున్నారు..ఇలాంటి భయంతో కూడిన అనుమానాలు. వాటి థీం [theme] గూడా అతడి దేశ కాల పరిస్థితులకనుగుణంగా ఉంటాయి. ఇండియా లో పేషంట్కి, CID  వాళ్ళు వెంబడిస్తారు. అమెరికా లో  CIA, FBI, ఇంగ్లండ్ లో నైతే  Scotland yard.   పల్లెటూరిలో ఉండేవారికి పల్లెటూరి అనుభూతులే ఉంటాయి.  

 

 

***

      

 

ఇక్కడ మనం వాడే కొన్నిమాటలకి అర్థం చెప్పుకుందాము. 1. Illusion  అంటే ఒక వస్తువుని చూసి ఇంకొకటనుకోవడం. రజ్జుసర్పభ్రాంతి ఈకోవలోకివస్తుంది. ఎండమావులు గూడా ఈకోవకిచెందుతాయి. రాత్రిపూట స్తంభాన్ని చూసి, దయ్యమనుకోవడం గూడా ఇలాంటిదే. [Post-ghost illusion.]

 

2.Hallucinations..బయట ఏమీ లేకుండా మన జ్ఞానేంద్రియాలు మనల్ని మోసం చేస్తాయి. తద్వారా మాటలు, పాటలు వినబడ్డం, వివిధ దృశ్యాలు కనబట్టం, వింత రుచులు అనుభవానికి రావడం  [ఏమీ తినకుండానే] , చర్మం మీద వివిధ స్పర్శలు [పురుగులు పాకడం గూడా ఈ రకమే] , వింత వాసనలు రావడం, మంచివాసన చెడుగా అనిపించడం & vice versa [Parosmias] కొంతమందికి sexual hallucinations  వస్తాయి [ఉదా: రంభ , ఊర్వశి వచ్చి ముద్దుపెట్టుకున్నట్టు వగైరా ]

 

సర్వ సాధారణంగా వినికిడి భ్రమ ఉన్నవాళ్ళకి ఏదొ మానసిక రుగ్మత ఉంటుంది. ఉదా: Schizophrenia, Manic Depressive illness ఇత్యాది. దృశ్య భ్రమలు సర్వసాధారణంగా డ్రగ్స్ {LSD, Speed, Etc ] వల్ల ...నాశిక భ్రమ Brain Tumors . చాలా టూకీగా , ఉదాహరణకి ఇవి చెప్పాను. మొత్తం అన్ని చెప్పాలంటే, మళ్ళీ పుస్తకం రాయాలి.

 

 ***

 

రామకృష్ణ   పరమహంస కాళికాదేవితో మాట్లాట్టం చూసి , చాలాకాలం వివేకానందుడు అవి hallucinations అనుకునేవాట్ట. కాళికాదేవి మరి ఆయనకిమాత్రమే ఎలా కనపడింది? ఆమెతో ఆయన మాట్లాడేవాడుకదా?  ఆమె చీరె గురించిగూడా ఆయన కామెంట్ చేసేవాడని మనకి ఋజువులున్నాయి. ఆయన పిచ్చివాడనలేముకదా! కాబట్టి ఈ భ్రమలన్నీ మనమే మనమెదడుని మధించి తెప్పించుకొవచ్చు. మనఋషులు, మహాత్ములు సహస్రారాన్ని సంపూర్తిగా వశం చేసుకుని, ఎప్పుడు ఏది కావాలంటే అప్పుడు ఆ అనుభూతిని పొందేవారు. ఒకసారి రామకృష్ణ  పరమహంస ఒక శిష్యుడితో   మాట్లాడుతూ, బ్రహ్మానందం అంటే ఏమిటి అని నిర్వచనానికి ఉదాహరణగా ఇలా అన్నాడు, "మీకు సంభోగ సమయంలో వచ్చే ఆనందానుభూతి, మీ దేహంలో ఉన్నా ప్రతీ రోమకూపంలోంచి ఒకే సారి వస్తే  గూడా నేను చెప్పిన ఆనందానికి సాటి రాదు [Ramakrishna's discourses. By Mr. M]

 

ఇంతకు ముందు సంచికల్లో, బ్రెయిన్ అసాధారణ శక్తిగురించి మాట్లాడుకున్నాము. ఎన్నో బిలియన్ల కణాలు, ఎన్నో ట్రిలియన్ల కనెక్షన్లతో ఉన్న మన మెదడు ని మనం సరిగ్గా ఉపయోగించుకోవటంలేదు [ఆ కనెక్షన్లు మన పాలపుంతలో ఉన్న నక్షత్రాల సంఖ్య కంటే ఎక్కువ] ఇంకొక గొప్ప లక్షణం ఏమిటంటే, Plasticity.  మనం చాలామందిని చూశాము. గుడ్డివాడికి, స్పర్శ జ్ఞానం గానీ, వినికిడిజ్ఞానం గాని కాంపెన్సేట్ చేస్తాయి.

అనగా బ్రెయిన్ లోని జీవకణాలు అవసరాన్నిబట్టి మార్పులు చేసుకోగలవనీ, ఒక ప్రక్క నీరసంగా వుంటే రెండో పక్కనించి సహాయం వస్తుందనీ ఇప్పుడంధరూ ఒప్పుకుంటారు,

                                                                 

 

ఇది నిజంగా జరిగిన ఉదంతం. ఒక పాతికేళ్ళ యువకుడికి, ఒక రకమయిన epilepsy ఉంది. అది అతని Temporal lobe లో మొదలవుతుంది ఆ మూర్చ" వచ్చినప్పుడతనికి, తను Jesus Christ అని అనుభూతి వస్తుంది. ఒక్కోసారి ఆ మూర్చ పదే పదే వచ్చి వరుసగా రెండు మూడురోజులపాటు అతడు నిర్విరామంగా  Jesus Christ అని అనుకుంటాడు. అతడి మనస్సులో అప్పుడు అంతులేని కరుణ, ప్రేమ, తప్ప ఇంకొక భావమేమీ ఉండదు. [Status Epilepticus]  ప్రపంచమంతా కరుణా సముద్రం లాగా అతనికి అనుభవానికొస్తుంది. మందులు తీసుకుంటే ఆ "రోగం" నిమ్మళించి, ఆ అనుభూతి పోతుంది. అతనికి అది నచ్చదు. కానీ epilepsy వుంటే ఉద్యోగం రాదు, డ్రైవర్స్ లైసెన్స్ రాదు. అమ్మా నాన్నా వైద్యం చేయిస్తారు  అతనికి ఇష్టంలేదు. [ఈ కథంతా 10 సంవత్సరాల కింద టీవి లొ వచ్చింది]

 

 ***

 

 

మానసిక వ్యాధులు అంటువ్యాధులా? మన దేముడు రాముడే ఉన్నాడనుకొండి. ఒకటేమాట, ఒకటే బాణం, ఒక్కతే పత్ని అని రాముడి గుణగణాలని అందరూ కీర్తిస్తారు. ఇంకో విధంగా చెప్పాలంటే, రాముడు "మొండివాడు". ఆయన గొప్పవాడు గాబట్టి, ఆయన తమ్ములూ, భార్యా, ప్రజలూ ఆయన చెప్పినది వేదం అని స్వీకరించేవారు. రాముడు భగవస్స్వరూపం గాబట్టి, ఆయన తప్పు చెయ్యడు, అందరూ ఆయన్ని అనుసరించడం వల్ల రామరాజ్యం వచ్చింది.  కానీ పాలించేవాడు మతిభ్రంశం ఉన్నవాడయితే.   తన అనుచరులందరినీ "తను ఏం చెబితే అదే వేదం అని అందరికీ భ్రమ కలిగించి సంఘాన్ని కష్టాలపాలు చేస్తాడు. ఉదా: హిట్లర్[Hitler] తన ఆవేశంతో, వాగ్ధాటితో, జర్మనులందరినీ [దాదాపు అందరినీ] ఒక Delusion లోకి తీసికెళ్ళి ["మనమంతా ఆర్యులము, Jews తక్కువరకం అని వాళ్ళని వేధించి, వెంటాడి 10 మిలియన్ల దాకా Jews ని చంపాడు. అది ఒక Mass Hysteria. 1940- 50 ల్లో అమెరికాలో McCarthy అనే సెనేటర్, తనకిష్టంలేని వాళ్ళందరినీ కమ్మ్యూనిస్ట్లని వేధించి, బాధించాడు. ఆ లిస్ట్ లో  Einstein గూడా వున్నాడు.

 

24 గంటలూ ఒకటే వింటున్నా, తిలకించినా, మన బ్రెయిన్ లో కొన్ని మార్పులు వస్తాయి. వందసార్లు చెబితే అబద్ధం నిజమవుతుంది. అదే మెదడులో నాటుకుపోతుంది. 

 

మళ్ళీ ఒకసారి రామకృష్ణ పరమహంస గురించి:  అభ్యాసం చేయగా చేయగా, ఆయన తన మెదడులో కొన్ని మార్పులు తేగలిగాడు. Insula అని ఒక బ్రెయిన్ లో ఒక భాగం ఉంది. Electrode తో దాన్ని, కదిలిస్తే, దైవ సంబంధమయిన ఆలోచనలు వస్తాయి. ప్రసిద్ధ రష్యన్ రచయిత, డాస్టొవిస్కీ [Dostoievsky]   తన అనుభవం గురించి ఈ విధంగా రాశాడు, ". a feeling of happiness which I never experience in my normal state and of which I cannot give the idea....complete harmony with myself and with the whole world" అదన్నమాట నిర్యాణమంటే. అంటే సాధనవల్ల ఆ టెంపొరల్ లోబ్ లో ఆ చోటుని  మనం మెడిటేషన్ ద్వారా గానీ, మిగిలిన యోగాలవల్లా గాని స్వాధీనపరుచుకుంటే, అదే జీవన్ముక్తి!

 

***

 

"అది నేను కాదు నా  ఇంకో పర్సనాలిటీ  చేశాడు. Sybil అనే పుస్తకం చాలామంది చదివుంటారు. Multiple personality అని ఒక వ్యాధి ఉన్నది. వచ్చే సంచికలో ఆ జబ్బు వున్న వ్యక్తుల్ని పరిచయం చేస్తాను.

 

చిన్న పిట్టకథ. ఒక మాస్టారు పిల్లవాడికి వ్యాకరణం చెప్తున్నాడు. "ప్రతీ వాక్యంలో కర్తా, కర్మా, క్రియ మూడుంటాయి రా బడుద్ధాయ్.  సుశీల  సుబ్బారావుని పెళ్ళి చేసుకుంది. ఇక్కడ సుశీల కర్త, పెళ్ళిచేసుకోవడం క్రియ, ఆ సుబ్బారావు ఆమె ఖర్మ"

 

ఈ జబ్బుకి మొట్ఠమొదట పునాది వేసినవాడు  Robert Louis Stevenson in Dr. Jekyll and Mr. Hyde. 

*****

bottom of page